రూ.18.43 కోట్లతో రోడ్ల అభివృద్ధి | road development with Rs 18.43 crore | Sakshi
Sakshi News home page

రూ.18.43 కోట్లతో రోడ్ల అభివృద్ధి

Published Mon, Dec 9 2013 5:12 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM

road development with Rs 18.43 crore

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్:  కోవూరు నియోజకవర్గంలోని వివిధ రోడ్ల అభివృద్ధికి రూరల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.18.43 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆదివారం తెలిపారు. కోవూరు ఇనమడుగు సెంటర్ నుంచి ముదివర్తి వరకు (1/0 నుంచి 16/0 వరకు) రూ.13.35 కోట్లతో రోడ్డు వెడల్పుతో పాటు తారురోడ్డు నిర్మాణం జరగనుందన్నారు.
 నెల్లూరు మైపాడు రోడ్డు నుంచి కుడితిపాళెం వరకు (కి.మీ. 16/0 నుంచి 27/4 వరకు), ఇందుకూరుపేట లూప్ రోడ్డు నుంచి పోట్లపూడి వరకు (కి.మీ 0/0 నుంచి 3/0 వరకు) రెండు రోడ్ల అభివృద్ధికి రూ.1.90 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. బుచ్చిరెడ్డిపాళెం నుంచి దగదర్తి వరకు (కి.మీ 13/5 నుంచి 21/0 వరకు) రోడ్ల అభివృద్ధికి రూ.1.83 లక్షల నిధులు కేటాయించారన్నారు.
 ఎంసీ రోడ్డు నుంచి ఎంసీ రోడ్డు వరకు వయా గండవరం, పెద్దపుత్తేడు, చవటపుత్తేడు, ఊచగుంటపాళెం వరకు ( కి.మీ. 7/4 నుంచి 16/4 వరకు) రూ.1.35 లక్షలు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ప్రసన్న తెలిపారు. రోడ్ల మంజూరుకు సహకరించిన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement