మూడు ప్రముఖ బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్‌లపై దాదాపు రూ. 3 కోట్ల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) తెలిపింది.
డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్, 2014కి సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) పై రూ. 2 కోట్ల పెనాల్టీ విధించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 'ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, అడ్వాన్స్‌లకు సంబంధించిన ప్రొవిజనింగ్‌పై ప్రుడెన్షియల్ నిబంధనలు - ఎన్‌పీఏ ఖాతాలలో విభేదాలు' అలాగే కేవైసీకి సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 66 లక్షల జరిమానా విధించినట్లు మరో ప్రకటనలో తెలిపింది.
కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలను పాటించనందుకు కెనరా బ్యాంక్‌పై ఆర్‌బీఐ రూ.32.30 లక్షల జరిమానా విధించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు ఒడిశాలోని రూర్కెలాలోని ఓషన్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌పై రూ.16 లక్షల జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment