andrabank
-
ఆంధ్రా బ్యాంక్, కెనరా బ్యాంక్ రుణరేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజా 35 బేసిస్ పాయింట్ల రెపో కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.40) నేపథ్యంలో తమ రుణాలపై వడ్డీరేటు తగ్గిస్తున్న బ్యాంకుల వరుసలో తాజాగా ఆంధ్రాబ్యాంక్, కెనరా బ్యాంక్‌లు చేరాయి. పావుశాతం వరకూ ఆంధ్రా బ్యాంక్: ఓవర్‌నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది రేట్లను ఆంధ్రాబ్యాంక్ 25 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. దీనితో బెంచ్‌మార్క్ ఎంసీఎల్ఆర్ 8.20 శాతం నుంచి 7.95 శాతానికి దిగింది. కెనరా బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు కట్: అన్ని కాలపరిమితుల రుణ రేటు 10 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గింది. ఆగస్టు 7వ తేదీ నుంచీ తగ్గిన రుణ రేటు (ఎంసీఎల్ఆర్– నిధుల సమీకరణ వ్యయ ఆధారిత–ఎంసీఎల్ఆర్) అమల్లోకి వస్తుందని తెలిపింది. గడచిన ఆరు నెలల కాలంలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 20 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఈ కాల వ్యవధిలో ఏడాది ఎంసీఎల్ఆర్ 8.70 నుంచి 8.50 శాతానికి తగ్గింది. -
నోట్ల క్యూ లో వృద్ధుడి మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ వెస్ట్ మారేడు పల్లి ఆంధ్రా బ్యాంక్ వద్ద విషాదం చోటు చేసుకుంది. పెద్ద నోట్ల మార్పిడి కోసం వచ్చిన ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వివరాలివీ.. బ్యాంకులో రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేసేందుకు లక్ష్మీనారాయణ అనే రిటైర్డు ఉద్యోగి వెళ్లారు. ఆయన ఉదయం నుంచి క్యూలో ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడికి వారు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా కన్నుమూశాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆంధ్రాబ్యాంకులో చోరీకి విఫలయత్నం
సైదాబాద్: ఆంధ్రాబ్యాంకులో చోరీకి విఫలయత్నం చేసిన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐఎస్‌సదన్ డివిజన్ వినయ్‌నగర్ కాలనీలోని బోజిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న ఆం్రధాబ్యాంకులో ఏటీఎం సెంటర్ ఉంది. ఏటీఎం సెంటర్లో నుంచే బ్యాంకులోకి దారి ఉంది. మధ్యలో గ్రిల్స్‌తో పాటు అద్దాలు ఉన్నాయి. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చి పక్కనే ఉన్న బ్యాంకు ద్వారం వద్ద ఉన్న అద్దాలను ధ్వంసం చేశాడు. గ్రిల్స్‌ను కూడ తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెనుతిరిగాడు. అయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. బ్యాంకులో మొత్తం మూడు సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగ ఆచూకి కనిపించకపోవడం గమనార్హం. సంఘటన స్థలాన్ని మలక్‌పేట ఏసీపీ సి. హెచ్ సుధాకర్, సైదాబాద్ ఇన్స్పెక్టర్ సత్తయ్యలు పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇతర సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
ఆంధ్రాబ్యాంకులో చోరీకి యత్నం
హైదరాబాద్: సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆంధ్రాబ్యాంకులో చోరి యత్నం జరిగింది. వినయ్‌నగర్ కాలనీలోని ఆంధ్రాబ్యాంకు శాఖ భవనం అద్దాలు పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. లోపల షట్టర్లు ఉండటంతో వీలుపడక దుండగులు వెనుదిరిగి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఈ మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
బ్యాంకుల ప్రైవేటీకరణ నిలిపివేయాలి
ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు కరీంనగర్ : బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం ఉద్యోగులు సమ్మెబాటపట్టారు. నిరసనలో ఎస్బీహెచ్ స్టాఫ్ అసోసియేషన్ రీజనల్ సెక్రెటరీ కె.వెంకటేశ్వర్లు, సభ్యులు బి.జీవన్‌కుమార్, మహ్మద్ బాషుమియా, శేఖర్, అభినవ్, యమున, హర్షవర్ధిని, జ్యోత్న్స, రమ్య, శ్రీనివాస్, శ్యాంరెడ్డి, నందిని, నయిమొద్దీన్, రాములు పాల్గొన్నారు. ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో... స్థానిక ఇండియన్ బ్యాంకు కార్యాలయం ఎదుట ఇండియన్ బ్యాంకు సిబ్బంది సమ్మె నిర్వహించారు. కార్మిక వ్యతిరేక చట్టాలు నిలిపివేయాలని నినాదాలు చేశారు. నిరసనలో సిబ్బంది కష్ణసాయి, వెంకన్న, ఖదీర్, రంజిత్, శ్రీకాంత్, నరేశ్‌లు పాల్గొన్నారు. ఆంధ్రాబ్యాంకు ఆధ్వర్యంలో... ఆంధ్రాబ్యాంకు జోనల్ కార్యాలయం ఎదుట కరీంనగర్ ఆధ్రబ్యాంక్ 15 శాఖల్లోని 110 మంది ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రాబ్యాంకు అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ సెక్రెటరీ శ్రీరాం భద్రయ్య మాట్లాడారు. ప్రైవేట్ బ్యాంకులకు లైసెన్సులు అడ్డుకోవాలని, ఐడీబీఐ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పి.శంకర్, కె.బాపు, సీహెచ్.రాజశేఖర్, ఎస్.శ్రీనివాస్, ఆఫీసర్స్ ఫెడరేషన్ నుంచి బి.వీరభద్రయ్య, రాజ్‌కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో.. యూనియర్ బ్యాంకు ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాంకు ప్రధానశాఖ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. యూనియన్ బ్యాంకు ఉద్యోగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎ.జగన్నాథం మాట్లాడుతూ సామాన్యులకు బ్యాంకు సేవలు దూరం చేయాలనే ఉద్దేశంతో కొందరు బడాబాబులు ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నిరసనలో యూనియన్ బ్యాంకు ఉద్యోగ ప్రతినిధులు సంపత్, ఎండీ రియాజ్, కొమురయ్య, సుజాత, అనంతలక్ష్మి, ఎంఎం రాజయ్య, ప్రేమల, కవిత, సంతోష్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, సురక్ష, పావని, రాజేందర్, కిరణ్, లక్ష్మీనారాయణ, తిరుపతి, సత్యనారాయణ, వెంకటేశం, కనకరాజు, శ్రీధర్ తదితరలు పాల్గొన్నారు. -
బోడుప్పల్ లో డ్వాక్రా మహిళల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని బోడుప్పల్‌లోని ఆంధ్రాబ్యాంక్ శాఖ వద్ద డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళనకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం దర్నా చేపట్టిన మహిళలు రుణాలు ఇవ్వకుండా మేనేజర్ వేధిస్తున్నాడని తెలిపారు. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. బ్యాంకు అధికారులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా..వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
ఆంధ్రా బ్యాంక్‌లో చోరీ
ఘట్కేసర్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మెయిన్‌రోడ్డుపై ఉన్న ఆంధ్రా బ్యాంక్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. బ్యాంక్ వెనుక వైపు ఉన్న గ్రిల్స్‌ను తొలగించి గుర్తు తెలియని దుండగులు లోనికి ప్రవేశించారు. సోమవారం ఉదయం ఇది గుర్తించిన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగి అరెస్ట్
కోయిలకుంట: నకిలీ పాస్ పుస్తకాలతో రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కర్నూలు జిల్లా సంజామల మండంలంలోని పేరుసోమల గ్రామంలో ఉన్న ఆంధ్రా బ్యాంక్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నర్సింహారెడ్డి 2009 సంవత్సరంలో నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి అదే బ్యాంక్‌లో రూ. 19 లక్షలు లోన్ తీసుకున్నాడు. అప్పటి నుంచి లోను చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పూర్తి ఆధారలతో మంగళవారం నర్సింహారెడ్డిని అరెస్ట్ చేశారు.