వివిధ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇండియన్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్‌తో సహా ఓ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థపై చర్యలు తీసుకున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది .
ఏ బ్యాంకుకు ఎంత జరిమానా?
'రుణాలు, అడ్వాన్సులు: చట్టబద్ధమైన, ఇతర పరిమితులు' అలాగే 'ఇంట్రా-గ్రూప్ లావాదేవీలు, ఎక్స్‌పోజర్‌ల నిర్వహణపై మార్గదర్శకాలు' గురించి ఆర్బీఐ జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు ఎస్‌బీఐకి రూ. 1.3 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
'రుణాలు, అడ్వాన్స్‌లు: చట్టబద్ధమైన, ఇతర పరిమితులు', కేవైసీ మార్గదర్శకాలు, 'ఆర్బీఐ (డిపాజిట్లపై వడ్డీ) మార్గదర్శకాలు-2016'ను ఉల్లంఘించినందుకు ఇండియన్ బ్యాంక్‌కి రూ. 1.62 కోట్ల జరిమానా విధించింది.
ఇక డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్‌లోని నిర్దిష్ట నిబంధనలను పాటించనందుకు గానూ పంజాబ్ & సింధ్ బ్యాంక్‌కు రూ. 1 కోటి పెనాల్టీని విధించింది.
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో మానిటరింగ్ మోసానికి సంబంధించిన ఆదేశాలలో పేర్కొన్న కొన్ని నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు గానూ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌కు రూ. 8.80 లక్షల జరిమానాను విధించినట్లు ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment