
కొడవలూరు : గత టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు, స్థలం, పింఛన్ ఇలా ఏ పథకం పొందాలన్నా జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చి పారదర్శక పాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు.
కొడవలూరు ఇరిగేషన్ అతిథిగృహంలో కొడవలూరు, మానేగుంటపాడు గ్రామ వలంటీర్‌లతో ఆయన శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు గ్రామ, మండలస్థాయి అధికారులను లెక్క చేసే వారు కాదని, అధికారులు అర్హులకు న్యాయం చేయాలన్నా చేయలేని పరిస్థతి ఉండేదని చెప్పారు. నేడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి సుపరిపాలనకు శ్రీకారం చుట్టారన్నారు. కొడవలూరులో రెండు చోట్ల సైడ్ డ్రెయిన్ల నిర్మాణం కోసం రూ.10 లక్షలు, మానేగుంటపాడులో సైడ్ డ్రెయిన్‌కు రూ.5 లక్షల ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు.
కోవూరు నియోజకవర్గానికి గడిచిన రెండేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా రూ.450 కోట్లను అందించడం జరిగిందన్నారు. అనంతరం ఓటీఎస్ లబి్ధదారులకు రిజి్రస్టేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, డీసీఎమ్మెస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైఎస్సార్‌సీపీ మండల కనీ్వనర్ వెంకటశేషయ్య, సర్పంచ్‌లు పాలిచర్ల శ్రీనివాసులురెడ్డి, కామాక్షి, ఎంపీటీసీ సభ్యుడు ప్రతాప్, నాయకులు సునీతమ్మ, తిరుపతమ్మ, సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment