
సాక్షి, ఏలూరు: చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాబు సభకు వచ్చిన మహిళలకు విద్యుత్ షాక్ తగిలింది. చంద్రబాబు రాగానే జెండాలు పైకెత్తమని టీడీపీ నేతలు వీరికి సూచించారు. అయితే ఆ జెండాలు విద్యుత్ తీగలకు తగలడంతో షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో 9 మంది మహిళలు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు.
బాబు సభలో జనం కన్పించేందుకు ఒక్కో మహిళకు రూ.300 ఇస్తామని చెప్పి టీడీపీ నేతలు వీరిని తీసుకొచ్చారు. మహిళలు విద్యుత్ షాక్‌కు గురయ్యారని తెలిసి కూడా చంద్రబాబు వారిని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో డబ్బులు ఇస్తామని ఆశ చూపి తమను పట్టించుకోకుండా వదిలేశారంటూ బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: దగాకోరు డ్రామాలు!