టీడీపీకి చెందిన మహిళా సంఘాల ప్రతినిధులను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న భూమన కరుణాకరరెడ్డి
చిత్తూరు, తిరుపతి సెంట్రల్ : జననేత జగన్ సీఎం కాగానే డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలను చెల్లిస్తారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు వేమూరి జ్యోతి ప్రకాష్, రాజారెడ్డిల ఆధ్వర్యంలో తిరుపతి నగరం ఐదో డివిజన్ కొర్లగుంట మారుతీనగర్ మహిళా సంఘాల ప్రతినిధులు శ్రీలత, రాధ, దేవి, భాగ్యలక్ష్మి, కస్తూరి, సావిత్రి, లక్ష్మి, ధనలక్ష్మి, జయమ్మ, సుబ్బమ్మ, ప్రేమకుమారి, ప్రమీల, నిర్మల, చిట్టెమ్మ, మోహన, తనూజ, సంధ్య, మంజుల, గిరిజ, మమత, సుజాత గురువారం సాయంత్రం వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి భూమన కరుణాకరరెడ్డి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు చెల్లిస్తారన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం, ప్రాధాన్యం లభిస్తుందని భరోసా ఇచ్చారు. వైఎస్.జగన్‌ను సీఎంగా గెలిపించుకోవడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్‌కే.బాబు, దుద్దేల బాబు, ఎంవీఎస్ మణి, చెలికం కుసుమ, ఆరె అజయ్‌కుమార్, వాసుయాదవ్, చింతా రమేష్‌యాదవ్, బత్తల గీతాయాదవ్, కేతం జయచంద్రారెడ్డి, తొండమల్లు పుల్లయ్య, రామకృష్ణారెడ్డి, రవి, చిమటా రమేష్, శాంతారెడ్డి, పద్మజ, పుష్పాచౌదరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment