న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజా 35 బేసిస్ పాయింట్ల రెపో కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.40) నేపథ్యంలో తమ రుణాలపై వడ్డీరేటు తగ్గిస్తున్న బ్యాంకుల వరుసలో తాజాగా ఆంధ్రాబ్యాంక్, కెనరా బ్యాంక్‌లు చేరాయి.
పావుశాతం వరకూ ఆంధ్రా బ్యాంక్:
ఓవర్‌నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది రేట్లను ఆంధ్రాబ్యాంక్ 25 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. దీనితో బెంచ్‌మార్క్ ఎంసీఎల్‌ఆర్ 8.20 శాతం నుంచి 7.95 శాతానికి దిగింది.
కెనరా బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు కట్:
అన్ని కాలపరిమితుల రుణ రేటు 10 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గింది. ఆగస్టు 7వ తేదీ నుంచీ తగ్గిన రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్– నిధుల సమీకరణ వ్యయ ఆధారిత–ఎంసీఎల్‌ఆర్) అమల్లోకి వస్తుందని తెలిపింది. గడచిన ఆరు నెలల కాలంలో బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ 20 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఈ కాల వ్యవధిలో ఏడాది ఎంసీఎల్‌ఆర్ 8.70 నుంచి 8.50 శాతానికి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment