మూడు విడతల్లో రూ.లక్ష మాఫీ
మాఫీ మొత్తాన్ని వ్యాపారం కోసమే వాడుకోవాలంటూ ప్రభుత్వ ఉత్తర్వులు
అనంతపురం సెంట్రల్ : ఒక్కో మహిళకు రూ.3 వేలు మంజూరు చేస్తామని, ఈ మొత్తంతో ఆర్థిక పరిపుష్టి చెందాలని చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు చెప్పడం హాస్యాస్పదంగా మారింది. ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళల ఓట్ల కోసం రుణాలన్నీ మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు చెల్లించొద్దన్న చంద్రబాబునాయుడు అధికారంలో వచ్చాక మాట మార్చారు. ఒక మహిళకు కాదు, ఒక సంఘానికి రూ.లక్ష మాఫీ చేస్తామని ప్రకటించాడు. ప్రస్తుతం ఆ మాటను కూడా వెనక్కు తీసుకొని లక్ష మొత్తాన్ని కూడా మూడు విడతల్లో మాఫీ చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో 54వేల స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 5.7 లక్షల మంది సభ్యులున్నారు. ఎన్నికల సమయానికి వీరిపై రూ.995 కోట్ల అప్పు ఉంది. ఎన్నికల ముందు ప్రకటించిన వాగ్దానం మేరకు అయితే ఈ రుణాలన్నీ మాఫీ కావాలి. అయితే సంఘానికి రూ.లక్ష మాఫీ ప్రకటించడంతో 54 వేల సంఘాలకు రూ.540 కోట్లు మాఫీ అవుతాయని జిల్లా యంత్రాంగం లెక్కలు తయారుచేసింది. అయితే మూడు విడతల్లో సంఘానికి లక్ష ఇస్తే ఒక్కో సభ్యురాలికి రూ.3 వేలు కూడా రాదంటున్నారు. ఎందుకంటే ప్రతి సంఘంలో 10 నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే మాఫీ అపరాధ రుసుం పేరుతో బ్యాంకులకు చెల్లించిన మొత్తంలో సగం కూడా రాకపోవడం గమనార్హం.
ఆ మూడు వేలకూ మెలిక
ఆ రూ.3వేలు చొప్పున మూడు విడతల్లో మంజూరు చేసే మొత్తాన్ని సొంత అవసరాలకు కాకుండా సంఘం ఆర్థిక పరిపుష్టికోసం వాడుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసే ఈ మొత్తం సంఘం ఖాతాకు మంజూరు చేస్తారు. ఈ మొత్తాన్ని పెట్టుబడి చేసుకొని వ్యాపారాలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఒక్కో మహిళకు రూ.3 వేలు మంజూరు చేస్తే దీంతో ఏం వ్యాపారం చేపట్టాలని డ్వాక్రా మహిళలు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు జిల్లా వ్యాప్తంగా 9,885 మంది డ్వాక్రా మహిళలకు ఆధార్ అనుసంధానం కాలేదు. తొలివిడతలో వీరి రుణమాఫీపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
డ్వాక్రా రుణమాఫీకి పంగనామాలు
Published Mon, May 18 2015 3:40 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM
Advertisement
Advertisement