మహిళల భద్రతకు ‘పచ్చ’ముప్పు | Babu conspiracy targeting women: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు ‘పచ్చ’ముప్పు

Published Sun, May 12 2024 5:19 AM | Last Updated on Sun, May 12 2024 5:19 AM

Babu conspiracy targeting women: Andhra Pradesh

వారి వ్యక్తిగత వివరాలన్నీ టీడీపీ ‘వుయ్‌’ యాప్‌లోకి.. 

వ్యక్తిగత గోప్యత చట్టానికి విరుద్ధంగా ఎల్లోగ్యాంగ్‌ కుట్ర

ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టాల ఉల్లంఘన.. ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించిన చంద్రబాబు ముఠా 

ఈ సమాచారం బూత్‌ కమిటీలకు చేర్చిన టీడీపీ 

దీంతో ఆ వివరాలు ఆకతాయిలు, వీధి రౌడీలు, మహిళలపై దాడులకు పాల్పడే వారు, ఇతర నేరచరితులకు అందుబాటులోకి..

తద్వారా ఫోన్లుచేసి వేధించడం.. ఫొటోల మార్ఫింగ్‌ వంటి సైబర్‌ నేరాలకు ఆస్కారం 

ఈ యాప్‌ను ఎన్నికల సంఘం తొలగించాలంటున్న మేధావులు 

మహిళలను భయపెట్టండి

వారి ఓటింగ్‌ శాతాన్ని తగ్గించండి.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు డైరెక్షన్‌

సాక్షి, అమరావతి : చంద్రబాబుకు జీవన్మరణ సమస్యగా మారిన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన మునుపెన్నడూలేని రీతిలో బరితెగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలకు పన్నాగం పన్నుతూ యావత్‌ మహిళల భద్రతకు పెనుముప్పుగా మారారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ రూపొందించిన ‘వుయ్‌ యాప్‌’ రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రమాదంగా పరిణమించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టాలను ఉల్లంఘించి రూపొందించిన ఈ యాప్‌ మహిళల భద్రత పాలిట పెనుగండంగా మారింది. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న టీడీపీ ‘వుయ్‌ యాప్‌’ బాగోతం కథాకమామిషు ఏమిటంటే.. 

వ్యక్తిగత సమాచారం అంతా ‘పచ్చ’ముఠా గుప్పెట్లో
రాష్ట్రంలో ఓటర్ల వివరాలన్నింటినీ చంద్రబాబు ముఠా అక్రమంగా సేకరించింది. గతంలో అధికారంలో ఉండగా నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్‌కు అనుసంధించారు. ప్రస్తుతం కూడా టీడీపీ అదే రీతిలో ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించింది. ఓటర్ల పేర్లు, చిరునామాలు, వయసు, ఆధార్‌ నంబర్లు, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల నంబర్లతో పాటు ఫొటోలు.. ఇలా పూర్తి వివరాలను వుయ్‌ యాప్‌లో పొందుపరిచారు. వాటిలో రాష్ట్రంలోని 2.10 కోట్ల మహిళా ఓటర్ల వివరాలు వారి ఫొటోలతో సహా ఉండటం గమనార్హం.

 అంటే.. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన యవతులు, మహిళల పూర్తి వ్యక్తిగత సమాచారం అంతా టీడీపీ గుప్పెట్లోకి వచి్చందన్న మాట. ఈ సమచారాన్ని వుయ్‌ యాప్‌ ద్వారా టీడీపీ బూత్‌కమిటీలకు చేర్చింది. దీంతో ఆకతాయిలు, వీధి రౌడీలు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారు, ఇతర నేరచరితులకు  ఈ వివరాలన్నీ అందుబాటులోకి వచ్చినట్లే. 

వేధింపులకు అవకాశం.. భద్రతకు ముప్పు
టీడీపీ పాల్పడుతున్న ఈ అక్రమాలు రాష్ట్రంలోని మహిళల భద్రతకు పెనుముప్పుగా పరిణమించాయి. ఎందుకంటే ఆకతాయిలు మహిళల ఫోన్‌ నంబర్లకు ఫోన్లుచేసి వేధించొచ్చు.. ఫొటోలను ఎవరైనా మార్ఫింగ్‌ చేసి సైబర్‌ నేరాలకు పాల్పడొచ్చు.. వారి బ్యాంకు ఖాతాలను హ్యాకింగ్‌ చేసి ఆరి్థక నేరాలకు పాల్పడొచ్చు.. ఇలా..  ఎటువంటి నేరాలకైనా పాల్పడేందుకు ఆ యాప్‌ అవకాశం కలి్పస్తోంది.

టీడీపీ కుట్ర కచి్చతంగా రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు భంగకరం. వ్యక్తిగత గోప్యత హక్కుకు ప్రమాదకరం. ఈ నేపథ్యంలో.. వుయ్‌ యాప్‌ పేరుతో టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడటంతోపాటు రాష్ట్రంలోని మహిళల భద్రతకు పెను ప్రమాదాన్ని తీసుకొచి్చందని మేధావులు, రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ (ఈసీ)తోపాటు పోలీసు యంత్రాంగం తక్షణం స్పందించి ఈ యాప్‌ను తొలగించాలని కోరుతున్నారు. చంద్రబాబుతోపాటు వుయ్‌ యాప్‌ రూపొందించిన వారిపై కుట్ర కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.  

