మహిళలకు తెలంగాణ సర్కార్‌ తీపి కబురు | Telangana Government Good News For Dwcra Women | Sakshi
Sakshi News home page

మహిళలకు తెలంగాణ సర్కార్‌ తీపి కబురు

Published Sun, Feb 18 2024 9:00 PM | Last Updated on Sun, Feb 18 2024 9:03 PM

Telangana Government Good News For Dwcra Women - Sakshi

డ్వాక్రా మహిళలకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: డ్వాక్రా మహిళలకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా ఐటీడీఏలో పాలకమండలి సమావేశం జరగలేదని, ఇప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే మహిళలకు పెద్దపీట వేశామని పేర్కొన్న భట్టి విక్రమార్క.. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, త్వరలో డ్వాక్రా మహిళలందరికీ వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement