- ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు
బ్యాంకుల ప్రైవేటీకరణ నిలిపివేయాలి
Published Fri, Jul 29 2016 6:32 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
కరీంనగర్ : బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం ఉద్యోగులు సమ్మెబాటపట్టారు. నిరసనలో ఎస్‌బీహెచ్ స్టాఫ్ అసోసియేషన్ రీజనల్ సెక్రెటరీ కె.వెంకటేశ్వర్లు, సభ్యులు బి.జీవన్‌కుమార్, మహ్మద్ బాషుమియా, శేఖర్, అభినవ్, యమున, హర్షవర్ధిని, జ్యోత్న్స, రమ్య, శ్రీనివాస్, శ్యాంరెడ్డి, నందిని, నయిమొద్దీన్, రాములు పాల్గొన్నారు.
ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో...
స్థానిక ఇండియన్ బ్యాంకు కార్యాలయం ఎదుట ఇండియన్ బ్యాంకు సిబ్బంది సమ్మె నిర్వహించారు. కార్మిక వ్యతిరేక చట్టాలు నిలిపివేయాలని నినాదాలు చేశారు. నిరసనలో సిబ్బంది కష్ణసాయి, వెంకన్న, ఖదీర్, రంజిత్, శ్రీకాంత్, నరేశ్‌లు పాల్గొన్నారు.
ఆంధ్రాబ్యాంకు ఆధ్వర్యంలో...
ఆంధ్రాబ్యాంకు జోనల్ కార్యాలయం ఎదుట కరీంనగర్ ఆధ్రబ్యాంక్ 15 శాఖల్లోని 110 మంది ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రాబ్యాంకు అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ సెక్రెటరీ శ్రీరాం భద్రయ్య మాట్లాడారు. ప్రైవేట్ బ్యాంకులకు లైసెన్సులు అడ్డుకోవాలని, ఐడీబీఐ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పి.శంకర్, కె.బాపు, సీహెచ్.రాజశేఖర్, ఎస్.శ్రీనివాస్, ఆఫీసర్స్ ఫెడరేషన్ నుంచి బి.వీరభద్రయ్య, రాజ్‌కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో..
యూనియర్ బ్యాంకు ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాంకు ప్రధానశాఖ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. యూనియన్ బ్యాంకు ఉద్యోగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎ.జగన్నాథం మాట్లాడుతూ సామాన్యులకు బ్యాంకు సేవలు దూరం చేయాలనే ఉద్దేశంతో కొందరు బడాబాబులు ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నిరసనలో యూనియన్ బ్యాంకు ఉద్యోగ ప్రతినిధులు సంపత్, ఎండీ రియాజ్, కొమురయ్య, సుజాత, అనంతలక్ష్మి, ఎంఎం రాజయ్య, ప్రేమల, కవిత, సంతోష్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, సురక్ష, పావని, రాజేందర్, కిరణ్, లక్ష్మీనారాయణ, తిరుపతి, సత్యనారాయణ, వెంకటేశం, కనకరాజు, శ్రీధర్ తదితరలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement