డ్వాక్రా మహిళలకు ఐపాడ్‌లు: మంత్రి పల్లె
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి డ్వాక్రా మహిళకూ త్వరలో ఓ ఐపాడ్‌ను అందించి ప్రతి ఇంటినీ ఒక పారిశ్రామిక గృహంగా మార్చనున్నామని రాష్ట్ర సమాచార, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ రంగంలో 5, ఎలక్ట్రానిక్స్ రంగంలో 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. విజయవాడలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పాత్రికేయులకు నగదు రహిత ఎన్టీఆర్ ఆరోగ్య కార్డులను అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి విలేకరికీ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.