district administration
-
మీ పని తీరు బాగుంది: సీఎం జగన్ ప్రశంస
సాక్షి, ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశంసించారు. అధికారుల పనితీరు బాగుందని కితాబిచ్చారు. పత్తి సాగును ఎర్ర రేగడికి కాకుండా నల్లరేగడి నేలకే పరిమితం చేసేలా ప్రకాశం జిల్లా అధికారులు తీసుకున్న చర్యలు అభినందనీయమని, బోర్ల కింద కూడా వరికి ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేసేల రైతులను ప్రోత్సహించాలని సూచించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో సమావేశం ఆయన మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటులో ప్రకాశం యంత్రాంగం పనితీరు బాగుందన్నారు. వీటితో పాటు బియ్యం కార్డులు, పెన్షన్‌కార్డులు, ఇళ్ల పట్టాల కోసం స్థలాల గుర్తింపు విషయంలో చక్కటి పనితీరు కనపరుస్తోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, నాడు–నేడు క్రింద పాఠశాలల్లో చేపడుతున్న నిర్మాణాలు, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మన బడి నేడు–నేడు కింద పెండింగ్ బిల్లులు అక్టోబర్ మొదటి వారంలో చెల్లిస్తామన్నారు. పాఠశాలల పునః ప్రారంభాన్ని కోవిడ్ దృష్ట్యా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 2వ తేదీకి వాయిదా వేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని వెల్లడించారు. (కరోనా తగ్గుముఖం) సమావేశంలో జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్, డీఆర్ఓ వినాయకం, జడ్పీ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, పంచాయతీరాజ్ ఎస్ఈ కొండయ్య, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామమూర్తి, పట్టు పరిశ్రమ ఏడీ రాజ్యలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాద్ ఠాగూర్, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, డ్వామా పీడీ శ్రీనారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎలీషా, డీపీఓ నారాయణరెడ్డి, సీపీఓ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సచివాలయ పోస్టుల రాత పరీక్షలపై దృష్టి
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తుండడంతో అందుకు సంబంధించిన రాత పరీక్షల నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఒక్కో సచివాలయంలో 11 రకాల పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పోస్టులకు జిల్లా నుంచి సుమారు 2.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అంచనాకు వచ్చిన రెవెన్యూ యంత్రాంగం.. అందుకు తగ్గట్టు రాత పరీక్ష కేంద్రాలను గుర్తించే పనిలో పడింది. 2.50 లక్షల మంది అభ్యర్థులకు కనీసం 1,250 సెంటర్లు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఈ మేరకు సెంటర్లు గుర్తించి సోమవారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వీరపాండియన్ అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదికలను రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌కు పంపి.. ఆమోదం లభించిన వెంటనే పరీక్ష నిర్వహణకు తేదీలు ఖరారవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. వీఆర్వో పోస్టుల భర్తీకి కసరత్తు గ్రామ సచివాలయాల్లో రెవెన్యూ శాఖ నుంచి గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) నియామకానికి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మొత్తం మంజూరు (శాంక్షన్) అయిన పోస్టులు ఎన్ని? ఎంతమంది పనిచేస్తున్నారు? వీఆర్ఏలకు పదోన్నతి కల్పించడం ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేయాలి? రాత పరీక్ష ద్వారా ఎన్ని భర్తీ చేయాలనే దానిపై రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో అర్బన్ ప్రాంతాలకు 46, గ్రామీణ ప్రాంతాలకు 746.. మొత్తం 792 పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో ప్రస్తుతం అర్బన్‌లో 43 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 648 మంది.. మొత్తం 691 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 27 పోస్టులను వీఆర్ఏలకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇందుకోసం అర్హత కలిగిన వీఆర్ఏలను గుర్తిస్తున్నారు. మిగిలిన 74 వీఆర్వో పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమవుతోంది. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లోనే 879 సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. చిన్న సచివాలయాలు రెండింటికి కలిపి ఒక వీఆర్వోను నియమించే దిశగా కసరత్తు సాగుతోంది. -
‘అనంత’లో రాక్షసపాలన
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాలో రాక్షస పాలన నడుస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి కేశవనారాయణ, రామగిరి మండల కన్వీనర్ నాగరాజు, రామగిరి సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రామాంజనేయులు ధ్వజమెత్తారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. రామగిరి మండలం కుంటిమద్దిలో చంద్రబాబు, పరిటాల రవీంద్ర పైలాన్లు ధ్వంసం చేశారనే నెపంతో వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. టీడీపీ వారే పైలాన్‌ను ధ్వంసం చేసుకుని తమ పార్టీ వారిని అక్రమంగా కేసుల్లో ఇరికించి బెదిరింపులకు దిగుతున్నారన్నారు. పరిటాల శ్రీరామ్ తన తండ్రి ఫొటోను కూడా తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ యూత్ నాయకులు క్రమశిక్షణతో జిల్లాలో కార్యక్రమాలను చేస్తుంటే ఓర్వలేక ఇలాంటి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలకడం మానాలన్నారు. రామగిరి మండలంలో గతంలో అరాచక పాలన సాగిందని, అలాంటి పాలనను పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రామగిరి మండలంలో నిర్వహించే తెప్ప తిరునాలను అ«ధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. -
ఇక్కడే పేచీ!
♦ ముందు జరగాల్సింది మండలాల విభజన ♦ జంట జిల్లాల విభజనకు ఉమ్మడి మండలాల పంచాయతీ ♦ మండలాలను విభజిస్తే తప్ప జిల్లాల డీలిమిటేషన్ అసాధ్యం ♦ ప్రభుత్వానికి నివేదిక పంపిన జిల్లా యంత్రాంగం కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉమ్మడి మండలాలతో పేచీ వచ్చింది. దసరా నుంచి నూతన జిల్లాలు కార్యరూపంలోకి వచ్చే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. రంగారెడ్డి, హైదరాబాద్ లో మాత్రం వేర్వేరు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మండలాలను విభజించడం కత్తిమీద సాములా మారింది. ♦ రంగారెడ్డిలోని 18, హైదరాబాద్‌లోని 16 మండలాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా మాత్రమే ఈ రెండు జిల్లాల్లో కొత్త జిల్లాల విభజనకు అవకాశం ఏర్పడనుంది. ♦ ఉదాహరణకు బాలనగర్ మండలాన్నే తీసుకుంటే.. దీనిలోని ప్రాంతాలు సనత్ నగర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల పరిధిలోకి వస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సగభాగం ఉన్న మండలాలు.. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాను యూనిట్‌గా చేసుకొని నియోజకవర్గాలతో కొత్త జిల్లాలను ప్రతిపాదించాలని జిల్లా యంత్రాంగం తొలుత భావించింది. అయితే, నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేసే ముందు.. ఒకే మండలం రెండేసీ, మూడేసీ సెగ్మెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ప్రతిపాదనలపై పునరాలోచనలో పడింది. వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే కొత్త జిల్లాలో దాదాపుగా గ్రామీణ నియోజకవర్గాల కే చోటు కల్పిస్తుండడంతో ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. అదే రాష్ట్ర రాజధానితో అనుసంధానమైన ప్రాంతాల్లో మాత్రం ఉమ్మడి మండలాల రూపేణా కొత్త చిక్కొచ్చి పడింది. ఈ క్రమంలో రంగారెడ్డి తూర్పు, ఉత్తర భాగాలను రెండు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై ఉన్నతస్థాయిలో చర్చించిన జిల్లా యంత్రాంగం.. ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా వీటి విభజనపై ముందడుగు వేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ముందుగా మండలాలను విభజిస్తే తప్ప జిల్లాల డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు సాగదనే అభిప్రాయానికొచ్చింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇచ్చే గైడ్‌లైన్స్ ప్రాతిపదికన కసరత్తు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. నాలుగైదు సెగ్మెంట్లతో పంచాయతీ వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లను కొత్తగా ఏర్పాటుచేసే జిల్లాల్లో విలీనం చేసేందుకు ఎలాంటి అడ్డంకుల్లేవు. అంటే ఈ నియోజకవర్గాల పరిధిలోని మండలాలకు మరో సెగ్మెంట్‌తో లింకు లేదన్నమాట. దీంతో ఈ నియోజకవర్గాలను కలుపుతూ నయా జిల్లాలను ప్రతిపాదించడానికి ఎలాంటి సరిహద్దు వివాదం లేదు. ఇక వేర్వేరు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న మండలాలతో కలిపి జిల్లాలను ఏర్పాటు చేయడమే సమస్యగా మారింది. అందులో ప్రధానంగా బాలానగర్ రెవెన్యూ మండలం. ఈ మండల పరిధిలో సనత్ నగర్, జూబ్లీహిల్స్(హైదరాబాద్ జిల్లా), శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాలు వస్తాయి. ఈ మేరకు వేర్వేరు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మండలాల జాబితాను జిల్లా యంత్రాంగం రూపొందించింది. తద్వారా రంగారెడ్డిలోని 18, హైదరాబాద్‌లోని 16 మండలాలను పునర్వ్యస్థీకరించడం ద్వారా మాత్రమే ఈ రెండు జిల్లాల్లో కొత్త జిల్లాల విభజనకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వానికి నివేదించింది. -
పంచాయతీ ‘ప్రక్షాళన’
♦ ఇక క్లస్టర్లుగా గ్రామ పంచాయతీలు ♦ ఆదాయం ఆధారంగా విభజన ♦ ఒక్కో క్లస్టర్లో 2,3 పంచాయతీలు ♦ మండలాలకూ కేటగిరీలు ♦ త్వరలో కార్యదర్శుల బదిలీలు గ్రామ పంచాయతీల ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం ఉపక్రమించింది. అవకతవకలకు చెక్‌పెడుతూ పంచాయతీ పాలనను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రెండు లేదా మూడు పంచాయతీలను ఒకచోటకు చేర్చుతూ వాటిని క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తోంది. అదేవిధంగా మండలాలను సైతం కేటగిరీలుగా విభజిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కార్యదర్శులను గ్రేడ్ల ఆధారంగా బదిలీచేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో సుదీర్ఘకాలంగా పంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్న వారికి తప్పనిసరిగా స్థాన చలనం కలిగించేందుకు రంగం సిద్ధం చేసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 688 గ్రామ పంచాయతీలున్నాయి. అయితే పంచాయతీ కార్యదర్శుల సంఖ్య వీటికి సమంగా లేకపోవడం.. కొన్ని పంచాయతీలు భారీ ఆదాయాన్ని కలిగి ఉండడంతో కలెక్టర్ రఘునందన్‌రావు పంచాయతీ క్లస్టర్ల ఏర్పాటుకు మొగ్గు చూపారు. వాస్తవానికి వీటి విభజనకు సంబంధించి 2009లోనే గెజిట్ విడుదల చేసినప్పటికీ.. విభజన మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. పంచాయతీల్లో పాలన గాడితప్పుతుందని భావించిన యంత్రాంగం తాజాగా క్లస్టర్ల ఏర్పాటు పూర్తిచేసింది. ఇందులో పంచాయతీ ఆదాయాన్ని ప్రాతిపదికన విభజన జరిగింది. రూ.10లక్షల ఆదాయాన్ని మించిన పంచాయతీలన్నీ గ్రేడ్1లో వచ్చాయి. ఆ తర్వాత రూ.10 లక్షల కంటే తక్కువగా ఉన్న పంచాయతీలను విభజించి వాటి సంఖ్యను ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. ఈ క్రమంలో జిల్లాలో 370 క్లస్టర్లు ఏర్పాటయ్యాయి. ఇందులో గ్రేడ్ 1 క్లస్టర్లు 134, గ్రేడ్ 2 క్లస్టర్లు 52, గ్రేడ్ 3 క్లస్టర్లు 83, గ్రేడ్ 4 క్లస్టర్లు 101 ఉన్నాయి. ఒక్కో క్లస్టర్‌కు ఒక కార్యదర్శిని నియమిస్తారు. దీంతో ఒక్కో కార్యదర్శి రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యతల్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. మండలాలకూ ‘కేటగిరీ’.. జిల్లాలో 33 గ్రామీణ మండలాలున్నాయి. తాజాగా పంచాయతీ క్లస్టర్ల ప్రక్రియను పూర్తిచేసిన ఆ శాఖ మండలాలను సైతం మూడు కేటగిరీలుగా విభజించింది. పట్టణ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని విభజన చేపట్టారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యమున్న పంచాయతీలను కేటగిరీ ‘సీ’గా గుర్తించారు. అదేవిధంగా గ్రామీణ, పట్టణ నేపథ్యమున్న వాటిని కేటగిరీ ‘బీ’లో, పూర్తి గ్రామీణ నేపథ్యమున్న మండలాలను కేటగిరీ ‘ఏ’ విభాగంలోకి చేర్చారు. దీంతో ‘ఏ’కేటగిరీలో 14 మండలాలు, ‘బీ’ కేటగిరీలో 10 మండలాలు, ‘సీ’ కేటగిరీలో 8 మండలాలను చేర్చారు. తాజాగా నిర్దేశించిన క్లస్టర్, కేటగిరీల ఆధారంగా పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని పంచాయతీ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శుల హోదా ఆధారంగా సీనియార్టీ జాబితా రూపొందించిన పంచాయతీ శాఖ.. అందుకు సంబంధించి అభ్యంతరాలను సేకరిస్తోంది. -
‘తీన్’మార్
మూడు జిల్లాలుగా విభజించాలని ప్రతిపాదనలు ♦ రెవెన్యూ, పోలీస్ విభాగాలు కలిసి సమర్పణ ♦ మండలం యూనిట్‌గా డీలిమిటేషన్ ♦ గుట్టుగా సర్కారుకు మరిన్ని ప్రతిపాదనలు ♦ మొదటి నుంచీ అనుకున్నట్టే ‘వికారాబాద్’ ♦ రాజధాని సహా షాద్‌నగర్, ♦ భువనగిరితో నాలుగు జిల్లాల ఏర్పాటు జిల్లా మూడు ముక్కలుగా విడిపోనుంది. పునర్విభజనలో జిల్లాను మూడు జిల్లాలుగా విభజించేలా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, తొలుత అనుకున్నట్లు నియోజకవర్గాలవారీగా కాకుండా మండలాలను యూనిట్‌గా చేసుకొని డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రతిపాదనలేకాకుండా మరికొన్నింటిని గుట్టుగా ప్రభుత్వానికి నివేదించింది. దీంట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజనను ఆధారంగా చేసుకొని నయా జిల్లాలను ప్రతిపాదించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రాంతాలేకాక.. షాద్‌నగర్, భువనగిరిని కూడా కలుపుకొని జిల్లా యంత్రాంగం పునర్విభజన కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వ పెద్ద మనోగతానికి అనుగుణంగా ఈ జిల్లాల మ్యాప్‌లను సైబ రాబాద్ పోలీస్ కమిషనర్, కలెక్టర్ సంయుక్తంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు కొత్త జిల్లాల స్వరూపం, సరిహద్దులపై ఈ ఇరువురి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలకే దాదాపుగా పచ్చజెండా ఊపే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను రెండుగా విభజించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. ఈ క్రమంలోనే తెలంగాణ తిరుమలగా అభివర్ణిస్తున్న యాదాద్రిని కూడా కొత్త కమిషనరేట్ల పరిధిలోకి తీసుకురావాలని యోచించింది. అందులో భాగంగానే నగరానికి చేరువలో ఉన్న భువనగిరి, అదే తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న షాద్‌నగర్‌ను కూడా కలుపుకొని విభజన పర్వాన్ని చేపట్టే దిశగా ఆలోచన చేస్తోంది.భువనగిరి పరిధిలో ఇబ్రహీంపట్నం, మే డ్చల్ సెగ్మెంట్లను పొందపరచాలని,శంషాబాద్ కేం ద్రంగా షాద్‌నగర్.. చార్మినార్‌లోకి మహేశ్వరంను చేర్చే లా ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా మినహా రంగారెడ్డి, హైదరాబా ద్ జిల్లాల పరిధిలో నూతన ంగా నాలుగు జిల్లాలను ఏ ర్పాటు చేయాలనే కోణంలో మల్లగుల్లాలు పడుతోంది. మూడు జిల్లాలివే.. ఇదిలావుండగా, ప్రస్తుత జిల్లాను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. వికారాబాద్, రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం పేరిట ఈ జిల్లాలు ఉంటాయని స్పష్టం చేసింది. మండలాలను యూనిట్‌గా చేసుకొని వీటికి తుదిరూపు ఇచ్చారు. మొదట భావించినట్లు వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొనసాగుతుందనే ప్రచారానికి తెరదించుతూ వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా నిర్వచించింది. అయితే, జిల్లా కేంద్రాల ప్రకటనను మాత్రం ప్రభుత్వం విచక్షణకే వదిలేసింది. -
‘భూ’గ్రహణం!
♦ ఫార్మాసిటీ భూసమీకరణలో ఎడతెగని జాప్యం ♦ 10,628 ఎకరాలు సేకరించాలని నిర్ణయం ♦ ఇప్పటికి ఖరారు చేసిన భూమి 13 శాతమే ♦ {పతిష్టాత్మక ప్రాజెక్టుకు భూగండం ♦ దూకుడు తగ్గించిన జిల్లా యంత్రాంగం ఔషధన గరికి ‘భూ’గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియ మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు 10,628 ఎకరాలను సమీకరించాలని సర్కారు నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు 13శాతం భూములను మాత్రమే జిల్లా యంత్రాంగం సేకరించగలిగింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ♦ ఔషధనగరికి నిర్దేశించింది: 10,628.36 ఎకరాలు ♦ గుర్తించిన ప్రభుత్వ భూమి : 7,050 ♦ టీఎస్ఐఐసీకి బ దలాయింపు: 1349.30 ♦ అప్పగింతకు సిద్ధంగా ఉన్నది : 1488.16 ♦ ఇప్పటికి సర్వే పూర్తయినది : 740.30 ♦ ముచ్చర్లలో 855, మీర్ఖాన్ పేటలో 494 ఎకరాలను టీఎస్ఐఐసీకి అప్పగించారు. ♦ పంజాగూడ, మీర్ ఖాన్పేటలో దాదాపు 1,100 ఎకరాలకు సంబంధించి భూ నిర్వాసితులతో సంప్రదింపులయ్యాయి. ♦ యాచారం మండలం కుర్మిద్ద రెవెన్యూ పరిధిలోని భూములను తీసుకునేందుకు అసైన్డ్‌దారులు, ఆక్రమణదారులతో చర్చల ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. నష్టపరిహారాన్నీ ఖరారు చేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో దాదాపు 15వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదనల మండలి (నిమ్జ్)హోదా కూడా కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ హోదాతో రాయితీలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం గ్రాంటు రూపేణా విరివిగా నిధులు విడుదల చేసే అవకాశం ఉండడంతో భూసమీకరణను వేగిరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ప్రతిపాదిత విస్తీర్ణంలో కేవలం 13శాతం భూములను మాత్రమే జిల్లా యంత్రాంగం సేకరించింది. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఔషధ దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. అనేక ఫార్మా కంపెనీలు బారులు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఫార్మాసిటీని అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఐఐసీ కృతనిశ్చయంతో ఉంది. కాగా రెవెన్యూ యంత్రాంగం భూసేకరణపై మునుపటి కంటే స్పీడు తగ్గించింది. ఏడాది క్రితం దూకుడు ప్రదర్శించిన అధికారులు.. ఇప్పుడు షరా మామూలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు కేవలం 1,349.30 ఎకరాలను మాత్రమే సేకరించి.. టీఎస్ఐఐసీకి అప్పగించారు. కందుకూరు మండలం ముచ్చర్లలో 855 ఎకరాలు, మీర్ఖాన్ పేటలో 494.24 ఎకరాలను టీఎస్ఐఐసీకి బదలాయించారు. ఇక ఇదే మండలం పంజాగూడ, మీర్ ఖాన్పేటలో దాదాపు 1,100 ఎకరాలకు సంబంధించి భూ నిర్వాసితులతో సంప్రదింపులు పూర్తి చేశారు. యాచారం మండలం కుర్మిద్ద రెవెన్యూ పరిధిలోని భూములను తీసుకునేందుకు అసైన్డ్‌దారులు, ఆక్రమణదారులతో చర్చల ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. నష్టపరిహారాన్ని కూడా ఖరారు చేశారు. తద్వారా 1,073 ఎకరాలను సేకరించేందుకు లైన్‌క్లియర్ చేశారు. అయితే, భూములు కోల్పోయేవారి జాబితా తయారీలో స్థానిక రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భూముల స్వాధీనం ఆలస్యమవుతోంది. ఇదే పరిస్థితి పంజాగూడ, మీర్‌ఖాన్‌పేటలోనూ ఎదురవుతోంది. ఇక తాడిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లిలో ప్రభుత్వ భూములను జిల్లా యంత్రాంగం గుర్తించింది. కాగా, భూ సమీకరణ ఆలస్యం కావడానికి టీఎస్ఐఐసీ వ్యవ హరిస్తున్న తీరే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫార్మాసిటీ స్థాపన, పరిహారం ఇచ్చేది టీఎస్ఐఐసీ కావడంతో ఆ సంస్థ ఇచ్చే ప్రతిపాదనలకు అనుగుణంగా మందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, తద్వారా భూ సమీకరణలో జాప్యం జరుగుతుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. -
సాగర్ నీటి కోసం స్పెషల్ ఆఫీసర్ల నియామకం
ఒంగోలు టౌన్: జిల్లాకు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీరు విడుదల సాఫీగా సాగేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లా స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది. వారి పరిధిలో సంబంధిత మండలాలకు చెందిన అధికారులతో బృందాలను ఏర్పాటు చేసింది. నాగార్జునసాగర్ నీరు జిల్లాకు విడుదలైన వెంటనే ఎక్కడా నీటిని పంట పొలాలకు వాడుకోకుండా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు, మంచినీటి పథకాలను నింపుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్ మంగళవారం సాయంత్రం ఆదేశించారు. నాగార్జునసాగర్ నీటిని జిల్లాలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులతోపాటు 99 మంచినీటి పథకాలను నింపాలని సూచించారు. ఎక్కడైనా ఇంజిన్లు ఏర్పాటుచేసి నీటిని పంట పొలాలకు ఉపయోగిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి జిల్లాకు 18వ మైలు రాయి అయిన అద్దంకి బ్రాంచ్ కెనాల్‌కు సంతమాగులూరు మండలం అడవిపాలెం నుంచి, 85/3 మైలు అయిన కురిచేడు మండలం త్రిపురాంతకం గ్రామం నుంచి జిల్లాకు నీరు విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో నీరు సజావుగా విడుదలయ్యేందుకు వీలుగా జిల్లా అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను పుల్లలచెరువు మండలం మన్నేపల్లి గ్రామం నుంచి కురిచేడు వరకు సాగర్ నీటిని పర్యవేక్షించనున్నారు. స్టెప్ సీఈఓ దర్శి బ్రాంచ్ కెనాల్ నుంచి తాళ్లూరులోని రాజంపల్లి మేజర్ వరకు పర్యవేక్షించనున్నారు. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ తాళ్లూరు మండలంలోని కరవది మేజర్ నుంచి కారుమంచి మేజర్ వరకు పర్యవేక్షించనున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సంతమాగులూరు మండలంలోని అడవిపాలెం గ్రామం నుంచి బల్లికురవ మండలం వైదన గ్రామం వరకు, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డెరైక్టర్ వైదన నుంచి ఇంకొల్లు మండలం జంగమహేశ్వరపురం వరకు, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ జంగమహేశ్వరపురం నుంచి కారంచేడు మండలం సూదివారిపాలెం వరకు పర్యవేక్షించనున్నారు. స్పెషల్ ఆఫీసర్ల పరిధిలో సంబంధిత మండల తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు డీఈఈలు ఉంటారు. నాగార్జునసాగర్ కాలువ ద్వారా నీరు విడుదలైన తరువాత ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, సాయంత్రం 10 గంటలకు కాలువ గట్లపై అధికారుల బృందం పోలీసులతో కలిసి పర్యవేక్షించనుంది. ఎక్కడైనా రైతులు నిబంధనలకు విరుద్ధంగా సాగర్ నీటిని పొలాలకు మళ్లిస్తే యుద్ధప్రాతిపదికన వాటిని తొలగించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి పరిస్థితులను బట్టి నేరుగా తనతో లేదా జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడాలని సూచించారు. ఏరోజుకారోజు నివేదికలు అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. -
కాలేజీల్లో ‘మధ్యాహ్నం’
డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: పేద విద్యార్థులకు పట్టెడన్నం పెట్టాలనే సంకల్పానికి జిల్లా యంత్రాంగం కార్యరూపం ఇచ్చింది. ఇప్పటికే పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మధ్యాహ్న భోజనాన్ని డిగ్రీ విద్యార్థులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆకలి కడుపుతో కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు అక్కడే ఆహారా న్ని వడ్డించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. శనివారం కూకట్పల్లి, మల్కాజిగిరి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, తాండూ రు, వికారాబాద్‌లోని డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. కటిక దారిధ్యం అనుభవిస్తున్న విద్యార్థులే సర్కారు కాలేజీల్లో చదువుతున్నారని భావించిన కలెక్టర్ రఘునందన్‌రావు డిగ్రీ తృతీయ ఏడాది విద్యార్థుల కడుపు నింపాలని నిర్ణయించారు. ఒక పూట భోజనం పెట్టడం ద్వారా చదువుపై శ్రద్ధ పెరిగి, ఉత్తీర్ణతాశాతం పెరుగుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిర్వహించిన సర్వేలో కూడా ఈ విషయం స్పష్టం కావడంతో ప్రయోగాత్మకంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజ నం వడ్డించాలనే ఆలోచనకు వచ్చారు. తన విచక్షణాధికారంతో ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించారు. వంట సామగ్రి, కూరగాయలు, ప్లేట్లను సమకూర్చుకోవడానికి నిధులు కేటాయించారు. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా డిగ్రీ మూడో ఏడాది చదివే 1200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తెచ్చారు. దశలవారీగా ఈ పథకాన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ ఒకటి, రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా అమలు చేయాలని నిర్ణయించారు. చాలాచోట్ల డిగ్రీ, జూనియర్ కాలేజీలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి. దీంతో ఉదయం పూట అ ల్పాహారం తీసుకోకుండానే కళాశాలకు హాజరవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. అదేసమయంలో మధ్యాహ్న వేళల్లో నడిచే విద్యార్థులకు ఆహారం తీసుకున్న తర్వాతే క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఫ్యాకల్టీకి కూడా అక్కడే! డిగ్రీ కాలేజీల్లోని ఫ్యాకల్టీ కూడా అక్కడే భోజనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చాలా కాలేజీల్లో అధ్యాపకుల కొరత వేధిస్తుండడం.. అరకొరగా బోధనలు సాగుతుం డడం కూడా సర్కారు కాలేజీల్లో విద్యాప్రమాణాలు తగ్గిపోవడానికి కారణమని అంచనాకొచ్చిన ఆయన.. మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిన కళాశాలల్లో వార్షిక పరీక్షల వరకు అదనంగా మూడు తరగుతులు బోధించాలని లెక్చరర్లకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థు లు కడుపునిండా తిని.. మెదడుకు పనిపెడితే ఉత్తీర్ణతాశాతం అదంతట అదే పెరుగుతుంద ని భావిస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే జూనియర్ కాలేజీల్లో చదివే 4,140 మంది విద్యార్థులకు కూడా మధ్యాహ్నభోజనం పెట్టేలా నిర్ణయం తీసుకోనున్నారు. -
ఖర్చుకూ కాలయాపనే
వినియోగించని తొలివిడత నిధులు మళ్లీ జిల్లాకు రూ.50 కోట్లు విడుదల {పతిపాదనల దశ దాటని పనులు ఇదీ ‘ప్రత్యేక’ ప్యాకేజి నిధుల సంగతి సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఇచ్చింది కొసరంతా..ఆ కాస్త నిధులను కూడా ఖర్చు చేసేందు కు జిల్లా యంత్రాంగం ఆర్నెల్లుగా కాల యాపన చేసింది. ఇప్పుడు మరో విడత నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఈ ని దుల వినియోగంపై దృష్టి పెట్టాల్సిన అ వసరం ఉంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసమంటూ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద జిల్లాకు రూ.50కోట్ల చొప్పున 2014-15 ఆర్ధిక సంవత్సరానికి రూ.350కోట్లు మంజూరు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.50కోట్లు విడుదల య్యాయి. ఆలస్యంగా కమిటీ సమావేశం మరుసటి నెలలోనే ఈ నిధుల వినియోగంపై ప్ర త్యేక మార్గదర్శకాలు జారీఅ య్యాయి. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ ప్రతీ నెలా సమావేశమవుతూ నిధుల విని యోగంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. కానీ పట్టించుకున్న పాపానపోలేదు. సాక్షిలో ఇటీవల ప్రచురితమై న కధనంపై స్పందించిన కలెక్టర్ యువరాజ్ రెండ్రోజుల క్రితం తొలి మోనటరింగ్ కమిటీ సమావేశం ఏ ర్పాటు చేశారు. ఇప్పటి వరకు శా ఖల అందిన ప్రతిపాదనలను పరిశీలించి న కలెక్టర్ యువరాజ్ కొన్నింటికి పరిపాలనా మోదమిచ్చారు. ఇవీ ప్రతిపాదనలు ప్రతిపాదనల్లో ఫిషరీస్ నుంచి రూ. 3.75 కోట్లు, పశు సంవర్ధక శాఖ నుంచి రూ.21.12 కోట్లు, డ్వామా నుంచి రూ.7.25 కోట్లు, వ్యవసాయ శాఖ నుం చి రూ.10.50కోట్లు, విద్యా శాఖ నుంచి రూ.1.93 కోట్ల పనులకు పాలనామోదం ఇచ్చారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో 100 సోలార్ పంపుసెట్లు, బోర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తే ఆమోదిస్తానని కలెక్టర్ ప్రకటించారు. దీంతో పాడేరు ఐటీడీఎ నుంచి వచ్చిన రూ.11కోట్ల ప్రతిపాదనలతో పాటు అటవీశాఖ-రూ.2.10 కోట్లు, డీఐసీ-రూ.25లక్షలు, ఏపీ టీడీసీ-రూ.3.10 కోట్లు, సీపీఒ-రూ.50లక్షలు, బీసీ కార్పొ రేషన్ రూ.1.83కోట్లకు ఇంకాఅనుమతులివ్వాల్సి ఉంది. మళ్లీ వచ్చిపడ్డాయి: ఈ నిధులు వినియోగం ఇంకా పూర్తిగాగాడిలో పడకముందే 2015-16 ఆర్ధిక సం వత్సరానికి సంబంధించి మరో రూ.50కోట్లు జిల్లాకు విడుదలయ్యాయి. ఈ నిధు లు ప్రస్తుతం సీపీఒ వ్యక్తిగత ఖాతా (పీడీ)లో ఉన్నాయి. వీటిని పూర్తిగా కరువు నివారణా చర్యలు, నైపుణ్యాభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి ఉంది. పనులు నిర్వహించే ఏజెన్సీకి జిల్లాకలెక్టర్ అనుమతితోనే చెల్లింపులు చేయాలి. ఖర్చుచేసిన ప్రతీరూపాయికి ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి. ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సమర్పించాలి. జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ నెలకు కనీసం ఒకసారైనా విధిగా సమావేశమై సమీక్షించుకోవాల్సి ఉంది.గత ఆర్ధిక సంవత్సరంలో మంజూరైన నిధులు వినియోగంపై ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టిన యంత్రాంగం ప్రస్తుతం మంజూరైన నిధులను ఖర్చుచేసేందుకు ఇంకెంత సమయం తీసుకుంటుందోననే సందే హాలు వ్యక్తమవుతున్నాయి. -
మూలుగుతున్న ‘ప్రత్యేక’ నిధులు
సాక్షి, విశాఖపట్నం : అంతన్నారు.. ఇంతన్నారు.. చివరకు ప్రత్యేక నిధులతో సరి పెట్టేశారు. ఆ ఇచ్చిన నిధులను కూడా ఖర్చు చేయలేని దుస్థితిలో జిల్లా యంత్రాంగం కొట్టుమిట్టాడుతోంది. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద జిల్లాకు విదిల్చిన నిధులొచ్చి ఏడు నెలయింది. వీటి వినియోగంపై మార్గదర్శకాలు జారీయి ఆరు నెలలు కావస్తోంది. అయినా సరే ప్రతిపాదనల దశ దాటలేదు. పైసా ఖర్చు కాలేదు. ఈ నిధుల వినియోగంపై కమిటీ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంవల్లే ఈ పరిస్థితి నెలకొంది. విభజన నేపథ్యంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేకప్యాకేజీ ఇస్తామని ఊరించారు. చివరకు ప్రత్యేక అభి ృద్ధి నిధుల పేరిట జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు విదిల్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది ఫిబ్రవరి 4న జిల్లాకు రూ.50 కోట్లు మంజూరయ్యాయి. ఆ తరువాత మార్గదర్శకాలు కూడా జారీయ్యాయి. కానీ నేటికీ ఒక్క పైసా కూడా ఖర్చు కాని దుస్థితి నెలకొంది. కలెక్టర్‌కే సర్వాధికారాలు నిధుల వినియోగంపై సర్వాధికారాలు జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. ఈ నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ నిర్వహించాలి. యాక్షన్ ప్లాన్కనుగుణంగా ఎప్పటికప్పుడు యుటిలైజ్డ్ సర్టిఫికెట్లు సమర్పించడంతో పాటు ప్రత్యేకంగా ఆడిటింగ్ కూడా చేయాలి. ఈ నిధులను ఖర్చు చేసేందుకు కలెక్టర్ చైర్మన్‌గా ఒక మోనటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిటీకి చీఫ్ ఫ్లానింగ్ ఆఫీసర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించనుండగా, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, నీటిపారుదల, పరిశ్రమలు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ శాఖలతో పాటు అన్ని సంక్షేమ శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. శాఖల వారీగా రూపొందించే యాక్షన్ ప్లాన్‌పై చర్చించేందుకు మోనటరింగ్ కమిటీ కనీసం నెలకోసారి భేటీ కావాల్సి ఉంది. నిధులు కేటాయింపు, వినియోగంపై ప్రతీనెలా పర్యవేక్షిస్తుండడంతో పాటు ప్రత్యేకంగా కంప్యూటరైజేషన్ కూడా చేయాలి. కానీ నిధులు విడుదలై నెలలు గడుస్తున్నా జిల్లా స్థాయి మోనటరింగ్ కమిటీ భేటీ కాలేదు. శాఖల వారీగా ప్రతిపాదనలు ఇప్పటి వరకు శాఖల వారీగా ప్రతిపాదనలందాయి. ఫిషరీస్-రూ.3.75 కోట్లు, పశు సంవర్ధక శాఖ-రూ.21.12కోట్లు, డ్వామా- రూ.7.25 కోట్లు, అటవీశాఖ రూ.2.10 కోట్లు, డీఐసీ-రూ.25లక్షలు, ఏపీ టీడీసీ- రూ.3.10 కోట్లు, ఐటీడీఎ, పాడేరు- రూ.11కోట్లు, వ్యవసాయ శాఖ-రూ.10.50కోట్లు, విద్యా శాఖ-రూ.1.93 కోట్లు, సీపీఒ- రూ.50లక్షలు, బీసీ కార్పొరేషన్ రూ.1.83కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపించారు. వీటిపై జిల్లా స్థాయి మోనటరింగ్ కమిటీ భేటీ అయి శాఖల వారీగా పంపిన ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ జిల్లా స్థాయి కమిటీ భేటీ జరగకపోవడం వలన ఈ ప్రత్యేక అభివృద్ధి నిధులు వినియోగం కాలేదు. మంత్రుల నుంచి గ్రీన్‌సిగ్నెల్ లేకే! మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి గ్రీన్‌సిగ్నెల్ రాక పోవడం వలనే ఈ నిధుల వినియోగంపై జిల్లా యంత్రాంగం జాప్యం చేస్తుందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాము సూచించిన పనులకే ఈ నిధులు కేటాయించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఈ నిధుల వినియో గంపై దృష్టి సారిం చాల్సిన అవసరం ఉంది. 2014-15 ఆర్ధికసంవత్సరం నిధులు ఖర్చు కాలేదు. మరొక పక్క 2015-16 ఆర్ధిక సంవత్సరానికి కూడా త్వరలో మరో రూ.50 కోట్ల చొప్పున నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయి. -
అధిక ఆదాయం కోసమే వలస పోతున్నారు..
‘జిల్లాలో నిజంగా ప్రజలెవరూ వలస పోవడం లేదు. అధికంగా డబ్బు సంపాదించాలని బెంగళూరుకు వెళ్తున్నారు.. వలసపోయి ప్రతి ఒక్కరూ కొత్త మెటారు సైకిళ్లు తెచ్చుకున్నారు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నం హనుమంతరాయచౌదరి, బీ.కే పార్థసారథి. జిల్లా కరువు పరిస్థితులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన రాష్ట్ర డెప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప నిర్వహించిన సమీక్షలోఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఖంగుతిన్నారు. - మోటార్ బైక్‌లు కొంటున్నారు... - టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నం, బీకే వివాదాస్పద వ్యాఖ్యలు - సమర్థించిన మంత్రి సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి - పించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వ,చాంద్‌బాషా అనంతపురం సెంట్రల్ : జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప శుక్రవారం డ్వామా హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సంభవిస్తున్న వ రుస కరువులను రాష్ట్రం, కేంద్రం దృష్టికి తీసుకుపోయి ప్రజలను, రైతులను ఆదుకోవాల్సిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు కరువును తెలుసుకునేందుకు వచ్చిన డెప్యూటీ సీఎం ఎదుట ఈ విధంగా వ్యాఖ్యానించడం అందరినీ ఆవేదనకు గురిచేసింది. సమావేశంలో డ్వామా పీడీ నాగభూషణం మాట్లాడుతూ మహాత్మగాంధీ జా తీయ ఉపాధిహామీ పథకం కింద రోజూ 1.20 వేల మంది పై చిలుకు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి నుంచి 150 రోజులు పనిదినాలు కల్పించేందుకు ప్రభుత్వం అనుమతిచిందని వివరించారు. ఈ అంశంపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కలుగజేసుకొని ఉపాధిహామీ పథకం అంతా బాగా అమలవుతుండగా ప్రజలు ఎందుకు వలస పోతున్నారని ప్రశ్నిం చారు. వలసలను అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కలుగుజేసుకుంటూ జిల్లాలో ఎవరూ వాస్తవంగా వలస పోవడం లేదన్నార. కేవలం అదనంగా డబ్బు సంపాదనకే వలస పోతున్నారని వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే బీకే పార్థసారథి కలుగజేసుకొని అదనంగా ఆదాయం కోసమే ప్రజలు వలసపోతున్నది ముమ్మాటికి వాస్తవమేనన్నారు. తన నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 150 కుటుంబాలు వలస పోయాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొత్త మోటారు సైకిళ్లు(ద్విచక్రవాహనాలు) తెచ్చుకున్నారని చెప్పారు. ఎవరైనా తన నియోజకవర్గానికి వస్తే రుజువు చేస్తానన్నారు. వలసలను ఆపడం ఎవరి సాధ్యం కాదన్నారు. వీరికి మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వంత పాడారు. మంత్రి సునీత మాట్లాడుతూ ప్రతి పక్షంలో ఉన్నారని ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. వరదాపురం సూరి మాట్లాడుతూ... గత పదేళ్ళలో మీ ప్రభుత్వం(కాంగ్రెస్‌పార్టీని అంట కడుతూ) ఏనాడైనా వలస గురించి పట్టించుకుందా? మేము అధికారం లోకి వచ్చాక కూలీలకు 150 రోజలు చేశాం. మీరు వలస గురించి మాకేం చెప్పాల్సిన అవసరం లేదంటూ ఎదురుదాడికి దిగారు. అధికారపార్టీ ఎమ్మెల్యేల వాఖ్యాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్చాంద్బాషాలు తీవ్రంగా ఆక్షేపించారు. ‘ రండి జిల్లాలోని మా రు మూల గ్రామాలకు వెళ్దాం. కుటుంబంలోని పెద్దలు వలస పోతే ఆ ఇంటికి కాపలా ఉన్న ముసలివాళ్లు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తినేందుకు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆత్మహత్యపై ఆరా
విద్యార్థిని మృతిపై కదిలిన జిల్లా యంత్రాంగం మలినేని కళాశాలకు వచ్చిన కలెక్టర్, ఎస్పీ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్న అధికారులు కళాశాల వద్ద ఆందోళన నిర్వహించిన మృతురాలి బంధువులు కళాశాలకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం వట్టిచెరుకూరు : మండలంలోని పుల్లడిగుంట గ్రామంలోని మలినేని లక్ష్మయ్య మహిళ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఎన్. సునీత ఆత్మహత్యకుగల కారణాలు తెలుసుకొనేందుకు గురువారం కలెక్టర్ కాంతిలాల్‌దండే, అర్బన్ ఎస్పీ సర్వశేష్ఠ త్రిపాఠి ఇక్కడకు వచ్చారు. బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని నార్నె సునీత బుధవారం కళాశాల పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె మృతికి దారితీసిన పరిస్థితులను కళాశాల ప్రిన్సిపాల్ నుంచి అధికారులు అడిగి తెలుసుకున్నారు. ర్యాగింగ్ విషయంపై ఆరా తీశారు. విద్యార్థినులను ఎలా కౌన్సెలింగ్ చేయాలో తెలీదా అంటూ ప్రశ్నించారు. ఆడపిల్లలను కౌన్సెలింగ్ చేసేటప్పుడు వారి తల్లిదండ్రుల సమక్షంలో చేయాలి కదా.. అంటూ కళాశాల ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. వారి వెంట సౌత్ జోన్ డీఎస్సీ శ్రీనివాసరావు, ఆర్డీవో బాస్కర్ నాయుడు, సీఐ రవికుమార్, తహశీల్దార్ సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రేమయ్య తదితరులున్నారు. వార్డెన్‌పై చర్యలకు డిమాండ్.. మృతురాలు సునీత బంధువులు సుమారు వందమంది గురువారం కళాశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కళాశాల హాస్టల్ వార్డెన్ స్వరూపరాాణి తీరు వల్లే సునీత ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. ర్యాగింగ్ నేపథ్యంలో సునీత చనిపోయిందని కళాశాల యాజమాన్యం అసత్యపు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సునీత ది ర్యాగింగ్ చేసే మనస్తత్వం కాదని, చనిపోయిన వారిపై నిందారోపణలు మోపడం సబబు కాదన్నారు. మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. సౌత్ జోన్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రేమయ్య బందోబస్తు నిర్వహించారు. ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు.. విద్యార్థిని ఆత్మహత్య నేపథ్యంలో యాజమాన్యం తమ కళాశాల, హాస్టల్‌కు మూడు రోజులపాటు సెలవు ప్రకటించింది. దోషులను కాపాడే ప్రయత్నంలో భాగంగా సెలవులు ప్రకటించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. విద్యార్థిని మృతదేహం అప్పగింత విద్యానగర్ (గుంటూరు) : గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి మార్చురీలోని సునీత మృత దేహానికి ఆసుపత్రి వైద్యులు పోస్టు మార్టం నిర్వహించారు. వట్టిచెరుకూరు మండలం పోలీసులు శవపంచనామాను రాసి మృతురాలి తల్లి అంజమ్మ, మేనమామ శ్రీనివాసరావు, బంధువులకు అప్పగించారు. విద్యార్థిని మృతదేహాన్ని కడసారిగా చూసేందుకు కళాశాలకు చెందిన తోటి విద్యార్థులు భారీ ఎత్తున మార్చురీ వద్దకు తరలివచ్చారు. పోలీసుల సమక్షంలో మృత దేహాన్ని అంబులెన్స్‌లో తరలించారు. చేతికంది వచ్చిన కుమార్తె అకాల మృతి చెందటంతో మృతురాలి తల్లి బంధువులు బోరున విలపించారు. తోటి విద్యార్థులు సైతం కంటనీరు పెట్టుకున్నారు. -
‘ఉపాధి’లో ప్రక్షాళన
- ప్రతి ఆవాసంలోనూ తప్పని సరిగా పనులు - పని కావాలన్నా.. వద్దన్నా డిమాండ్ లెటర్ ఇవ్వాల్సిందే - బిల్లుల చెల్లింపుల్లోనూ సమూల మార్పులు - పంచాయతీ కార్యాలయాల నోటీసులో బిల్లుల జాబితా అనంతపురం సెంట్రల్ : మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో సమూల మార్పులు చేసేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. గ్రామాల్లో ఉపాధి లేక వలస పోతున్నామనే మాట ప్రజల నుంచి వినిపించకూడదు అనే లక్ష్యంతో డ్వామా అధికారులు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. వివరాల్లోకి వెలితే... జిల్లాలో ఉపాధిహామీ పథకం అమలు కాని ప్రాంతాల్లో ఎక్కువశాతం మంది పట్టణాలకు, ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారనే అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ అపవాదును దూరం చేయడానికి అధికారులు ప్రక్షాళనతంత్రం చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆవాసప్రాంతాల్లో పనుల కల్పనకు డిమాండ్ లెటర్‌ను కూలీల నుంచి సేకరిస్తున్నారు. అలాగే పనులు వద్దు అన్నా కూడా నో డిమాండ్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని వలన ఉపాధి పనులు లేకనే వలస పోతున్నారనే మాట రాదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూలీలు పని కావాలని డిమాండ్ లెటర్ ఇచ్చినా పని కల్పించకపోతే 24 గంటల్లో సంబందిత ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించాలని కఠినతరమైన ఉత్తర్వులు అమలు చేస్తున్నారు. బిల్లుల చెల్లింపుల విషయంలోనూ సమూల మార్పులు తీసుకొస్తున్నారు. పోస్టల్‌శాఖ ద్వారా చేపడుతున్న బిల్లుల చెల్లింపు విషయంలో అవకతవకలు జరిగితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా కూలీల వేతనాలకు సంబందించి స్లిప్పులు జారీ చేసేవారు. ఇక నుంచి శ్రమశక్తిసంఘాల ద్వారా ఇవ్వనున్నారు. స్లిప్‌లపై తప్పనిసరిగా మండల ఏపీఓ సంతకం, సీల్ వేయాలనే నిబందన విధించారు. దీని వలన బినామీ పేర్లతో బిల్లుల చెల్లింపులకు అడ్డుకట్ట పడనుంది. కూలీలు డబ్బులు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా స్లిప్‌లను జాబ్‌కార్డు, నోట్‌బుక్‌లో అతికించుకోవాలి. అలాగే ప్రతి వారం బిల్లులు తీసుకున్న కూలీల జాబితా తప్పనిసరిగా గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీసుబోర్డులో అతికించాలనే నిబందన కూలీలకు ఉపయుక్తంగా మారనుంది. ఎవరెవరు బిల్లులు తీసుకుంటున్నారు.. నకిలీల పేర్లు ఉన్నాయా ? అని అంశాలపై ప్రజలు సైతం తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించడమే లక్ష్యం : ఉపాధిజాబ్కార్డు పొందిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించడమే లక్ష్యంగా ఉన్నాం. పనిలేక వలస పోతున్నామనే మాట కూలీల నుంచి రాకూడదు. పని అడిగిన 24 గంటల్లో పని కల్పించలేకపోతే సంబందిత ఫీల్డ్ అసిస్టెంట్‌ను నిర్దాక్షిణంగా తొలగిస్తాం. కావున ప్రతి అవాసప్రాంతం నుంచి డిమాండ్, నో డిమాండ్ లెటర్లను కూలీల నుంచి సేకరిస్తున్నాం. ఈ ఏడాది నెలకొన్న తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు వలస పోకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. నాగభూషణం,ప్రాజెక్టు డైరక్టర్, డ్వామా -
కరువు పంజా
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో ముందస్తు వర్షాలు అన్నదాతను ఊరించి ఉసూరుమనిపించాయి. ముందుగా వర్షాలు కురియడంతో అన్నదాతలు అష్ట కష్టాలు పడి వేరుశెనగ పంటను సాగుచేశారు. వరుణుడు ముఖం చాటేయడంతో జిల్లా ా్యప్తంగా పంట ఎండిపోతోంది. కళ్లేదుటే ఎండిపోతున్న వేరుశెనగ పంటను చూసి అన్నదాత తల్లడిల్లిపోతున్నాడు. పెట్టిన పెట్టుబడులు దక్కకపోవడంతో అప్పు తీర్చే దారిలేక గ్రామాలను వీడి వెళుతున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు. 2013, 2014 సంవత్సరాలకు సంబంధించి జిల్లాకు రూ.200 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రావాల్సింది. దీని కోసం 2లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. పంట బీమా ఊసే లేదు. ఉపాధి పనులూ లేవు జిల్లాలో ఉపాధి పనులు కల్పించడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహారి స్తోంది. నీరు-చెట్టు పనులకు ప్రాధాన్యత ఇచ్చి కూలీల కడుపు కొడుతోంది. ముఖ్యం గా పడమటి మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. తంబళ్లపల్లె, మదనపల్లె, పలమనేరు, పీలేరు, కుప్పంలో పనులు లేక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వలస పోతున్నారు. లక్షల సంఖ్యలో వలసలు సీఎం సొంత ఇలాకాలోనే 50 వేల మందికిపైగా ప్రజలు వలసబాట పట్టారు. దీంతో పాటు తంబళ్లపల్లె, మదనపల్లె, పలమనేరు, సత్యవేడు, చిత్తూరు, గంగాధరనెల్లూరులో దాదాపు 1.50 లక్షల మందికి పైగా పొట్ట చేత పట్టుకుని తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ముసలివారు, పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. -
తహసీల్దార్ల బదిలీలపై కసరత్తు
- ఖాళీగా ఉన్నవాటితో సహా... - పలు మండలాలకు కొత్త ముఖాలు - పనితీరు ప్రామాణికంగా మార్పులు చేర్పులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తహసీల్దార్ల బదిలీలపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పాలనాపరమైన బదిలీల్లో భాగంగా పలువురికి స్థానచలనం కలిగించాలని నిర్ణయించింది. జిల్లా పాలనాపగ్గాలు చేపట్టిన అనంతరం బదిలీల జోలికి వెళ్లని కలెక్టర్/జాయింట్ కలెక్టర్లు... ఇప్పుడిప్పుడే తహసీల్దార్ల పనితీరుపై ఒక స్పష్టతకొచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా బదిలీలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సమర్థత, పనితీరు గీటురాయిగా మార్పులు చేర్పులు జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఇబ్రహీంపట్నం, పరిగి మండలాలకు కొత్త తహసీల్దార్లను నియమించిన కలెక్టర్... జిల్లాకు కేటాయించిన మరొకరికి కలెక్టరేట్లో పోస్టింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరికొందరికి స్థానచలనం కలిగించాలనే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. శామీర్‌పేట, యాచారం, మల్కాజిగిరి, మొయినాబాద్ తదితర మండలాల తహసీల్దార్లకు స్థానభ్రంశం కలిగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఖాళీగా ఉన్న యాలాల, కలెక్టరేట్లో ఖాళీగా ఉన్న ఏఓ పోస్టును భర్తీ చేయనున్నారు. ఇవేకాకుండా ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న పూడూరు తహసీల్దార్ స్థానంలో కూడా మరొకరిని నియమించాల్సివుంది. ఈ నెల 20న పలువురు డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు లభించే అవకాశమున్నందున... వీటిని కూడా బదిలీల్లో పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రంజాన్‌ను పురస్కరించుకొని ముస్లింలకు నూతన వస్త్రాల పంపిణీలో యంత్రాంగం బిజీగా ఉన్నందున.. పండగ అనంతరమే బదిలీల కూర్పు కొలిక్కి వస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. -
లెక్క తేలింది!
- 1,923 ఎకరాలు పరాధీనం భూదాన్ పెద్దలే అక్రమార్కులు చేతులు మారిన పేదల భూములు రూ.కోట్లు విలువ చేసే భూమి ఆక్రమణ ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదిక సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూదాన్ భూముల లెక్క తేలింది. అన్యాక్రాంతమైన భూముల చిట్టాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో భూముల వినియోగంపై రూపొందించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇటీవల శాసనసభా కమిటీ భూదాన్ యజ్ఞబోర్డు భూముల ధారాదత్తంపై లోతుగా చర్చించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో పరాధీనమైన భూముల వివరాలను కూడా సేకరించిన రెవెన్యూ యంత్రాంగం.. ఆక్రమణల జాబితాను కూడా తయారు చేసింది. అయితే.. భూదాన్ బోర్డు లెక్కలకు, రెవెన్యూ రికార్డులకు భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. అప్పట్లో భూములను దానం చేస్తున్నామని ప్రకటించినప్పటికీ, చాలా చోట్ల ఆ భూములు బోర్డు స్వాధీనంలోకి రాలేదని, కొన్నిచోట్ల ఇప్పటికీ ఆయా కుటుంబాల పొజిషన్లోనే అవి ఉన్నట్లు యంత్రాంగం తేల్చింది. దీంతో 2,673 ఎకరాల మేర తేడా వచ్చింది. భూదాన్‌బోర్డు లెక్కల మేరకు 13693.25 ఎకరాలుండగా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 11020.23 ఎకరాలుగా తేలింది. సర్వే నంబర్లలో ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తాన్ని దానం చేసినట్లు రికార్డుల్లో పేర్కొనడం కూడా విస్తీర్ణంలో పొంతన కుదరకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో సర్వే.. భూదాన్ బోర్డు పాలకవర్గం పాపాల పుట్టను తవ్విన సర్కారు... చేతులు మారిన భూముల చిట్టాను తయారు చేసింది. పాలకవర్గం ముసుగులో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చింది. క్షేత్రస్థాయిలో 10717.34 ఎకరాలున్నట్లు తేల్చిన అధికారులు.. దీంట్లో 6625.08 ఎకరాలు భూమిలేని పేదలకు అసైన్డ్ చే యగా, మిగతా దాంట్లో చాలావరకు పరాధీనమైనట్లు సర్వేలో గుర్తించింది. ఆచార్య వినోబాభావే పిలుపు మేరకు భూదానోద్యమంలో దాతలు విరివిగా భూ వితరణ చేశారు. వీటిని నిరుపేదలకు పంపిణీ చేయకుండా.. భూములను కాపాడాల్సిన యజ్ఞ బోర్డే కంచే చేను మేసిన ట్లు కొల్లగొట్టింది. అసైన్డ్‌దారుల సాగుబడిలో 4395.18 ఎకరాలుండగా, 1049.24 ఎకరాలు ఇతరులకు అసైన్ చేశారు. కాగా, మిగతాదాంట్లో 1923.13 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు తేలింది. రూ.కోట్ల భూములకు ఎసరు! పేదలకు జీవనోపాధి కల్పించాలనే సదుద్దేశంతో దానం చేసిన భూములు ల్యాండ్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయాయి. భూదాన్ బోర్డే రియల్టర్ అవతారమెత్తడంతో రూ.కోట్ల విలువైన భూములకు రెక్కలొచ్చాయి. శివార్లలో విలువైన భూముల్లో ఆక్రమణలు వెలిశాయి. మరీ ముఖ్యంగా సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 1015.23 ఎకరాలు పరాధీనమయ్యాయి. దీంట్లో కాలేజీలు, ఫాంహౌస్‌లు, గోడౌన్లు, లే అవుట్లు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. బోర్డు సభ్యులు కొందరు సొంత ప్రయోజనాలకు భూములను మళ్లించుకున్నారు. బ డాబాబులు సైతం భూదాన్ భూములపై కన్నేయడం కూడా భూములు కరిగిపోవడానికి కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా దాదాపు 400 ఎకరాల పైచిలుకు భూములపై న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. వీటిని స్వాధీనం చేసుకోవడం సర్కారుకు తలనొప్పిగా మారింది. ఇటీవల భూదాన్ బోర్డును రద్దు చేసి... రికార్డులను స్వాధీనం చేసుకున్నప్పటికీ.. అన్యాక్రాంతమైన భూముల విషయంలో మాత్రం ముందడుగు వేయలేకపోయింది. -
గోదావరి పుష్కరాలకు ఆంక్షల సంకెళ్లు
ఒంగోలు కల్చరల్ : గోదావరి పుష్కరాలకు ఆంక్షల సంకెళ్లు పడ్డాయి. జిల్లా నుంచి వెయ్యి మందికి తగ్గకుండా ఉచితంగా తీసుకువెళతామని ప్రకటించిన యంత్రాంగం రోజులు దగ్గరపడే కొద్దీ కోత విధిస్తూ వస్తోంది. ఆదివారం ఉదయం యాత్ర ప్రారంభం అవుతున్నప్పటికీ ఇప్పటికీ స్పష్టంగా విధానాలను ఖరారు చేయలేదు. గోదావరి పుష్కర శోభాయాత్రలో పాల్గొని జన్మధన్యం చేసుకుందామని ఆశించిన అనేక మందిపై అక్కడకు వెళ్లకుండానే వారి ఆశలపై జిల్లా యంత్రాంగం నీళ్లు చల్లింది. రోజుకో రకమైన ప్రకటనలు ఇస్తూ గందరగోళానికి గురిచేస్తుండటంతో అనేక మందికి యాత్రకు వెళ్లాలని ఉన్నప్పటికీ ఆ ఆలోచనను బలవంతంగా విరమించుకోవడం గమనార్హం. వయో పరిమితి పేరిట విధించిన ఆంక్షల సంకెళ్లు కూడా పుష్కర యాత్రపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. జిల్లా నుంచి వెయ్యిమంది భక్తులతో రాజమండ్రికి శోభా యాత్ర నిర్వహిస్తామని జిల్లా యంత్రాంగం ముందుగా ప్రకటించింది. ఈ యాత్రలో పాల్గొనేందుకు 700 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 40 ఏళ్లు దాటినప్పటికీ ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్యలులేని వారు కూడా ఉన్నారు. వారిలో అతికష్టంగా 500 మందిని ఎంపిక చేశారు. అందుకోసం 10 బస్సులు అవ సరం అవుతాయంటూ ఏర్పాట్లు చేసింది. 500 మంది భక్తులు ఎప్పుడెప్పుడు గోదావరి పుష్కరాలకు వెళతామని ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో ఆ సంఖ్యను కూడా కుదించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 40 ఏళ్లకు పైబడిన వారిని యాత్రకు అనర్హులుగా ప్రకటించేసింది. దీంతో జిల్లా నుంచి 300 మందికే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కర శోభాయాత్రలకు అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేయడంతోపాటు పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటం, నిధులకు కొరత లేకపోయినప్పటికీ జిల్లా యంత్రాంగం మరింత ఉత్సాహంగా భక్తులను తరలించాల్సిందిపోయి రోజులు దగ్గరపడేకొద్దీ సంఖ్యను కుదించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాత్ర వేదికకు తప్పని మార్పు జిల్లా నుంచి పుష్కరాలకు వెళ్లే వారిని ఒకే క్రమంలో తీసుకువెళ్లేందుకు వీలుగా ఒంగోలులో యాత్ర వేదికకు కూడా మార్పు తప్పలేదు. ముందుగా ఈ యాత్రను ఒంగోలులోని మినీ స్టేడియం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. చివరకు అదికాస్తా ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంకు మారింది. పవిత్ర పుష్కరాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక క్రమపద్ధతిలో ఆధ్యాత్మిక ఔన్నత్యం వెల్లివిరిసే విధంగా రూపొందించాల్సిన జిల్లా యంత్రాంగం అభాసుపాలైంది. -
‘పంచాయతీ’ పునర్విభజన
♦ కొత్తగా రెండు డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ♦ ఐదు రెవెన్యూ డివిజన్ల సంఖ్యకు సమానంగా పంచాయతీశాఖలో మార్పులు ♦ {పభుత్వానికి నివేదించిన జిల్లా యంత్రాంగం సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో గ్రామ పంచాయతీ వ్యవస్థను మరింత పటిష్టపర్చేందుకు యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. పంచాయతీ చట్టాల అమలు, ఆదాయ, వ్యయాలపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలంటే పర్యవేక్షణ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇప్పుడున్న పంచాయతీ డివిజన్ల సంఖ్య తక్కువగా ఉండడం.. గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పనిభారం అధికమవుతోంది. ఫలితంగా నామమాత్రపు పర్యవేక్షణతోనే కాలం వెల్లదీయాల్సివస్తోంది. దీన్ని అధిగమించాలంటే ప్రస్తుతం ఉన్న పంచాయతీ డివిజన్ల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. జిల్లాలో ఉన్న రెవెన్యూ డివిజన్లకు సమానంగా పంచాయతీ డివిజన్లు హెచ్చించాలంటూ ప్రభుత్వానికి జిల్లా యంత్రాం గం నివేదించింది. జిల్లాలో మూడు పంచాయతీ డివిజన్లున్నాయి. తూర్పు డివిజన్, చేవెళ్ల, వికారాబాద్ డివిజన్ల పరిధిలో మొత్తం 688 గ్రామ పంచాయతీలున్నాయి. అయితే మూడు డివిజన్లున్నప్పటికీ.. నగర శివారు పంచాయతీల్లో ఆదాయ, వ్యయాల అంశం భారీగా ఉంది. అదేవిధంగా పాలనాపరమైన అంశాల పర్యవేక్షణలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు విలువైన పంచాయతీ భూముల ఆక్రమణలు.. అందుకు సంబంధించి కేసులు.. విచారణ.. తదితర అంశాలు ఇప్పుడున్న సిబ్బందికి తలకుమించిన భారమవుతున్నాయి. దీంతో ఏళ్ల తరబడిగా సమస్యలు పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి.. పాలనను గాడిలో పెట్టాలంటే కొత్తగా మరో రెండు డివిజన్లు అవసరమని యంత్రాంగం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లుండగా.. వాటికి అనుగుణంగా పంచాయతీ డివిజన్ల ప్రతిపాదనలు రూపొందించింది. నియోజకవర్గాల వారీగా విభజన.. జిల్లా యంత్రాంగం కొత్తగా తయారుచేసిన పంచాయతీ డివిజన్ల ప్రణాళికలో నియోజకవర్గాల ప్రాధాన్యతలో విభజన చేశారు. అదేవిధంగా పనిఒత్తిడిని సైతం పరిగణిస్తూ నగర శివారు మండలాల్లో తక్కువ పంచాయతీలను డివిజన్లకు కేటాయించారు. గ్రామీణ ప్రాంత డివిజన్లకు ఎక్కువ పంచాయతీలను పేర్కొంటూ పంచాయతీ డివిజన్లను విభజించారు. సరూర్‌నగర్ డివిజన్‌కు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని 7 మండలాలను కేటాయించారు. మల్కాజిగిరి డివిజన్‌కు కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాల్లోని ఐదు మండలాలు, రాజేంద్రనగర్ డివిజన్‌కు అదే నియోజకవర్గంలోని రెండు మండలాలు, చేవెళ్ల డివిజన్‌కు చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల్లోని 10 మండలాలు, వికారాబాద్ డివిజన్లో వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లోని 9 మండలాలను చేర్చారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించనున్నట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఉగ్ర రైతు
సబ్సిడీ విత్తనం.. ‘అనంత’ కరువు రైతుకు ఇదో వరం. కానీ పాలకుల ప్రణాళికాలేమి, అధికారుల నిర్లక్ష్యం వెరసి అన్నదాతలు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా విత్తన కొరత రావడం.. రెండో విడత పంపిణీపై స్పష్టత లేకపోవడంతో శనివారం జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. రైతులకు ఇచ్చే విలువ ఇంతేనా అంటూ అధికారులు, సర్కారు తీరుపై మండిపడ్డారు. అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా వర్షం పడడంతో రైతులు విత్తనం కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. అతికష్టంమీద ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు చేపట్టిన మొదటి విడతలో 2.15 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేసిన జిల్లా యంత్రాంగం ఇపుడు రెండో విడత పంపిణీపై హామీ ఇవ్వకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. జిల్లా మంత్రులు, అధికార యంత్రాంగం వైఖరిని నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శనివారం కూడా పలు మండలాల్లో అన్నదాతలు విత్తన డిమాండ్‌తో రోడ్లమీదకు వచ్చారు. ముందస్తుగా వర్షాలు కురవడం, జూన్ 15 నుంచి వేరుశనగ పంట సాగుకు అనువైన సమయమని శాస్త్రవేత్తలు చెప్పడంతో పంటల సాగు కోసం రైతులు ఎగబడుతున్నారు. రైతులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ, సీపీఐ, సీపీఎం, రైతు సంఘాలు కూడా ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నా పాలక యంత్రాంగం నుంచి స్పష్టమైన భరోసా లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర్మవరం మండల రైతులు స్థానిక మార్కెట్‌యార్డు ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. అలాగే ముదిగుబ్బ మండలం కేంద్రంలో అనంతపురం, కదిరి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తనకల్లులో వందలాది మంది రైతులు స్థానిక అంబేద్కర్సర్కిల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేశారు. గోరంట్లలో వైఎస్సార్ సర్కిల్, నాలుగు రోడ్ల సర్కిల్లో సుమారు 500 మంది రైతులు ఆందోళన నిర్వహించారు. ఈనెల 14వ తేదీ ఇచ్చిన కూపన్లు కూడా సక్రమంగా విత్తన పంపిణీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో రైతులు అనంతపురం, కళ్యాణదుర్గం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కూడేరు, వజ్రకరూరులో కూడా రాస్తారోకోలు నిర్వహించారు. గాండ్లపెంట, అమడగూరు, నల్లమాడ తదితర మండలాల్లో కూడా రైతులు ఆందోళనబాట పట్టారు. 20వ తేదీ నుంచి రెండో విడత ఇస్తామంటూ ఈనెల 14న పలు మండలాల్లో అధికారులు మైకుల్లో ప్రకటించడంతో శనివారం చాలా మండలాల్లో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఆందోళనలో భాగంగా తహశీల్దార్, ఏవోలకు వినతి పత్రాలు సమర్పించినా కలెక్టర్, జేడీఏ స్థాయి అధికారులు ప్రకటన చేస్తే కాని తాము ఏమీ చెప్పలేమని చేతులెత్తేయడంతో రైతులకు విత్తన కష్టాలు కొనసాగుతున్నాయి. -
ధరల మంట!
కిలో కందిపప్పు రూ.120కి చేరిన వైనం సన్నబియ్యం రూ.40లకు పైమాటే కాగుతున్న వంటనూనెలు అక్రమ నిల్వల వల్లే ధరలు ఆకాశానికి బతుకు బరువైన కరువు జిల్లా ప్రజలపై తాజాగా నిత్యావసరాల ధరలు పిడుగులై కురుస్తున్నాయి. అవసరమైనప్పుడు చినుకు కురవక అవసరంలేనప్పుడు గాలివాన పంటలపై దాడులు చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు పప్పులు, బియ్యం, కూరగాయల ధరలు సైతం ఆకాశం కేసి చూస్తున్నాయి. కొనాలని వెళ్లిన సామాన్యుడికి ధరలు వింటే వణుకు పుడుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు స్వార్థపరులు అక్రమంగా నిల్వ చేసి ధరల కృత్రిమపెరుగుదలకు కారణమవుతున్నారు. జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టకపోతే ఈ ధరలు ఇప్పుడిప్పుడే దిగేలా లేవు. అనంతపురం అర్బన్ : రైస్ మిల్లల యాజమానులు, వర్తకులు ఒక్కటై ధరల మంటలకు ఆజ్యం పోస్తున్నారు. జిల్లాలోని ప్రజలకు సరిపడా బియ్యం, కందిపప్పు ఉన్నా వ్యాపారులు మాత్రం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ముందస్తుగా రైతుల నుండి కొనుగోలు చేసి గోడౌన్లో, రైస్ మిల్లుల్లో నెలల తరబడి అక్రమ నిల్వలు చేసి ధరల భారాన్ని ప్రజల నెత్తిపై మోపుతున్నారు. రోజు రోజుకు నిత్యావసర సరుకులైన కందిపప్పు, మినపప్పు, చింతపండు, సన్నబియ్యంపై ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఏప్రిల్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రతి సరుకుపైన రూ. 15 నుండి రూ. 20ల వరకు ధరలు పెరిగాయి. కిలో కందిపప్పు అప్పుడు రూ. 80లు ఉండగా.. ప్రస్తుతం రూ. 120లకు విక్రయిస్తున్నారు. అదే విధంగా కేజీ సన్నబియ్యం రూ. 30లు ఉండగా.. ప్రస్తుతం రూ. 40లకు పెంచేశారు. ఇక నూనెల విషయానికొస్తే రోజు రోజుకు నూనె మంటలు రేగుతున్నాయి. మార్చి నెలలో రూ.55లు ఉన్న పామాయిల్ ధరలు ప్రస్తుతం రూ.60లు ఉంది. ఇక వేరుశనగ నూనె అయితే ఏకంగా రూ. 120లకు చేరుకుంది. అక్రమ నిల్వలు ఇలా.. జిల్లాలో రైతు పండించే ప్రధాన పంటలను కొందరు మిల్లర్లు తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిల్వ చేస్తారు. మూడు నెలల క్రితం క్వింటాళ్లు వరిధాన్యాన్ని వ్యాపారులు రైతుల నుంచి రూ. 1200లకు, కందులను క్వింటాల్ రూ. 5 వేలకు, వేరుశనగ కాయలను రూ. 3,500లకు కొనుగోలు చేశారు. వాటిని మిల్లు ఆడించి సిద్ధం చేసి పెట్టుకున్నారు. కొంతమంది ఈ సరుకును అక్రమంగా నిలువ ఉంచారు. వ్యాపారులు కొనుగోలు చేసిన ధరలు ప్రకారం బహిరంగ మార్కెట్లో వేరుశనగ నూనెను రూ. 75ల నుండి రూ. 80ల వరకు విక్రయించాలి. అయితే ప్రస్తుతం రూ. 120లకు వేరుశనగ నూనెను విక్రయిస్తున్నారు. అనంతపురం, తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లు, తదితర ప్రాంతాల్లో వీటిని అధిక శాతంలో వ్యాపారులు అక్రమ నిల్వలు చేసినట్లు తెలుస్తోంది. మండుతున్న కూరగాయల ధరలు నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల మార్కెట్ ధరలు మండుతున్నాయి. రూ.200లు బజార్‌కు తీసుకెళ్తే.. కనీసం మూడు రోజులకు సరిపడే కూరగాయలు కూడా రావడం లేదని గృహిణిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చి మిర్చి మార్చిలో రూ. 12లు ఉండగా.. ప్రస్తుతం రూ. 20లకు ఎగబాకింది. అలాగే ఉల్లిపాయలు రూ. 12లు నుంచి రూ. 25ల వరకు ధర పెరిగింది. బంగాళదుంప రూ. 16ల నుండి రూ. 24లకు, టమోట రూ. 20 నుంచి రూ. 35లకు ఎగబాకింది. క్యారెట్ ధర కూడా రూ. 16ల నుండి రూ. 24ల వరకు పెరిగింది. ఇలా కాయగూరలు, ఆకుకూరలు సైతం ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. -
నేడు పంచాయతీ ఎన్నికలు
కోలారు : గ్రామ పంచాయతీ ఎన్నికలను మంగళవారం ని ర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సోమవారం స్థానిక జూనియర్ కళాశాలలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది, పోలీసులకు అన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ త్రిలోక్‌చంద్ర జూనియర్ కళాశాలకు వచ్చి ఎన్నికల పనులను పర్యవేక్షించారు. బ్యాలెట్ బాక్సులు నిలువ ఉంచడానికి ప్రత్యేకంగా స్ట్రాంగ్ రూం లను కలెక్టర్ పరిశీలన జరిపా రు. ఎన్నికల అధికారులు ఎన్నికల విధులను నిర్వహించడానికి వచ్చిన సిబ్బందికి బ్యాలెట్ బాక్సులుసామగ్రిని అందించారు. సి బ్బంది తప్పనిసరిగా సోమవారం తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని అక్కడే ఉండాలని సూచించారు. చేతబడుల పుకార్లు ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులు మూఢ నమ్మకాలను బాగా నమ్ముకున్నారు. కోలారు, బంగారుపేట, మాలూరు, ముళబాగిలు తా లూకాలలో అభ్యర్థులు విజయం కోసం ప్రత్యర్థుల ఇళ్ల ముందు చేతబడులు చేయించి ఎన్నికల గెలవాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు జరుగుతుందో తెలి య దు కాని అభ్యర్థులు మూఢ నమ్మకాలకు పెద్ద పీట వేస్తున్నారు. మరి కొంతమంది ఓటర్లను ఆకర్షించడానికి పలు బహుమానాలు అందిస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పా ర్టీలు గ్రామ పంచాయతీలలో పట్టు సాధించడం కోసం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్‌తో చేతులు కలిపిన కోలారు ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ ఎన్నికలలో సాధ్యమైనంత మంది తన మద్దతుదారులను గెలిపించుకుని గ్రామీ ణ ప్రాంతాలలో పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాల్లో గట్టి భద్రత జిల్లాలో కోలారు, బంగారుపేట, ముళబాగిలు తాలూకాలలో పలు సున్నిత కేంద్రాలను గుర్తించారు. అక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని కలెక్టర్ పాత్రికేయులకు తెలిపారు. జిల్లాలో 156 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. 7076 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. బందోబస్తు కోసం 2225 మంది పోలీసు సిబ్బందిని నియమించామని 1675 మంది పోలీసులు, 550 మంది హోం గార్డులను నియమించినట్లు తెలిపారు. మొత్తం ఆరుగురు డీఎస్పీలు విధులు నిర్వహిస్తున్నారు. 17 మంది ఇన్స్పెక్టర్లు, 38 మంది ఎస్ఐలు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, మద్యం తదితరాలు అక్రమంగా జిల్లాలోకి సరఫరా కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఇంతవరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు కాలేదన్నారు. -
డ్వాక్రా రుణమాఫీకి పంగనామాలు
మూడు విడతల్లో రూ.లక్ష మాఫీ మాఫీ మొత్తాన్ని వ్యాపారం కోసమే వాడుకోవాలంటూ ప్రభుత్వ ఉత్తర్వులు అనంతపురం సెంట్రల్ : ఒక్కో మహిళకు రూ.3 వేలు మంజూరు చేస్తామని, ఈ మొత్తంతో ఆర్థిక పరిపుష్టి చెందాలని చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు చెప్పడం హాస్యాస్పదంగా మారింది. ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళల ఓట్ల కోసం రుణాలన్నీ మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు చెల్లించొద్దన్న చంద్రబాబునాయుడు అధికారంలో వచ్చాక మాట మార్చారు. ఒక మహిళకు కాదు, ఒక సంఘానికి రూ.లక్ష మాఫీ చేస్తామని ప్రకటించాడు. ప్రస్తుతం ఆ మాటను కూడా వెనక్కు తీసుకొని లక్ష మొత్తాన్ని కూడా మూడు విడతల్లో మాఫీ చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 54వేల స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 5.7 లక్షల మంది సభ్యులున్నారు. ఎన్నికల సమయానికి వీరిపై రూ.995 కోట్ల అప్పు ఉంది. ఎన్నికల ముందు ప్రకటించిన వాగ్దానం మేరకు అయితే ఈ రుణాలన్నీ మాఫీ కావాలి. అయితే సంఘానికి రూ.లక్ష మాఫీ ప్రకటించడంతో 54 వేల సంఘాలకు రూ.540 కోట్లు మాఫీ అవుతాయని జిల్లా యంత్రాంగం లెక్కలు తయారుచేసింది. అయితే మూడు విడతల్లో సంఘానికి లక్ష ఇస్తే ఒక్కో సభ్యురాలికి రూ.3 వేలు కూడా రాదంటున్నారు. ఎందుకంటే ప్రతి సంఘంలో 10 నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే మాఫీ అపరాధ రుసుం పేరుతో బ్యాంకులకు చెల్లించిన మొత్తంలో సగం కూడా రాకపోవడం గమనార్హం. ఆ మూడు వేలకూ మెలిక ఆ రూ.3వేలు చొప్పున మూడు విడతల్లో మంజూరు చేసే మొత్తాన్ని సొంత అవసరాలకు కాకుండా సంఘం ఆర్థిక పరిపుష్టికోసం వాడుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసే ఈ మొత్తం సంఘం ఖాతాకు మంజూరు చేస్తారు. ఈ మొత్తాన్ని పెట్టుబడి చేసుకొని వ్యాపారాలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఒక్కో మహిళకు రూ.3 వేలు మంజూరు చేస్తే దీంతో ఏం వ్యాపారం చేపట్టాలని డ్వాక్రా మహిళలు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు జిల్లా వ్యాప్తంగా 9,885 మంది డ్వాక్రా మహిళలకు ఆధార్ అనుసంధానం కాలేదు. తొలివిడతలో వీరి రుణమాఫీపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. -
నేడే ఎంసెట్.. సర్వం సిద్ధం
-
నేడే ఎంసెట్.. సర్వం సిద్ధం
ఖమ్మం: ఎంసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నెలరోజులుగా ఈ పరీక్ష కోసం యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఖమ్మం, కొత్తగూడెం పట్టణాల్లో గురువారం జరిగే పరీక్షలకు 42 కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 21,543 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 4 వేల పై చిలుకు విద్యార్థులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిరాసే వారు కావడం గమనార్హం. ఖమ్మంలో 20 కేంద్రాలలో 10,182 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, 14 కేంద్రాలల్లో 7,058 మంది అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ఉండగా... కొత్తగూడెంలోని 5 కేంద్రాల్లో 2,915 మంది ఇంజినీరింగ్, మూడు కేంద్రాల్లో 1,388 మంది అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వాహణ, ఇతర ఏర్పాట్ల కోసం జిల్లా కలెక్టర్ ఇలంబరితి, అదనపు కలెక్టర్ బాబురావు, జేఎన్టీయూ వైస్ చాన్సలర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు పలుమార్లు సమీక్షించారు. పర్యవేక్షణ కట్టుదిట్టం ఈ పరీక్షల నిర్వహణ కోసం 42 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 42 మంది చీఫ్ అబ్జర్వర్స్‌తో పాటు 898 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మెడికల్, అగ్రికల్చర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని జిల్లా కో-ఆర్డినేటర్ పుష్పలత చెప్పారు. విద్యార్థులు పరీక్ష సమయూనికి గంట ముందుగా రావాలన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. జేఎన్టీయూ నుంచి ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను నియమించారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, పోలీస్, మున్సిపాలిటీ అధికారుల సేవలు వినియోగించుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఇతర కూడళ్ల వద్ద హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేర్చేందుకు ఇంజినీరింగ్ కళాశాలలు బస్సు సౌకర్యాన్ని కల్పించాయి. మాస్ కాపీయింగ్ నియంత్రణకు.. మాస్ కాపీయింగ్ నియంత్రణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఖమ్మం, కొత్తగూడెం కన్వీనర్లు మాలోజి పుష్పలత, శ్రీనివాస్ తెలిపారు. చేతి గడియారాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చి, సెల్ఫోన్లు, ఇతర పరికరాలతో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చారుు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు కూడా చేతిగడియారాలు పెట్టుకొని రావడం, సెల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడాన్ని నిషేధించారు. ప్రతి పరీక్ష హాల్లో గోడగడియూరం ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు కళాశాల యూజమాన్యాలు అటువైపు రావద్దని ఆదేశించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా చీఫ్ సూపరింటెండెంట్, చీఫ్ అబ్జర్వర్స్దే బాధ్యతని పేర్కొన్నారు. ఏపీ నుంచి 4వేల మంది.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 4వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఎంసెట్‌లో 15 శాతం నాన్‌లోకల్ కోటా ఉండటం, ఏపీలో ఈ పరీక్షలు ఇప్పటికే జరగడంతో నాన్‌లోకల్ అభ్యర్థులు జిల్లాలో భారీ సంఖ్యలో పరీక్ష రాస్తున్నారు. ఏపీ సరిహద్దులో జిల్లా ఉండటంతో ఎక్కువ మంది దీన్ని ఎంచుకున్నారు. -
అక్రమ లేఅవుట్లపై పంచ్
రంగారెడ్డి జిల్లాలో అక్రమార్కులకు చెక్ 900 ఎకరాల పంచాయతీ స్థలాల స్వాధీనం రాజధాని శివారు ప్రాంతాల్లో అధికారుల స్పెషల్ డ్రైవ్ 2,700 అక్రమ లేఅవుట్ల గుర్తింపు, కేసులు పెట్టాలని నిర్ణయం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పంచాయతీ స్థలాలను కొల్లగొడుతున్న అక్రమార్కులపై రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కొరడా విదిల్చింది. లేఅవుట్లు/వెంచర్లలో ఆక్రమణకు గురవుతున్న దాదాపు 900 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. రియల్టర్లతో చేతులు కలిపిన ఇంటిదొంగలపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దీంతో సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన భూములు పంచాయతీల పరిధిలోకి వెళ్లాయి. స్థిరాస్తి రంగం ఊపందుకోవడంతో జిల్లాలో అడ్డగోలుగా లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. నిబంధనల ప్రకా రం ప్రజా ప్రయోజనాల కోసం లేఅవుట్ విస్తీర్ణంలో పది శాతం స్థలం కేటాయించాలి. ఈ స్థలాన్ని స్థానిక పంచాయతీకి బదలాయించాలి. అయితే రియల్టర్లు ఈ స్థలాలను కూడా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు కూడా కుమ్మక్కుకావడంతో ఖాళీ స్థలాలన్నీ పరాధీనమయ్యాయి. కొన్నిచోట్ల హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కూడా అక్రమార్కులతో చేతులు కలపడం విశేషం. రాజేంద్రనగర్ మండలం పుప్పాల్‌గూడలో 17.36 ఎకరాల విస్తీర్ణంలోని ఒక వెంచర్‌కు అధికారికంగా అనుమతి మంజూరు చేసిన హుడా.. తాజాగా అదే వెంచర్‌లోని ఖాళీ స్థలంలో ప్లాట్ల విక్రయానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 8,663.7 చదరపు గజాల జాగా అమ్మకానికి లైన్‌క్లియర్ చేసింది. ఈ విషయాన్ని పసిగట్టిన పంచాయతీ అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో సంబంధిత రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. అధికారుల స్పెషల్ డ్రైవ్ నగర శివార్లలోని 210 గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలిసిన లేఅవుట్లపై స్పెష ల్ డ్రైవ్ చేసిన అధికారులు.. వాటిలో 90 శాతం అనుమతుల్లేనివేనని తేల్చా రు. లేఅవుట్లు చేయాలంటే హెచ్ఎండీఏ, డీటీసీపీ(పట్టణ, గ్రామీణ ప్రణాళిక సంచాలకుడు) అనుమతి తప్పనిసరి. అయితే హెచ్ ఎండీఏ మార్గదర్శకాలను పాటించకుండా చాలామంది రియల్టర్లు అనధికార లేఅవుట్లకే మొగ్గు చూపుతున్నారు. నగర శివార్లలో దాదాపు 2,700 అక్రమ వెంచర్లను పంచాయతీరాజ్ శాఖ అధికారులు గుర్తించారు. అనుమతులు పొందిన 300 లేఅవుట్లలోనూ పంచాయతీలకు నిర్దేశించిన 10 శాతం స్థలాలు కబ్జాకు గురైనట్లు తేల్చారు. ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లిలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ దాదాపు 20 ఎకరాలను లేఅవుట్‌గా మార్చి విక్రయిం చేం దుకు చేసిన యత్నాలను అధికారులు అడ్డుకున్నారు. ఘట్కేసర్ మండలం మేడిపల్లి పంచాయతీ పరిధిలో పార్కు స్థలాన్ని అమ్మకానికి పెట్టిన కార్యదర్శిపై వేటు వేశారు. కబ్జాదారుపై క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించారు. ప్రజోపయోగాలకు కేటాయించిన పది శాతం స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా డీపీవో పద్మజారాణి తెలిపారు. కబ్జాలో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటామన్నారు. -
దోచుకున్న వారికి దోచుకున్నంత..!
- ఇసుక మాఫియాకు కాసుల వర్షం - బళ్లారిలో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు - అనుమతులు రద్దయినా యథేచ్ఛగా తరలింపు - ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి - మాఫియాకు అధికార పార్టీ నేతల అండదండలు - చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న జిల్లా యంత్రాంగం సాక్షి, బళ్లారి : తాలూకాలో ఇసుక అక్రమ తవ్వకాలు భారీగా సాగుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. బళ్లారి తాలూకా పరిధిలోని మోకా, రూపనగుడి, హగరి తదితర నది పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతాల పరిధిలో మూడు కంపెనీలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఏడాదికి ఒకసారి ఇసుక కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేయడమో లేక కొత్త వారికి అనుమతులు ఇవ్వడమో చేసి ఇసుక తవ్వకాలు చేపట్టాలనే నిబంధనలు ఉన్నాయి. నెల రోజుల క్రితం బళ్లారి తాలూకాలో ఉన్న ఇసుక కాంట్రాక్టర్ల టెండర్ల గడువు ముగిసింది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వకాలకు రూ.670లు చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలి. క్యూబిక్ మీటర్‌కు రూ.670లు ప్రకారం నెలకు మూడు వేల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వుకోవచ్చు. తద్వారా ప్రభుత్వానికి నెలకు దాదాపు రూ.21 లక్షలు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం టెండర్ల గడువు ముగిసినప్పటికీ ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. పాత కాంట్రాక్టర్లు గడువు ముగిసినప్పటికీ ఇసుక తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, ఇసుక తవ్వకాలను యథేచ్ఛగా అధికార పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. ఇసుక తవ్వకాలు రద్దు చేశారని అధికారికంగా పేర్కొంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రభుత్వ భనన నిర్మాణాలకు ఇసుక కొరత సృష్టిస్తూ, బళ్లారిలో అక్రమంగా ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. బళ్లారితో పాటు బెంగళూరుకు కూడా ఇక్కడ నుంచి ఇసుకను భారీగా తరలిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండదండలతో ఇసుక తవ్వకం దారులు పెట్రేగిపోతున్నారు. భారీగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల హగరి నది పరివాహక ప్రాంతాలైన చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలకు భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. దీనిపై రైతులు ఆందోళనలు చేపట్టినా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అటవీశాఖ అధికారులు, జిల్లా యంత్రాంగంలోని ప్రముఖ అధికారులకు, పోలీసులకు మామూళ్లు సమర్పిస్తూ ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి జిల్లా పంచాయతీ సమావేశంలోను ఈ అక్రమాలపై సంబంధిత ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, జెడ్పీ మెంబర్లు నిలదీసినా ప్రయోజనం శూన్యం. ఈ సమస్య పరిష్కారంపై జిల్లా ఇన్ చార్జి మంత్రి పరమేశ్వర నాయక్ చొరవ చూపకపోవడం శోచనీయం. -
జోరువానలో ఆగ్రహ జ్వాల
- టీడీపీ నేతల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన - వాళ్ల మనుషులను పెట్టుకోవడానికి మమ్మల్ని తొలగిస్తున్నారు - తెలుగుదేశానికి ఓటేయలేదనే వేధిస్తున్నారు - అంగన్వాడీ, మధ్యాహ్న భోజన, ఆశ,ఐకేపీ వర్కర్ల నిరసన - కలెక్టరేట్ దిగ్బంధం - వర్షంలోనూ కొనసాగిన ధర్నా, రాస్తారోకో - మహిళలు, పోలీసుల మధ్య తోపులాట, స్వల్ప ఉద్రిక్తత విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. మహిళలమని చూడకుండా టీడీపీ నేతలు తమను నానా దుర్భాషలాడుతూ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారని అంగన్వాడీ, ఆశ, ఐకేపీ, మధ్యాహ్న భోజన వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వారిని పెట్టుకునేందుకు కారణాల్లేకుండా, తమ పట్ల నీచంగా ప్రవరిస్తూ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం కదం తొక్కారు. రెండు గేట్లనూ మూసేసి మహా ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌ను దిగ్బంధిం చి ఉద్యోగులు, సందర్శకుల రాకపోకలను అడ్డుకున్నారు. జోరున వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రాస్తారోకో చేశారు. శుక్రవారం ఉదయం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్వాడీ, ఐకేపీ, మధ్యాహ్న భోజన, ఆశ వర్కర్లు కలెక్టరేట్‌కు చేరుకుని తమకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు సుధారాణి, తమ్మినేని సూర్యనారాయణల ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా మధ్యాహ్నం మూడు గంటల వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా సుధారాణి తదితరులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో మహిళా ఉద్యోగులపై కారణాల్లేకుండా వేటు వేస్తున్నారన్నారు. ఓటు వేయలేదనే అక్కసుతోనే ఇదం తా చేస్తున్నారని ఆరోపించారు. తమవారిని నియమిం చుకునేందుకు కక్ష సాధింపులకు దిగుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 30 మంది మధ్యాహ్న భోజన వర్కర్లను జిల్లా వ్యాప్తంగా తొల గించారన్నారు. ఆశ వర్కర్లకు ప్రభుత్వం పెంచిన రూ.300 మొత్తాన్ని వేతనాలకు కలపకుండా వదిలేశారన్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా నిర్వహించినపుడు అందరినీ వినియోగించుకోవడమే తప్ప ఎటువంటి ప్రయోజనాలనూ కల్పించడం లేదన్నారు. ఐకేపీలో 15 నెలలుగా వీబీకేలకు (విలేజ్ బుక్ కీపర్లు) వేతనాలు ఇవ్వడం లేదన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ మహిళలే చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ వారికి వ్వాల్సిన వేతనాలు, గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. మహిళల పట్ల నీచంగా ప్రవర్తిసూ, విధుల నుంచి అన్యాయంగా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన మధ్యాహ్న భోజన వర్కర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు వర్షం.. మరో వైపు ఆందోళన ఓ వైపు జోరుగా వర్షం పడుతున్నా మహిళా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. తడుస్తూనే ధర్నా కొనసాగించారు. మరోవైపు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆ ప్రాంతమంతా ఆందోళనకారుల నినాదాలతో దద్దరిల్లింది. కలెక్టరేట్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. మహిళల జుత్తు పట్టుకుని, మెడపై చేతులేసి.... ఆందోళనకారులంతా కలెక్టర్‌ను కలవాలని ప్రయత్నించారు. వర్షం పడుతుండడంతో తమ డిమాండ్లు నెరవేర్చేందుకు గడువు విధించి విరమించాలని, వినతిపత్రాన్ని కలెక్టర్, జేసీ తదితరులకు ఇవ్వాలని మహిళలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారంతా ఒక్కసారిగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొంతమంది పోలీసులు మహిళల జుత్తు పట్టుకుని లాగేశారు. మరికొంతమంది మెడపై చేతులేసి నెట్టేశారు. ఈ సమయంలో మహిళలు పెద్దపెట్టున కేకలు వేశారు. బిగ్గరగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షలు ఆపాలంటూ నినాదాలు చేస్తూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కలెక్టరేట్ దిగ్బంధం మధ్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగింది. అనంతరం జాయింట్ కలెక్టర్ బి.రామారావు, డీఆర్వో బి.హేమసుందర్‌లకు ఆందోళనకారులు వినతిపత్రం అందించారు. తొలగించిన మధ్యాహ్న భోజన నిర్వాహకులను 15 రోజుల్లో తిరిగి చేర్చుకోవాలని, ఆశ, వీబీకేలకు వేతనాలు ఇవ్వాలనీ ఈ సందర్భంగా గడువు విధించారు. లేకుంటే 16వ రోజున తిరిగి కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు తమ్మినేని సూర్యనారాయణతో పాటు ఉమామహేశ్వరి, సుధారాణి, విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, ఆర్ జయప్రద, అంగన్వాడీ, ఐకేపీ, ఆశ, మధ్యాహ్న భోజన నిర్వహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
పచ్చ పాలన!
‘మీపై ఫిర్యాదులొస్తున్నాయి. స్వచ్ఛందంగా రాజీనామా చేయండి. మీకే మంచిది. లేదంటే విచారణ, ఆపై కేసులు బనాయించి డీలర్షిప్ రద్దు చేయాల్సి ఉంటుంది. అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉంది. అర్థం చేసుకొని రాజీనామా చేయండి. లేకుంటే సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతారు.’ -రేషన్‌షాపు డీలర్లను హెచ్చరించిన ఒంటిమిట్ట తహశీల్దార్ ఈశ్వరయ్య తహశీల్దార్లు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి పైరవీలతో పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారు. అందుకే అలా వ్యవహరిస్తున్నారు. పదేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి విషయంలోనూ రాజకీయ నేతల జోక్యం తప్పడంలేదు. అధికార పార్టీకి తలొగ్గాల్సి వస్తోంది. - ఓ ఉన్నతస్థాయి అధికారి అభిప్రాయం సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో పాలనకు అధికారుల వైఖరి అద్దం పడుతోంది. అధికార పార్టీ కనుసన్నల్లో జిల్లా యంత్రాంగం మసలుకుంటోందని రూఢీ అవుతోంది. తహశీల్దార్లను గాడిలో పెట్టాల్సిన ఉన్నతాధికారులు వారిని సమర్థిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలుకుతున్నారు. పచ్చ చొక్కా నేతల మెప్పు కోసం తహతహలాడుతున్నారు. నాయకుల మాటే వేదంగా తలాడిస్తూ ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆదేశాలను జీ..హుజూర్ అంటూ నిస్సిగ్గుగా పాటిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇలాంటి పరిస్థితే ఉంది. రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలో తెలుగు తమ్ముళ్ల పెత్తనం పెరిగింది. వీరికి అధికార యంత్రాంగం కూడా వంత పాడుతోంది. దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా పరిస్థితి తయారైంది. జిల్లాలో 1750 రేషన్‌షాపు డీలర్షిప్లుంటే సుమారు 250 చోట్ల ఖాళీలున్నాయి. ఆయా స్థానాల్లో ఇన్‌ఛార్జులు కొనసాగుతున్నారు. అర్హతల ఆధారంగాా ఆ స్థానాల్లో అధికార పార్టీకి చెందిన వారిని నియమించినా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఉన్న డీలర్లను అకారణంగా తొలగించాలనుకోవడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో జమ్మలమడుగు డివిజన్లో తొలుత ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడంతో వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు గత నెల 30న జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడుచుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. దీంతో తాత్కాలికంగా అప్పట్లో డీలర్ల తొలగింపు కార్యక్రమానికి తెర పడింది. అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీ మెప్పుకోసమే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగా తహశీల్దార్లు ప్రత్యక్షంగా డీలర్లను వేధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. హుందాగా వ్యవహరించాల్సిన అధికారులు పచ్చ రంగు పులుముకుంటున్నారు. పర్యవసానంగా జిల్లాలో పరిపాలన అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కొనసాగుతోంది. అధికారులు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ విధులు నిర్వర్తించాలని పలువురు కోరుతున్నారు. -
నిండా ముంచారు!
సాక్షి ప్రతినిధి, కడప:కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జిల్లా యంత్రాంగం అమలు పర్చింది. అందుకు ఇంజనీరింగ్ అధికారులను పావులుగా వాడుకుంది. ఎన్నికలు సజావుగా పూర్తి అయ్యాయి, ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. అందుకోసం శ్రమించిన అధికారులకు మాత్రం వేదన తప్పడం లేదు. బిల్లులు మంజూరు చేయకుండా తమను నిండా ముంచారని వాపోతున్నారు. ఎన్నికల నిధులకు జమ ఖర్చులు ఉండవు. ఎన్నికల అధికారి విచక్షణ మేరకు ఖర్చు చేయవచ్చు. అయినప్పటికీ జిల్లాలో రూ. 55 లక్షల నిధులకు బ్రేకులు పడ్డాయి. కేంద్ర ఎన్నికల సంఘం వికలాంగులు వీల్ ఛైర్లో పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది. అందుకోసం పోలింగ్ కేంద్రాలకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మండలానికి పది పోలింగ్ కేంద్రాల చొప్పున ర్యాంపులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 500 ర్యాంపులు నిర్మించారు. ఒక్కో ర్యాంపు రూ.11 వేలు చొప్పున ఎస్టిమేషన్ వేసి ఆమేరకు ఏర్పాటు చేశారు. అందుకోసం రూ. 55లక్షలు వెచ్చించినా బిల్లులు మాత్రం ఇప్పటికీ మంజూరు కాలేదని పలువురు ఇంజినీరింగ్ అధికారులు వాపోతున్నారు. జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకే.. జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈఓ ఆదేశాల మేరకు మండలానికి పది ర్యాంపుల ప్రకారం పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాటు చేశారు. ఎస్ఎస్ఏ గ్రాంటు ద్వారా 50 శాతం, జెడ్పీ ద్వారా 50శాతం నిధులు చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ నోట్ ఆర్డర్ సైతం జారీ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎవరి స్థాయిలో వారు ఖర్చును భరించి రా్యాంపులు ఏర్పాటు చేసినా బిల్లులు చెల్లించకపోవడం దారుణమని వాపోతున్నారు. ఎస్ఎస్ఏ గ్రాంటు ద్వారా కేటాయించిన నిధుల్లో అరకొరగా మంజూరయ్యాయని, జెడ్పీ గ్రాంటులో మాత్రం నిధులు విడుదల కాలేదని సమాచారం. ఇదే విషయాన్ని సోమవారం ఇంజినీరింగ్ అధికారులు జెడ్పీ సీఈఓ మాల్యాద్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే అందుకు సంబంధించి నిధులు విడుదలకు సంబంధించిన ఫైల్ డీఆర్వో వద్ద పెండింగ్‌లో ఉందని ఆయన చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఆగ్రాంటును విడుదల చేసి, కింది స్థాయి సిబ్బందిలో తమ పరువు నిలపాలని ఇంజనీరింగ్ అధికారులు కోరుతున్నారు. -
శేషాద్రుడి అక్రమాలు ఎన్నో..
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: రాపూరులో హెచ్ఎంగా పనిచేస్తూ సస్పెండ్ అయిన శేషాద్రివాసు పనితీరు పరిశీలిస్తే అన్నీ అక్రమాలే కనిపిస్తున్నాయి. అయినా ఆయన్ను విద్యాశాఖ అధికారులు అందలమెక్కించారు. తనను ప్రశ్నించే వారి విషయంలో చిన్నచిన్న సాకులు చూపి సస్పెండ్ చేశారు. యూటీఎఫ్ నేత పరంధామయ్య సస్పెండ్‌ను వెంటనే రద్దు చేయాలని అపాయింటింగ్ అథారిటీ ఉన్న డీఈఓకు కలెక్టర్ గత నెల 28న ఆర్డర్ వేశారు. అయినప్పటికీ విద్యాశాఖ పట్టించుకోలేదు. శేషాద్రివాసు గురించి మరిన్ని వివరాలు సమాచార హక్కు చట్టం కింద ‘న్యూస్‌లైన్’ మరిన్ని వివరాలు సేకరించింది. కనుపర్తిపాడులో లెక్కలు మాస్టార్‌గా పనిచేస్తున్నప్పుడు ఈ హెచ్ఎం దీర్ఘకాలిక సెలవు పెట్టాడు. రిలీవ్ అయ్యేటప్పుడు, తిరిగి జాయిన్ అయ్యేటప్పుడు అక్కడి హెచ్ఎం ప్రొసీడింగ్స్ ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని ఎస్‌ఆర్‌లో (సర్వీసు రిజిస్టర్లో) నమోదు చేయాలి. కాని అలా జరగలేదు. సెలవులను దేని కింద ట్రీట్ చేశారో చూపకుండా జీతం పొందాడు. ఇదే స్కూల్లో ఉన్నప్పుడు ఓడీ(ఆన్‌డ్యూటీ) కింద పలుమార్లు వెళ్లాడు. కాని ఓడీకి కూడా జాయినింగ్, రిలీవింగ్ సర్టిఫికెట్స్ లేవు. దీర్ఘకాలిక సెలవులు పెట్టినందు వల్ల ఇంక్రిమెంట్ వెనక్కి వెళ్లాలి. కాని ప్రతి సంవత్సరం ఒకే టైమ్‌లో ఇంక్రిమెంట్ ఆగకుండా పొందడం విశేషం. ఎస్‌ఆర్‌లో ఆర్జిత సెలవుల అకౌంట్లో ఈఎల్ లీవులు అధికంగా, లోపల ఎస్ఆర్ ఎంట్రీలు తక్కువగా ఉండటం గమనార్హం, సీఎల్స్‌ను (సెలవులు) ఓడీగా దిద్దుకున్నారు. ఇదే పాఠశాలలో మొదట సీఎల్‌గా ఉన్న వాటిని రిజిస్టర్లో ఓడీగా దిద్దుకున్నారు. ఇలా జరగాలన్నా అక్కడి హెచ్ఎం ఇన్షియల్ ఉండాలి. కాని అలా లేదు. ఉదాహరణకు 2008, ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఇలా దిద్దారు. ఇలా దిద్దిన అనేక ఓడీల రిజిస్టర్లను సమాచార హక్కు చట్టం ద్వారా ‘న్యూస్‌లైన్’ సేకరించింది. కలెక్టర్ బహిరంగ విచారణ చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. రాపూరులో.. : రాపూరులో కూడా రికార్డులను తారు మారు చేశారనే అనుమానంతో రవికుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. ఏడు నెలలైనా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడ తనకు అనుకూలంగా ఉన్న ఓ టీచర్‌ను వెంకటగిరిలో డిపార్ట్ మెంట్ ఆఫీసర్‌గా నియమించాడు. ఎంతో సీనియారిటీ ఉన్న వారిని కాదని నియమించడంలో ఈ హెచ్ఎం పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. అనంతసాగరంలో ఈ హెచ్ఎం ఎంఈఓగా పని చేస్తూ వేధిస్తుండటంతో ఓ ఉపాధ్యాయడు ఈయన్ను కొట్టాడు. (మధ్యలో ఎంఈఓ నుంచి మళ్లీ హెచ్ఎంగా డిమోట్ అయ్యారు) మచ్చుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సస్పెన్షన్ విషయమై గూడూరు డిప్యూటీ ఈఓ వెంకటేశ్వరరావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఆర్జేడీ ఉత్తర్వుల మేరకు హెచ్ఎం సస్పెండ్ అయ్యాడన్నారు. రాపూరుకు ప్రత్యామ్నాయ హెచ్ఎంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను డీఈఓ కార్యాలయానికి కూడా పంపినట్టు తెలిపారు. అయితే కోర్టు శేషాద్రివాసు సస్పెన్షన్‌ను రద్దు చేసిందని, అందుకే పరీక్షల విధుల్లోకి తీసుకున్నానని డీఈఓ చెప్పడం గమనార్హం. పరంధామయ్య సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశం గత నెల 28న కలెక్టర్ యూటీఎఫ్ నేత పరంధామయ్య సస్పెండ్‌ను రద్దు చేయాలని కోరుతూ అపాయింటింగ్ అథారిటీ అయిన డీఈఓకు ఆర్డర్ వేశారు. కాని డీఈఓ లెక్కచేయలేదు. సకాలంలో సిలబస్ పూర్తి చేయలేదనే ప్రధాన ఆరోపణతో పరంధామయ్యను డీఈఓ సస్పెండ్ చేశారు. అంతేకాక సస్పెండ్ చేసిన రోజే ఆగమేఘాలపై కథ నడిచింది. మరి ఆర్జేడీ శేషాద్రివాసును సస్పెండ్ చేసినప్పుడు ఇంతే వేగంగా ఎందుకు ఉత్తర్వులు డీఈఓ కార్యాలయం ఇవ్వలేదో వారికే తెలియాలి. కొంత జాప్యం జరిగినందుకు ఆర్జేడీ పార్వతి గూడూరు డిప్యూటీ ఈఓ వెంకటేశ్వరరావుకు మెమో కూడా ఇచ్చింది. పరంధామయ్య సస్పెండ్‌ను రద్దు చేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్‌ను ఏం చేశారని ‘న్యూస్‌లైన్’ డీఈఓ రామలింగాన్ని వివరణ కోరగా ఇదొక్కటే కాదని, ఇలాంటికొంతమందికి సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని చెప్పారు. అన్నీ కలెక్టర్ వద్దకు పంపిస్తానని డీఈఓ తెలిపారు. -
జోరు తగ్గిన లెహర్ అయినా..అటెన్షన్
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్:లెహర్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమయింది. నష్టాన్ని నివారించేందుకు అన్ని చర్యలూ చేపట్టింది. తీరప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించింది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో తీరప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. జాయింట్ కలెక్టర్ శోభ పర్యటించి మత్స్యకారుల్లో అవగాహన కల్పించారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో ఆరు తీర ప్రాంతాలకు జిల్లాస్థాయి అధికారులను నియమించారు. అనుబంధంగా 19 గ్రామాలకు సైతం మండలస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. జిల్లావ్యాప్తంగా 34 పునరావాస కేంద్రాలను గుర్తించారు. వీటిలో 14 తీరప్రాంత గ్రామాల్లో ఉన్నాయి. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభావం అంతంత మాత్రమే... లెహర్ తుఫాన్ ప్రభావం జిల్లాపై తక్కువగా ఉండే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 120కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి లెహర్ మచిలీపట్నం వైపు కదులుతూ క్రమేపీ బలహీనపడుతోంది. గురువారం మధ్యాహ్నానికి తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. తొలుత ప్రకటించిన విధంగా గంటకు 200కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం లేదు. అధికారులకు సెలవులు రద్దు తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని అధికారులకు సెలవులు రద్దు చేశారు. వీఆర్వో స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో 1077 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటూ పార్వతీపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో 08963-221006, విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో 08922-236947, కలెక్టరేట్లో 08922-236947 నంబర్లతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. విద్యుత్ ఫిర్యాదులు స్వీకరించేందుకు 08922-222942 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటల పాటూ అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకాధికారుల నియామకం భోగాపురం మండలంలోని చేపలకంచేరు గ్రామానికి జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, కొంగవానిపాలేనికి డ్వామా పీడీ ఎస్.అప్పలనాయుడులను నియమించారు. పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి మెప్మా పీడీ రమణ, కోనాడకు డీఆర్డీఏ పీడీ ఎన్.జ్యోతి, చింతపల్లికి హౌసింగ్ ఈఈ నారాయణస్వామి, కొల్లాయి వలస గ్రామానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.లక్ష్మణమూర్తి, పతివాడకు డీసీసీబీ సీఈఓ శివశంకర్ ప్రసాద్‌లను నియమించారు. జేసీబీలు సన్నద్ధం. వర్షాలు, ఈదురు గాలులు వస్తే రవాణాకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టడానికి వీలుగా ఆర్అండ్బీ అధికారులు జేసీబీలను సిద్ధం చే శారు. అలాగే నీరు బయటకు వచ్చే అవకాశం ఉన్న చెరువులకు గండ్లు పెట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వాగులు పొంగి నీరు ప్రవహించే సమయంలో రాకపోకలు సాగించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సాధారణ ప్రయాణాలు రద్దుచేసుకోవాలని కోరారు. సముద్రంలోకి వెళ్లిన 116 బోట్లు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండేవిధంగా అధికారులు చర్యలు చేపట్టారు. -
తీవ్రత తగ్గుముఖం.. అయినా అప్రమత్తం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను దిశ మారటంతో జిల్లాపై దాని ప్రభావం తగ్గుముఖం పట్టనుంది. దీనివల్ల పెనుముప్పు తప్పినట్టేనని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం బుధవారం ఉదయానికే సర్వ సన్నద్ధమైంది. సహాయక చర్యలు, ముందస్తు జాగ్రత్తలకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే సహాయక బృందాల నియామకం, పునరావాస కేంద్రాల ఏర్పాటు, మండల ప్రత్యేకాధికారుల నియామకాన్ని పూర్తిచేసింది. కళింగపట్నం, కాకినాడల మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తొలుత హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పధానంగా తీరప్రాంత మండలాలైన రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్, గార, పోలాకిల్లో 17 పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఆ కేంద్రాలకు కావాల్సిన రేషన్ సరుకులు, లాంతర్లు, కిరోసిన్‌లను సిద్ధం చేసింది. కేంద్రాల నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. అంబేద్కర్ విశ్వవిద్యాలయ విద్యార్థులతో ప్రత్యేక సహాయ బృందాలను సిద్ధం చేసింది. జాతీయ విపత్తు రక్షక దళాలను రప్పించేందుకు చర్యలు తీసుకుంది. అయితే బుధవారం సాయంత్రం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ దళాలను విశాఖపట్నం నుంచి తీసుకురావాలని నిర్ణయించింది. ఇదీ తాజా పరిస్థితి తుపాను ప్రభావంతో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఉంటాయి. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్, మండల ప్రత్యేకాధికారులు బుధవారం పలు తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి ప్రజలను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి లెహర్ తుపాను ప్రభావం జిల్లాపై కొంతమేర తగ్గిందని కలెక్టర్ సౌరభ్ గౌర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని తెలిపారు. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను కోరారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. -
పై-లీన్ నష్టం రూ.15కోట్లు?
=నివేదిక సిద్ధం చేసిన ఎన్హెచ్ఏఐ =పస్తుతం మరమ్మతులకే పరిమితం =ఢిల్లీకి ప్రతిపాదనలు పంపిన అధికారులు సాక్షి, విశాఖపట్నం : పై-లీన్ తుపాను రోడ్లనూ ధ్వంసం చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని జాతీయ రహదారులతో పాటు ఒడిశా సరిహద్దులోని రోడ్లకూ నష్టం వాటిల్లింది. వంతెనలు పాడయ్యాయి. రోడ్లకు గండ్లు పడ్డాయి. రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఆయా జిల్లాల అధికారుల ప్రాథమిక నివేదికలతో పాటు, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (నేషనల్ హైవేస్ అధారిటీస్ ఆఫ్ ఇండియా) అధికారుల బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల పర్యటించింది. భారీగా రోడ్లు మరమ్మతులకు గురికావడాన్ని గుర్తించింది. ఢిల్లీ, హైదరాబాద్ అధికారులతో పాటు విశాఖలోని ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది రోడ్లను సందర్శించి వాటిల్లిన నష్టంతో పాటు తక్షణం చేయాల్సిన మరమ్మతుల విషయమై సమీక్షించారు. ఆంధ్రా-ఒడిశా ప్రాంతాల్ని కలిపే సరిహద్దులోని జాతీయ రహదారులు ధ్వంసం కావడంతో కనీసం రూ.15కోట్లయినా నష్టం వాటిల్లిందని గుర్తించారు. ఈ నష్టాన్ని ఇప్పట్లో పూడ్చే అవకాశం లేకపోవడంతో భవిష్యత్తులో ఇతర ప్రాజెక్టుల మంజూరీ సమయంలో భర్తీ చేసుకునేలా నిర్ణయించారు. ఇదే విషయమై ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించామని ఓ అధికారి తెలిపారు. ఒక్క ఇచ్చాపురం పరిధిలోనే సుమారు 60 కిలోమీటర్ల మేర మరమ్మతులు జరపాలని తేల్చారు. రోడ్ కనెక్టివిటీతో పాటు గుంతలు పూడ్చడం, రైలింగ్ పనులు తక్షణమే చేపట్టాలని ప్రభుత్వం సూచించిన మీదట జిల్లా యంత్రాంగం సహకారంతో పనులు చేపట్టాలని తేల్చారు. వాస్తవానికి తుపాను తీరం దాటిన వెంటనే నష్టాన్ని అంచనా వేసినా, రోడ్లపై చెట్లు పడిపోవడం, కొన్నిచోట్ల నీరుండిపోవడం కారణంగా అంచనా ఆలస్యమైనట్టు అధికారులు చెబుతున్నారు. భారీ పనులకు నిధుల లేమి వెంటాడుతుండడంతో కనీసం నెల రోజుల వ్యవధిలో మరమ్మతులకు ముందుకు వచ్చారు. ఈ విషయంలో ఇప్పటికే తమ వద్ద ఉన్న నిధులు, యంత్ర పరికరాలతో పనులకు సిద్ధం కావాలని అధికారులు ఆదేశించారు. -
వైర్లెస్ సెట్లు!
పాలకుర్తి, న్యూస్‌లైన్ : ప్రజల సొమ్మే కదా అని అనుకుందో... ఏమో... మన జిల్లా యంత్రాంగం... అనుకున్నదే తడువుగా మండల కేంద్రాల్లోని తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయూల్లో వైర్లెస్ సెట్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా మండల పరిధిలో జరుగుతున్న సంఘటనలు, అభివృద్ధి పనుల వివరాలు, ప్రజల ఇబ్బందులు జిల్లా యంత్రాంగానికి వెంటవెంటనే నివేదించే అవకాశముంటుంది. అదేక్రమంలో అన్ని మండల కేంద్రాల్లోని అధికారులకు ఏకకాలంలో సమాచారం చేరవేసేందుకు ఇది ఉపయోగకారిగా ఉంటుంది కదా.. ఇది మంచి పనే అనుకోవచ్చు. అయితే ఈ ఆధునిక కాలంలో సెల్ఫోన్లు విస్తరించాయి... అందులోనూ అధికారులతో ఉచితంగా మాట్లాడుకునే అవకాశమున్న గ్రూప్ సిమ్లూ అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వైర్లెస్ సెట్ల కొనుగోలు దండగే అనవచ్చు. అంతేకాకుండా లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వైర్లెస్ సెట్లు వినియోగంలో లేక అక్కరకు రాకుండా పోయూయి. వైర్లెస్ సెట్లను ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి బూజుపట్టగా... భవనాలపై తరంగాల కోసం ఏర్పాటు చేసిన ఏరియల్ పైపులు విరిగిపోయూయి. ముందుచూపు లేకుండా కొనుగోలు చేయడమే కాకుండా... అధికారుల నిర్లక్ష్య వైఖరితో వైర్లెస్ సెట్లు మూలకుపడ్డాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ. 20 లక్షలు వృథా జిల్లావ్యాప్తంగా 50 మండలాల్లోని ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలతోపాటు ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో వైర్లెస్ సెట్లు అమర్చారు. ఒక్కో సెట్ విలువ సుమారు రూ. 10 వేల పైనే ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో మండలంలో రెండు వైర్లెస్ సెట్లకు రూ. 20 వేల ఖర్చవుతుంది. అంటే జిల్లాలో సుమారు రూ. 20 లక్షలు వృథా అరుునట్లు తెలుస్తోంది. ఇన్ని నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన వైర్లెస్ సెట్లు ఎందుకు అక్కరకు రాకుండా పోయాయని మండల అధికారులను ప్రశ్నిస్తే... వారిచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘మా వద్దనే కాకుండా జిల్లాలో ఎక్కడా వాడడం లేదు. ల క్షలాది రూపాయలు వెచ్చించి ఎంతో మేలు చేస్తుందని ఆశిస్తే ఆశలన్నీ అవిరయ్యారుు.’ అని అంటున్నారు. -
ఆర్నెల్లుగా కారుణ్య నియామకాలకు బ్రేక్
సాక్షి,సిటీబ్యూరో: బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన హైదరాబాద్ జిల్లా యంత్రాంగానికి కనికరం లేకుండాపోయింది. నిబంధనల ప్రకారం..ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే, ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో అర్హత కలిగిన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉంది. అయితే జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులు తమకు ఉద్యోగం ఇవ్వండంటూ.. ప్రతిరోజూ కలెక్టరేట్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. గత ఆ ర్నెల్లలో కలెక్టరేట్‌కు చేరిన పాతిక దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకపోవడం విచాకరం. బోడిగుండుకు మోకాలికి..: తండ్రిని కోల్పోయిన కొడుకు, భర్తను కోల్పోయిన భార్య, అమ్మను కోల్పోయిన కూతురు..ఇలా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు ఆసరా కోసం కలెక్టర్‌కు దరఖాస్తుల సమర్పించి ఎదురుతెన్నులు చూస్తున్నారు. అయితే.. బాధిత కుటుంబాల పట్ల కలెక్టరేట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తే..బోడిగుండుకు మోకాలి ముడిపెట్టిన చందంగా కనిపిస్తోంది. విద్యాశాఖకు చెందిన ఉద్యోగి ఒకరు మరణిస్తే.. అతని కుమారునికి ఉద్యోగమిచ్చే విషయంలో విద్యాశాఖ తప్పిదాలపై వివరణ ఇచ్చే వరకు ఉద్యోగం ఇచ్చేది లేదని కలెక్టరేట్ అధికారులు చెపుతుండడం దుర దృష్టకరం. బాధిత కుటుంబాల పట్ల కారుణ్యాన్ని చూపాల్సిన అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిసున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏం జరిగిందంటే.. : విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీస్ సబార్టినేట్‌గా పనిచేసిన ఎన్.భిక్షపతి గతేడాది సెప్టెంబరులో మరణించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉండడంతో భిక్షపతి కుమారుడు వినోద్ దరఖాస్తు చేసుకున్నాడు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హతలు,అవసరమైన ఇతర ధ్రువీకరణ పత్రాలన్నింటిని దరఖాస్తుకు జతపరిచి గతేడాది డిసెంబరులో సమర్పించాడు. తమ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు లేనందున జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ వినోద్ దరఖాస్తును డీఈవోకు, కలెక్టర్ కు ఈ ఏడాది జూలైలో పంపించారు. అయితే..జిల్లా విద్యాశాఖ నుంచి తాము కోరిన సమాచారం మూడేళ్లుగా పంపడం లేదని, ఆ విభాగం నుంచి సమాచారం వస్తేనే ఉద్యోగం ఇస్తామని కలెక్టరేట్ అధికారులు మడత పేచీపెట్టారు. జరుగుతున్న తంతుతో బాధిత కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకపోయినా.. అధికారుల తీరుతో వేదనకు గురవుతున్నారు. జిల్లాలోని వివిధ విభాగాల్లో ఇబ్బడిముబ్బడిగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నా..అధికారులు వాటిని భర్తీ చేయకపోవడంపై సిబ్బంది పెదవివిరుస్తున్నారు.