Valenteers services
-
చంద్రబాబుకు తగ్గట్టే.. టీడీపీ అభ్యర్దుల నోటి జారుడు!
వాలంటీర్ల వ్యవస్థ మీద, వాలంటీర్ల మీద తెలుగుదేశం లీడర్లు చేస్తున్న కామెంట్లు, అనుసరిస్తోన్న ధోరణి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోంది. చంద్రబాబు తగ్గట్టే కొందరు టీడీపీ అభ్యర్దులు కూడా నోటికి ఎంత మాట వస్తే అంతా మాట్లాడి వివాదాస్పదులవుతున్నారు. వలంటీర్లను స్లీపర్ సెల్స్ అని, టెర్రరిస్టులని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్ది బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడం దారుణంగా ఉంది. దీనిపై వలంటీర్లు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వలంటీర్లపై ద్వేషంతో ప్రవర్తిస్తోంది. తొలుత చంద్రబాబు కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినా, ఆ తర్వాత వారి ప్రాముఖ్యత, ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను గుర్తించక తప్పలేదు. మొదట వలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు అవహేళన చేశారు. ఇళ్లలో మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు కొడుతున్నారని నీచంగా ఆరోపించారు. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి, తాను కూడా వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని ప్రకటించారు. పైగా 'వలంటీర్లకు ఏభై వేల రూపాయల వరకు వచ్చే ఏర్పాటు చేస్తారట. అదెలాగో ఎవరికి తెలియదు'. వలంటీర్లకు ఆయన తాయిలాలు వేసే దశకు వచ్చారంటే ఆ వ్యవస్థ ఎంత బలంగా నాటుకుంది అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికు ప్లస్ అవుతున్నదన్నదే ఆయన బాధ. టీడీపీ నేతలలో వలంటీర్లు అంటే భయం ఏర్పడింది. దానికి తోడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు చేసిన అనుచిత వ్యాఖ్యల ప్రభావం తమమీద పడుతుందేమోనన్న సందేహం వారిలో ఉంది. 'పవన్ కల్యాణ్ అయితే ఏకంగా వలంటీర్లను కిడ్నాపర్లతో పోల్చారు. నిజానికి వలంటీర్లలో అరవై నుంచి డెబ్బై శాతం మంది మహిళలు ఉన్నారు. అయినా వీరిద్దరూ దారుణంగా మాట్లాడారు. వారికంటే తానేమీ తక్కువ తీసిపోలేదన్నట్లు సుధీర్ రెడ్డి వంటి వారు మరీ మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురి అవుతున్నారు'. కరోనా కష్టకాలంలో ఏపీలో ప్రజలకు అండగా ఉండి వలంటీర్లు చేసిన సేవలను ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. సొంత కుటుంబ సభ్యులే పలకరించడానికి భయపడిన రోజుల్లో కరోనా సోకిన వారిని ఆస్పత్రులలో చేర్చి, వారికి చికిత్స జరిగేదాక శ్రద్ద తీసుకున్న వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చారంటే వారి సంస్కారం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వలంటీర్ల వ్యవస్త సఫలం అవుతుందని తెలుగుదేశం, జనసేన నేతలు ఊహించలేదు. అందుకే ఇష్టారీతిన మాట్లాడి నోరుపారేసుకున్నారు. ఆ తర్వాత తప్పును గుర్తించినా లాభం లేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో వలంటీరు వందల మందిని ప్రభావితం చేయగలిగే శక్తి మంతులయ్యారన్నది వీరి అనుమానం. వలంటీర్లు సేవలందిస్తున్న ఆ వ్యవస్థను నెలకొల్పి ప్రజల ఇళ్ల వద్దకే పాలనను తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డిది. ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతోంది. కులం, ప్రాంతం, పార్టీ.. ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఏపీలో మొదటిసారిగా ఇలా స్కీములు అమలు అవుతున్నాయి. 'గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేస్తే, అవినీతి విశృంఖలంగా చేస్తే టీడీపీ గబ్బు పట్టిపోయింది'. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వలంటీర్ల సేవలు ప్రజలకు బ్రహ్మాండంగా అందుతుండడంతో పూర్వకాలంలో టీడీపీకి ఓటు వేసినవారు సైతం ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు మొగ్గుతున్నారు. దాంతో కంగారు పుట్టిన టీడీపీ నేతలు అనుచితంగా మాట్లాడి మరింత అప్రతిష్టపాలవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. వీరి సేవలకు సంతోషపడి ఒక్కో వలంటీర్‌కు పది మంది చొప్పున టీడీపీ వారు మారినా, పాతిక లక్షల మంది వైఎస్సార్సీపీకి అనుకూలం అవుతారన్నది వీరి అంచనా. అందుకే వలంటీర్ల వ్యవస్థను అవుననాలో, లేక కాదానలో తేల్చుకోలేక, ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడి మరింతగా పలచన అవుతున్నారు. 'గతంలో రోజుల తరబడి వృద్ధులు తమ పెన్షన్ల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరగవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఇళ్లకే వలంటీర్లు వచ్చి ఇస్తుండడంతో వృద్ధులంతా పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను తమ బిడ్డగా చూసుకుంటున్నారు. ఆ విషయాన్ని వారు బహిరంగంగానే చెబుతున్నారు. సహజంగానే అది టీడీపీవారికి గంగవెర్రిలెత్తిస్తుంటుంది'. 'చిత్రం ఏమిటంటే ప్రధాని మోదీని చంద్రబాబు టెర్రరిస్టు అని వ్యాఖ్యానిస్తే, టీడీపీ నేతలు బొజ్జల వంటివారు వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతున్నారు'. చంద్రబాబు ఇప్పుడు మోదీని పొగుడుతున్నట్లే వీరు కూడా వలంటీర్లను ప్రశంసించక తప్పని స్థితి ఏర్పడింది. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏభై ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తే, ఇప్పుడు చంద్రబాబు ప్రతి ఇరవై కుటుంబాలకు ఒక వలంటీర్‌ను పెడతానని చెబుతున్నారు. ఇంటి వద్దకే పెన్షన్ పంపిస్తానని అంటున్నారు'. జనం వీటిని నమ్ముతారా? కచ్చితంగా నమ్మరు. వలంటీర్లను తెగతిట్టి, ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిని పెడతామంటే అన్నిటిలోను యుటర్న్ తీసుకున్నట్లు దీనిలో కూడా మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి పాట్లు పడుతున్నారని తెలియడం లేదా! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వలంటీర్ దారుణ హత్య! తలపై మారుణాయుధాలతో దాడి..
కర్నూలు: గుర్తు తెలియని దుండగుల చేతిలో వలంటీర్ దారుణహత్యకు గురైన ఘటన పట్టణంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండిగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన ఈరమ్మ కుమారుడు హరిబాబు(23) భరత్ నగర్ వలంటీర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల వరకు వినాయక విగ్రహ మండపాల వద్ద ఉన్న హరిబాబు ఆ తర్వాత ఇంటికెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. మధ్యరాత్రి 12 గంటల సమయంలో ఫోన్ రావడంతో బయటకు వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. తెల్లవారుజామున ఈరమ్మ నిద్రలేచి చూడగా కుమారుడు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారిని విచారించి బంధువులకు సమాచారం ఇచ్చింది. అందరూ కలిసి వెతుకుతుండగా సమీపంలోని మారెమ్మవ్వ గుడి పక్కన రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడని తెలిసి అక్కడకు చేరుకుని తల్లి గుండెలు బాదుకుంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు విక్రమసింహా, శ్రీనివాసనాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తలపై మారుణాయుధాలతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో మృతుడి సెల్ ఫోన్, ఆనవాళ్లను సేకరించి, కర్నూలు నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. తల్లి, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, త్వరలోనే హంతకులను పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. నేనెట్టా బతికేది నాయనా.. హత్యకు గురైన కుమారుడు హరిబాబు మృతదేహంపై పడి తల్లి ఈరమ్మ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. భర్త పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందడంతో కొడుకే లోకంగా బతికేది. వలంటీర్‌గా సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందుతుండటం చూసి పొంగిపోయేది. హఠాత్తుగా హత్యకు గురికావడంతో ‘నేనెట్టా బతకాలి నాయనా’ అంటూ గుండెలు బాదుకుంది. -
కలెక్టర్ కార్యాలయం పేరు చెప్పి బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: గుర్తు తెలియని అగంతకుడి చేతిలో ఏఎన్ఎం, వలంటీరు ఇద్దరూ మోసపోయారు. ఉన్నతాధికారులు ఫోన్ చేశారని భావించి అగంతకుడికి వివరాలు అందజేసి, వారి బ్యాంక్ ఖాతాలోని నగదు అపహరణకు కారకులయ్యారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఘటనకు సంబంధించి ఇరువర్గాలు అనంతపురం నాల్గో పట్టణ పోలీసులను ఆశ్రయించాయి. ఇరువర్గాలను విచారించిన అనంతరం ఇది సైబర్ నేరస్తుడి పనిగా సీఐ జాకీర్ హుస్సేన్ నిర్ధారించారు. గురువారం వివరాలను విలేకరులకు ఆయన వెల్లడించారు. రుద్రంపేటలోని సచివాలయం–2 పనిచేస్తున్న ఏఎన్ఎం ఎర్రమ్మ, వలంటీర్ మమతకు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి కలెక్టర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. కోవిడ్‌తో మృతి చెందిన బాధిత కుటుంబసభ్యులకు అందించే పరిహారం విషయంలో ఫోన్ చేశానని, వారి వివరాలు, ఫోన్ నంబర్లు ఇవ్వాలని కోరాడు. ఇది నిజమని భావించిన ఏఎన్ఎం, వలంటీర్ వెంటనే అగంతకుడు అడిగిన సమాచారాన్ని అందజేశారు. ఇదే విషయాన్ని బాధిత కుటుంబసభ్యులకు తెలిపి, కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వస్తే వారు అడిగిన వివరాలు అందజేయాలని సూచించారు. సచివాలయం సిబ్బంది చెప్పిన ప్రకారమే పామిడి ఓబుళమ్మ మనవరాలు భారతి తనకు వచ్చిన ఫోన్ కాల్ అందుకుని అవతలి వ్యక్తి అడిగిన వివరాలు అందించింది. కాసేపటికి ఆమె బ్యాంక్ ఖాతాలోని రూ.58 వేలు మాయమయ్యాయి. అలాగే కరోనాతో మృతి చెందిన లక్ష్మీనరసమ్మ కుమారుడు మాధవ ఖాతాలో నుంచి రూ.46 వేల కాజేశాడు. ఇరువురి ఖాతాలోనూ నగదు మాయం కావడంతో వారు ఏఎన్ఎం, వలంటీర్‌ను నిలదీశారు. తమ బ్యాంక్ ఖాతాలోని నగదు కాజేసింది మీరేనంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు, సచివాలయ సిబ్బంది ఉమ్మడిగా నాల్గో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. (చదవండి: ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో అదే హాట్ టాపిక్) -
ఆశ చూపించి.. ఉసూరుమనిపించి..
ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): నిధుల సేకరణలో కమీషన్లు ఆశ చూపించి మా ప్రేమ సంస్థ యజమాని ముకుందా తమను మోసం చేశారంటూ ఓ వికలాంగ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంవీపీ కాలనీలోని మా ప్రేమ సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు, వికలాంగుడైన ముద్దులు సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ఏడాది క్రితం వరకు మా ప్రేమ సంస్థలో వలంటీర్‌గా పని చేశానన్నారు. చారిటీ పేరిట సేకరించిన నిధుల్లో ప్రతి రోజు సగం కమిషన్‌గా ఇస్తానని సంస్థ అధినేత ముకుందా నమ్మబలికాడన్నారు. దీంతో తెన్నేటి పార్కు నుంచి ఆర్కే బీచ్ వరకు పర్యాటకుల నుంచి రోజూ రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు సేకరించి ముకుందాకు ఇచ్చేవాడినన్నారు. కొన్ని రోజులు కమీషన్ సక్రమంగానే ఇచ్చిన ముకుందా.. తరువాత ఆపేశారని ఆరోపించారు. దీనికి తోడు జాలరిపేటకు చెందిన పలువురు మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి, వారి నుంచి డిపాజిట్ కింద రూ.3 వేలు తీసుకోవాలని తనకు సూచించాడన్నారు. దీంతో పదుల సంఖ్యలో మహిళల నుంచి నిధులు సేకరించినట్లు తెలిపారు. అయితే వారికి ఎలాంటి రుణాలు ఇవ్వకపోవడంతో వారిలో కొందరు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని సంతోష్‌కుమార్ తెలిపారు. డబ్బులు విషయంపై ప్రశ్నించడంతో తనను వలంటీర్‌గా తొలగించాడన్నారు. న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని, ఎంవీపీ పోలీసు స్టేషన్లో ముకుందాపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ముకుందాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. (చదవండి: అలలపై కలల నావ..!) -
నాడు అవినీతి, నేడు పారదర్శక పాలన
కొడవలూరు : గత టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు, స్థలం, పింఛన్ ఇలా ఏ పథకం పొందాలన్నా జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చి పారదర్శక పాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. కొడవలూరు ఇరిగేషన్ అతిథిగృహంలో కొడవలూరు, మానేగుంటపాడు గ్రామ వలంటీర్లతో ఆయన శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు గ్రామ, మండలస్థాయి అధికారులను లెక్క చేసే వారు కాదని, అధికారులు అర్హులకు న్యాయం చేయాలన్నా చేయలేని పరిస్థతి ఉండేదని చెప్పారు. నేడు సీఎం జగన్మోహన్రెడ్డి వలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి సుపరిపాలనకు శ్రీకారం చుట్టారన్నారు. కొడవలూరులో రెండు చోట్ల సైడ్ డ్రెయిన్ల నిర్మాణం కోసం రూ.10 లక్షలు, మానేగుంటపాడులో సైడ్ డ్రెయిన్‌కు రూ.5 లక్షల ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. కోవూరు నియోజకవర్గానికి గడిచిన రెండేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా రూ.450 కోట్లను అందించడం జరిగిందన్నారు. అనంతరం ఓటీఎస్ లబి్ధదారులకు రిజి్రస్టేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, డీసీఎమ్మెస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ వెంకటశేషయ్య, సర్పంచ్‌లు పాలిచర్ల శ్రీనివాసులురెడ్డి, కామాక్షి, ఎంపీటీసీ సభ్యుడు ప్రతాప్, నాయకులు సునీతమ్మ, తిరుపతమ్మ, సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. -
వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవడమేంటి?
సాక్షి, విశాఖ: వాలంటీర్ల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. ప్రతిరోజు ఏదో ఒక న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ యంత్రాగాన్ని పని చేయనీయకుండా అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 2 లక్షల 60 వేల మంది వలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేయటాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు వారి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఉత్తర్వులను జారీ చేయకుండా ఎన్నికల కమిషనర్‌ను నియంత్రించాలని ఆయన కోరారు. కమిషనర్ ఇచ్చిన న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులపై ప్రభుత్వం ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించడం ద్వారా కోర్టు సమయం కూడా వృధా అవుతుందని పేర్కొన్నారు. వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకుంటే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు విఘాతం కలుగుతుందని, దాని వల్ల రాష్ట్రంలోని పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందని వెల్లడించారు. ఎన్నికల కమిషనర్ ఒక అధికారిలా కాకుండా రాజకీయ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు కుప్పం ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా తీరు మార్చుకోలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానకుంటే కుప్పంలో పట్టిన గతే రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పడుతుందని జోస్యం చెప్పారు. -
టెక్నాలజీతో చెంతకు చేర్చుతారట!
హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు వెళ్తున్నారా? మీ వెంట పిల్లలు, వృద్ధులను తీసుకెళ్తున్నారా? అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భక్తజన రద్దీలో వీరు తప్పిపోయే ప్రమాదం ఉంది. ఇలా తప్పిపోయిన వారిని వారి కుటుంబీకుల దగ్గరికి చేర్చేందుకు పుష్కర పర్యవేక్షణాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకు వలంటీర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ‘ కృష్ణా పుష్కరాలు చైల్డ్ ట్రాకింగ్’ అనే యాప్ ద్వారా సేవలందిస్తున్నారు. ఈ యాప్ వివరాలు మీకోసం.. వివరాల నమోదు..పుష్కర ఘాట్ల వద్ద ఉన్న హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించి మీ ఫోన్లోని ‘కృష్ణా పుష్కరాలు చైల్డ్ ట్రాకింగ్’ యాప్‌లో వివరాలు నమోదు చేయాలి. యాప్ ఓపెన్ చేయగానే పిల్లలు, వృద్ధులు అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని గార్డియన్, చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి. అనంతరం అక్కడి హెల్ప్‌డెస్క్ సిబ్బంది పిల్లలు/వృద్ధుల చేతికి ఒక రిస్ట్ వాచ్ బ్యాండ్ వేస్తారు. ఇది తడవదు, చినగదు. ఒకవేళ మీ దగ్గర యాప్ లేకపోయినా పర్వాలేదు. నేరుగా హెల్ప్‌డెస్క్‌కు వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవచ్చు. అప్పగిస్తారిలా.. తప్పిపోయిన పిల్లలు/వృద్ధులను పుష్కర ఘాట్లలో పనిచేస్తున్న వలంటీర్లు వాకబు చేస్తారు. వారి చేతికున్న బ్యాండ్ సహాయంతో గార్డియన్ వివరాలు సేకరిస్తారు. సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేసి సందేశం ఇస్తారు. ఒకవేళ ఫోన్ పోతే అడ్రస్ ఆధారంగా వారిని కుటుంబీకులకు అప్పగిస్తారు.