డ్వాక్రా బజార్ ప్రారంభం
కర్నూలు (టౌన్): స్థానిక సి. క్యాంపు సెంటర్‌లో డ్వాక్రా బజారు ప్రారంభమైంది. బుధవారం జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్ జ్యోతి ప్రజ్వలనతో దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్మేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన వస్తువులకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, మెప్మా పీడీ రామాంజనేయులు, ఆర్‌అండ్‌బీ ఈఈ జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.