సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: డ్వాక్రా మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా ఐటీడీఏలో పాలకమండలి సమావేశం జరగలేదని, ఇప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే మహిళలకు పెద్దపీట వేశామని పేర్కొన్న భట్టి విక్రమార్క.. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, త్వరలో డ్వాక్రా మహిళలందరికీ వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment