నగరంలోని బోడుప్పల్‌లోని ఆంధ్రాబ్యాంక్ శాఖ వద్ద డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: నగరంలోని బోడుప్పల్‌లోని ఆంధ్రాబ్యాంక్ శాఖ వద్ద డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళనకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం దర్నా చేపట్టిన మహిళలు రుణాలు ఇవ్వకుండా మేనేజర్ వేధిస్తున్నాడని తెలిపారు. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. బ్యాంకు అధికారులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా..వారు ఆందోళన కొనసాగిస్తున్నారు.