City Union Bank
-
ప్రముఖ బ్యాంకులపై ఆర్బీఐ కొరడా!
మూడు ప్రముఖ బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్‌లపై దాదాపు రూ. 3 కోట్ల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) తెలిపింది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్, 2014కి సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) పై రూ. 2 కోట్ల పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 'ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, అడ్వాన్స్‌లకు సంబంధించిన ప్రొవిజనింగ్‌పై ప్రుడెన్షియల్ నిబంధనలు - ఎన్పీఏ ఖాతాలలో విభేదాలు' అలాగే కేవైసీకి సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 66 లక్షల జరిమానా విధించినట్లు మరో ప్రకటనలో తెలిపింది. కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలను పాటించనందుకు కెనరా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.32.30 లక్షల జరిమానా విధించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు ఒడిశాలోని రూర్కెలాలోని ఓషన్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌పై రూ.16 లక్షల జరిమానా విధించింది. -
నాలుగు బ్యాంకులపై జరిమానా విధించిన ఆర్బీఐ
ముంబై: సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ జారీ చేసిన కొన్ని ఆదేశాలను ఉల్లంఘించినందుకు సిటీ యూనియన్ బ్యాంక్, తమిళనాడు మెర్కాంటైల్ బ్యాంక్, మరో రెండు ఇతర బ్యాంకులపై ఆర్బీఐ భారీ జరిమానా విధించింది. వ్యవసాయ రుణాలు, ఎడ్యుకేషన్ రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాల విషయంలో ఆర్బీఐ నిబంధనలను పాటించని కారణంగా సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.1 కోటి జరిమానా విధించింది. అలాగే, సైబర్ సెక్యూరిటీ విషయంలో నిబందనలు పాటించని కారణంగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ పై రూ.1 కోటి జరిమానా వేసింది. ఆర్బీఐ ఇంకా మరో రెండు బ్యాంకులపై కూడా జరిమానా విధించింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లు, కేవైసీ రూల్స్‌ను నూతన్ నాగరిక్ సహకారి బ్యాంక్ బ్యాంక్ అతిక్రమించినందుకు రూ.90 లక్షల జరిమానా విధించింది. 'రిజర్వ్ బ్యాంక్ కమర్షియల్ పేపర్ డైరెక్షన్స్ 2017', 'నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్'లో ఉన్న కొన్ని నిబంధనలను పాటించనందుకు పూణేలోని డైమ్లెర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై అపెక్స్ బ్యాంక్ పై రూ.10 లక్షల జరిమానా వేసింది. చదవండి: 18 మిలియన్ల పోస్టులను తొలగించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ -
రెడింగ్టన్- సిటీ యూనియన్.. దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ఐటీ ప్రొడక్టుల పంపిణీ దిగ్గజం రెడింగ్టన్ ఇండియా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో ఫలితాలు అంచనాలను చేరడంతో ప్రయివేట్ రంగ సంస్థ సిటీ యూనియన్ బ్యాంక్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. రెడింగ్టన్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో రెడింగ్టన్ ఇండియా నికర లాభం 19 శాతం క్షీణించి రూ. 89 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం నీరసించి రూ. 10,722 కోట్లకు చేరింది. ఇబిటా 6 శాతం వెనకడుగుతో రూ. 230 కోట్లను తాకింది. అయితే కోవిడ్-19 కట్టడికి లాక్డౌన్ల అమలు నేపథ్యంలోనూ కంపెనీ పటిష్ట ఫలితాలు సాధించగలిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెడింగ్టన్ ఇండియా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 17 శాతం దూసుకెళ్లి రూ. 110 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 112 వరకూ ఎగసింది. సిటీ యూనియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో సిటీ యూనియన్ బ్యాంక్ నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 154 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 1210 కోట్లను తాకింది. అయితే స్థూల మొండిబకాయిలు 4.09 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 2.29 శాతం నుంచి 2.11 శాతానికి దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో సిటీ యూనియన్ బ్యాంక్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 123 వద్ద ట్రేడవుతోంది. -
వెలుగులోకి మరో బ్యాంక్ కుంభకోణం
-
లక్ష్మీ.. ఓ బ్యాంకింగ్ సంచలనం
చెన్నై: కొద్ది గంటలుగా దేశం మొత్తం బ్యాంకుల చుట్టూ తిరుగుతోంది. ఇంకొన్ని రోజులపాటు ఈ పాట్లు తప్పవు. రెండుమూడు వారాల తర్వాతగానీ సాధారణ పరిస్థితులు నెలకొనవని ప్రభుత్వాలే ప్రకటిస్తున్నాయి. సరిగ్గా ఇదేసమయంలో దేశీయ బ్యాంకింగ్ రంగంలో లక్ష్మీ సంచలనం మొదలైంది. బ్రహ్మపదార్థం లాంటి బ్యాంక్ వ్యవహారాలను సులువుగా ఖాతాదారులకు వివరించడంతోపాటు అకౌంట్ విరాలు, హోమ్, పర్సనల్ లోన్ తదితర అంశాల గురించి పూసగుచ్చినట్లు చెబుతుంది లక్ష్మి. అకౌంట్ లో పెద్దగా డబ్బుల్లేని, పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉండే సందర్భాల్లో మీ పరువును కాపాడుతుంది. ఎలాగంటే.. దేశంలోనే మొట్టమొదటి బ్యాంకింగ్ రోబో లక్ష్మి సేవలు గురువారం లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. సిటీ యూనియన్ బ్యాంక్ టీ.నగర్ శాఖ(చెన్నై)లో దీనిని ఏర్పాటుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో నడుచుకునే ఈ రోబో ఖాతాదారులకు అవసరమైన 125 రకాల సేవలను అందిస్తుంది. స్వచ్ఛమైన సాధారణ ఇంగ్లీషులో స్పందిస్తూ సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో సమాధానాలు చెబుతుంది. కోరిన పక్షంలో తన స్క్రీన్ పై అకౌంట్ వివరాలను చూపెడుతుంది. లక్ష్మీ.. దేశంలోనే మొట్టమొదటి బ్యాంకింగ్ రోబో అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తూ ఎప్పటికప్పుడు తనను తాను అప్ డేట్ చేసుకుంటుందని, ఏడాది చివరికల్లా ఈ తరహా సేవలు మరో పాతిక బ్యాంకుల్లో ప్రారంభిస్తామని సిటీ యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు మీడియాకు చెప్పారు. అతి త్వరలోనే లక్ష్మీ కస్టమర్లతో తమిళంలోనూ మాట్లాడుతుందని, తద్వారా సేవలు మరింత చేరువ అవుతాయని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ఒకవేళ జవాబు తెలియకుంటే వెంటనే బ్యాంక్ మేనేజర్ కు సమాచారం అందిస్తుందని, కస్టమర్లు అడిగే ప్రశ్నలను బట్టి లక్ష్మీ తన తెలివితేటలను పెంచుకుంటుందని చెప్పారు. మరోవైపు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ డీఎఫ్ సీ సైతం ఇదే తరహా బ్యాంకింగ్ రోబోలను ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ సంచలనాల సంగతి ఎలా ఉన్నా బ్యాంకు సర్వీసులు త్వరిత గతిన అందితే అంతకన్నా కస్టమర్లకు కావాల్సింది ఏముంటుంది!