
డ్వాక్రా రుణాలు చెల్లించొద్దు: చంద్రబాబు
మహిళలు డ్వాక్రా రుణాలను చెల్లించకూడదని, తమ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: మహిళలు డ్వాక్రా రుణాలను చెల్లించకూడదని, తమ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. వారికి బ్యాంకుల నుంచి కొత్తగా రుణాలు ఇప్పించి అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. శుక్రవారం ఎన్‌టీఆర్ భవన్‌లో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన డ్వాక్రా మహిళలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. త్వరలో మండల, నియోజకవర్గ స్థాయుల్లో, ఫిబ్రవరిలో లక్షమంది మహిళలతో హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తామని తెలిపారు.