
సాక్షి, విజయవాడ : డ్వాక్రా మహిళలనుద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన మాటలతో ఆయన బేలతనం బయపటపడిందని, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు చంద్రబాబును ఛీకొడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జోగిరమేష్ విమర్శించారు. గురువారం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు ఇచ్చన హామీ గుర్తులేదా అంటూ వారిని మోసం చేసిన విషయం మర్చిపోయారా అంటూ మండిపడ్డారు.
పసుపు, కుంకుమ పేరుతో మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో అక్కచెల్లెమ్మలు టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు బుద్ది చెప్పడానికి డ్వాక్రా మహిళలు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. వాళ్లు ఓట్లు కాదు వేయించేది చెంప చెల్లుమనేలా లెంపలేస్తారని ఎద్దేవాచేశారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ఇంకా ఏ మొహం పెట్టుకొని బీసీ గర్జన పెడతావంటూ ప్రశ్నించారు. ఈనెల 28న విజయవాడలో గౌడ, శెట్టిబలిజ కులస్థుల సమావేశం, వారి సమస్యలపై వైఎస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ సమావేశం ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment