టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు ఎప్పుడు వచ్చిన రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో మహిళా అభయహస్తం కింద రూ.360 కట్టారని తెలిపారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షలమంది డబ్బులు కట్టారని ఆయన పేర్కొన్నారు. అభయహస్తం డబ్బులను ప్రభుత్వం సొంతానికి వాడుకుంటుందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. మీ పైసలు తీసుకున్నారు.. ఎందుకు వాపస్ ఇవ్వరు? మీ ఉసురు తగులుతుందని ఆయన మండిపడ్డారు. అన్ని విధాలుగా మహిళలను అవమాన పరిచి మోసం చేసిన సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఉత్తమ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డ్వాక్రా గ్రూపులపై ఆయన వరాలు కురిపించారు. డ్వాక్రా గ్రూపులకు రూ. లక్ష గ్రాంట్, గ్రూపులకు రూ. 10లక్షల రుణం ఇప్పిస్తూ.. దాని వడ్డీ భారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తోందని హామీ ఇచ్చారు. అంతేకాక డ్వాక్రా సంఘాలకు కార్యాలయాలు లేని చోట కార్యాలయాలు నిర్మిస్తామన్నారు. అభయహస్తం భీమా పునరుద్ధరించి రూ. 5లక్షలకు పెంచుతామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment