ఏజెన్సీలోని డ్వాక్రా సంఘాల్లో ఏడాది కాలంగా ప్రతిష్టంభన నెలకొంది. అప్పటి వరకూ ఎంతో ఉత్సాహంతో పని చేసిన సంఘాలు...
రుణమాఫీ ప్రకటనతో ప్రతిష్టంభన
స్తంభించిన రుణ లావాదేవీలు
కొత్త రుణాలు మంజూరు కాక సభ్యుల డీలా
పాడేరు : ఏజెన్సీలోని డ్వాక్రా సంఘాల్లో ఏడాది కాలంగా ప్రతిష్టంభన నెలకొంది. అప్పటి వరకూ ఎంతో ఉత్సాహంతో పని చేసిన సంఘాలు ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన డ్వాక్రా రుణ మాఫీ ప్రకటనతో రుణ బకాయిల చెల్లింపులు నిలిపివేశారు. దీంతో డ్వాక్రా సంఘాల బ్యాంకు లావాదేవీలు స్తంభించాయి. కొత్త రుణాలు మం జూరు కాకపోవడంతో సంఘాల్లో నిస్తేజం అల ముకుంది. ఏజెన్సీ 11 మండలాల్లోని 9,278 డ్వాక్రా సంఘాల్లో 1,03,404 మంది సభ్యులు ఉన్నారు. తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో గతంలోనే 650 డ్వాక్రా సంఘాలు వెనుకబడ్డాయి.
ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఎదు రు చూసిన మిగిలిన డ్వాక్రా సంఘాలకు తీవ్ర నిరాశే మిగిలింది. ప్రతి నెల బ్యాంకులకు చెల్లిం చాల్సిన రుణాల వాయిదా క్రమం తప్పిం ది. సక్రమంగా నడుస్తున్న డ్వాక్రా సంఘాలు కూడా ప్రస్తుతం రుణమాఫీ ఆశతో వెనుకబడ్డాయి. కొన్ని నెలలుగా ఏజెన్సీలోని సంఘాలు పొదుపు సొమ్మును కూడా చెల్లించక బ్యాంకులకు ముఖం చాటేశాయి. ఏజెన్సీలో బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న సంఘాలలో సుమారు రూ.52.63 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. అంతకు ముందు రుణాలు చెల్లించ లేని డ్వాక్రా సంఘాల వద్ద దాదాపు రూ.14 కోట్ల బ కాయిలు ఉండిపోయాయి.
రుణమాఫీ ఇప్పట్లో జరగదని అవగతమైనా రుణాలు చెల్లింపునకు సంఘాలు ముందు కు రావడం లేదు. తాము బ్యాంకుల్లో పొదుపు చేసుకున్న సొమ్మును బ్యాంకు అధికారులు తమ రుణాల వడ్డీ కింద జమ చేసుకుంటున్నారని డ్వాక్రా సంఘాలు సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో సంఘానికి రూ.1 లక్ష చొప్పున పెట్టుబడి నిధిని డ్వాక్రా గ్రూపుల పొదుపు ఖాతా ల్లో జమ చేస్తామని, 2014 ఫిబ్రవరి నుంచి2015 ఏప్రిల్ వరకు వడ్డీ మాఫీ సొమ్ము రుణ ఖాతాల్లో జూన్ నుంచి జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. డ్వాక్రా సంఘాల రుణ బకాయిలను బ్యాంకులు రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలను మంజూరు చేయడంపై ప్రభుత్వం తేల్చలేదు. రుణ మాఫీ లేకపోగా కొత్తగా రుణాలు మంజూరు అయ్యే పరిస్థితులు కానరాకపోవడంతో డ్వాక్రా సంఘాలన్నీ డీలా పడ్డాయి.