విధ్వంసాలకు బాబు స్కెచ్‌
మరోవైపు.. ఓటమి భయంతో అసలే బెంబేలెత్తుతున్న చంద్రబాబు మహిళా ఓటర్లు పేరెత్తితే రగిలిపోతున్నారు. వారంతా ముక్తకంఠంతో సీఎం జగన్‌కే మద్దతు ప్రకటిస్తుండడంతో బాబుకు కంటిమీద కునుకు కరువైంది. దీంతో ఆయన విధ్వంసకర కుట్రకు తెరతీశారు. పోలింగ్‌ సందర్భంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలకు స్కెచ్‌ వేశారు. మహిళల ఓట్లు ఎలాగూ సాధించలేం కాబట్టి వారి ఓటింగ్‌ శాతాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించేందుకు తెగబడుతున్నారు. ఇందులో భాగంగా రాబోయే 24 గంటల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చంద్రబాబు పన్నాగం పన్నారు.  

రెచ్చగొట్టి దాడులకు తెగబడాలి.. 
పోలింగ్‌ బూత్‌లకు వెళ్లే మహిళలను ఆకతాయిలతో రెచ్చగొట్టి.. అసభ్య పదాలతో దూషించి.. వారు దానిపై ప్రశి్నంచగానే టీడీపీ గూండాలు ఘర్షణలకు దిగి.. దాడులకు తెగబడేలా చేయాలన్నది చంద్రబాబు బ్లూప్రింట్‌. ఈ కుట్రను పక్కాగా అమలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు, నేతలు తమ మందీమార్బలాన్ని, గూండాలను సమీకరించుకుని.. వారికి కర్రలు, కత్తులతోపాటు ఇతర ఆయుధాలను కూడా అందించి పోలింగ్‌ను భగ్నం చేసేందుకు తద్వారా మహిళల ఓటింగ్‌ను తగ్గించేందుకు సన్నద్ధమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  

మహిళలే లక్ష్యంగా బాబు కుట్ర..
ఇక ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్రంలోని ఎన్నికల ముఖచిత్రం ఏమిటన్నది చంద్రబాబుకు స్పష్టమైంది. ప్రజలంతా వైఎస్సార్‌సీపీపట్ల పూర్తి సానుకూలంగా ఉన్నారన్నది తేలిపోవడం.. మహిళా ఓటర్లు సీఎం జగన్‌కు నీరాజనాలు పడుతున్నారని అన్ని జాతీయ సర్వేలతో సహా స్పష్టంచేస్తుండటంతో ఆయన  రగిలిపోతున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లుండగా.. వారిలో మహిళా ఓటర్లే 2.10 కోట్ల మంది ఉన్నారు. తన ఐదేళ్ల పాలనలో జగన్‌ మహిళలకు పెద్దపీట వేశారు. డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాల ద్వారా మొత్తం రూ.2.83 లక్షల కోట్ల మేర లబ్ధి వారికి చేకూర్చి దేశంలోనే కొత్త చరిత్రను సృష్టించడంతో సీఎం జగన్‌కు మహిళలు జేజేలు పలుకుతున్నారు. దీంతో మహిళల ఓట్లపై చంద్రబాబు దాదాపుగా ఆశలు వదిలేసుకోవడం.. టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో కూరుకుపోవడంతో మహిళా ఓటర్లే లక్ష్యంగా బాబు విధ్వంసానికి కుట్ర పన్నారు.

అడ్డుకట్ట వేయాల్సింది ఈసీ, పోలీసులే
ఈ నేపథ్యంలో.. పోలింగ్‌ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ (ఈసీ), పోలీసు యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహణ కోసం వెబ్‌కాస్టింగ్, వీడియో రికార్డింగ్‌ తదితర చర్యలు తీసుకుంటున్నా.. అవి పోలింగ్‌ బూత్‌ల వద్ద పరిస్థితిని మాత్రమే పర్యవేక్షణకు ఉద్దేశించినవి.

⇒కానీ, సామాన్య మహిళా ఓటర్లు తమ ఇళ్ల నుంచి పోలింగ్‌ బూత్‌లకు వచ్చే మార్గాల్లోనూ.. ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు తెగబడేందుకు కుట్ర పన్నుతున్న టీడీపీ గూండాలను కట్టడి చేయాలంటే ఆ చర్యలు సరిపోవు. కాబట్టి ఈసీ, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండి.. పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేలా.. మహిళలు అత్యధికంగా ఓటింగులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

వారి ఓటింగ్‌ శాతం తగ్గించడమే లక్ష్యం 
సాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటారు. పోలింగ్‌ ప్రశాంతంగా, సక్రమంగా సాగితే మహిళల ఓటింగ్‌ శాతం అమాంతంగా పెరుగుతుంది. అందుకే మహిళల ఓటింగ్‌ శాతాన్ని తగ్గించడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం పోలింగ్‌ ముందు రోజు, పోలింగ్‌ రోజు  రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జాన్యాలకు పాల్పడమని చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు.

అందుకోసం స్థానికంగా ఉండే టీడీపీ రౌడీలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి గూండాలు, రౌడీ మూకలను రప్పించినట్లు సమాచారం. ఎక్కడపడితే అక్కడ దాడులకు తెగించాలని.. తద్వారా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలన్నది చంద్రబాబు పన్నాగం. పోలీసుల లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం.. వీలైతే పోలీసు కాల్పుల వరకూ పరిస్థితి తీసుకొచ్చి శాంతిభద్రతలు అదుపుతప్పేలా చేయాలని ఆయన టీడీపీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇందులో భాగమే ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు. అవి.. 

⇒ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపైనే టీడీపీ గూండాల దాడి. 
⇒ మాచర్లలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరిలపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి తన అనుచరులతో దాడిచేయించడం.. 
⇒ ఇక కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి భార్య, తనయుడిపై టీడీపీ గూండాలు దాడి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement