
రుణాల వసూళ్లపై అలసత్వం వహిస్తే చర్యలు
రుణాల వసూళ్లపై సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయ భవనంలో నియోజకవర్గంలోని డీఆర్డీఏలోని ఏపీఎం, సీసీలతో సమావేశం నిర్వహించారు.
పులివెందుల రూరల్ : రుణాల వసూళ్లపై సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయ భవనంలో నియోజకవర్గంలోని డీఆర్డీఏలోని ఏపీఎం, సీసీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులకు బ్యాంకర్ల నుంచి విరివిగా రుణాలు అందించి.. వాటిని సభ్యులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్వాక్రా మెంబర్లు, సన్న, చిన్నకారు రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్మీ కంపోస్ట్ యూనిట్లు, పొట్టేళ్ల పెంపకం, మనకోడితో పాటు ఇతర పథకాలపై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏరియా కో ఆర్డినేటర్ వసంతకుమారి, ఏపీఎం, సీసీలు తదితరులు పాల్గొన్నారు.