నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝళిపిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా మూడు ప్రభుత్వం రంగ బ్యాంకులకు భారీ పెనాల్టీ విధించింది. ఈ మేరకు సోమవారం (సెప్టెంబర్ 25) ఆర్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇందులో దేశీయ అతిపెద్ద పీఎస్‌బీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ఉన్నాయి. నిబంధనలు పాటించడంలో విఫలమైనట్లు గుర్తించిన క్రమంలో వీటిపై భారీ జరిమానా విధిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.
ఎస్‌బీఐ సహా మూడు బ్యాంకులకు షాక్
రుణాలు, అడ్వాన్సులు- చట్టబద్ధ ఇతర పరిమితులు, ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్లు, రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలు పాటించ లేదంటూ ఎస్‌బీఐకి రూ. 1.30 కోట్లు ద్రవ్య జరిమానా విధించింది. ఆర్‌బీఐ తెలిపింది.
రుణాలు- అడ్వాన్సులతో పాటు కేవైసీ, 2016లో ఆర్‌బీఐ డిపాజిట్ల వడ్డీ రేట్లకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైందని గుర్తించింది. దీంతో ఇండియన్ బ్యాంకుకు రూ. 1.62 కోట్ల ద్రవ్య పెనాల్టీ వేసింది.. డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్ విషయంలో నిబంధనలు పాటించలేదన్న కారణంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుకు రూ. 1 కోటి జరిమానా చెల్లించాల్సిదిగా ఆదేశించినట్టు ఆర్‌బీఐ తెలిపింది.
దీంతోపాటు ఎన్‌బిఎఫ్‌సిలలో అక్రమాలను గుర్తించి ఆర్‌బీఐ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌పై రూ. 8.80 లక్షల పెనాల్టీని కూడా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందున బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సిలపై ఈ పెనాల్టీ విధించినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment