
నేడు పంచాయతీ ఎన్నికలు
కోలారు : గ్రామ పంచాయతీ ఎన్నికలను మంగళవారం ని ర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సోమవారం స్థానిక జూనియర్ కళాశాలలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది, పోలీసులకు అన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ త్రిలోక్‌చంద్ర జూనియర్ కళాశాలకు వచ్చి ఎన్నికల పనులను పర్యవేక్షించారు. బ్యాలెట్ బాక్సులు నిలువ ఉంచడానికి ప్రత్యేకంగా స్ట్రాంగ్ రూం లను కలెక్టర్ పరిశీలన జరిపా రు. ఎన్నికల అధికారులు ఎన్నికల విధులను నిర్వహించడానికి వచ్చిన సిబ్బందికి బ్యాలెట్ బాక్సులుసామగ్రిని అందించారు. సి బ్బంది తప్పనిసరిగా సోమవారం తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని అక్కడే ఉండాలని సూచించారు.
చేతబడుల పుకార్లు
ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులు మూఢ నమ్మకాలను బాగా నమ్ముకున్నారు. కోలారు, బంగారుపేట, మాలూరు, ముళబాగిలు తా లూకాలలో అభ్యర్థులు విజయం కోసం ప్రత్యర్థుల ఇళ్ల ముందు చేతబడులు చేయించి ఎన్నికల గెలవాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు జరుగుతుందో తెలి య దు కాని అభ్యర్థులు మూఢ నమ్మకాలకు పెద్ద పీట వేస్తున్నారు. మరి కొంతమంది ఓటర్లను ఆకర్షించడానికి పలు బహుమానాలు అందిస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పా ర్టీలు గ్రామ పంచాయతీలలో పట్టు సాధించడం కోసం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్‌తో చేతులు కలిపిన కోలారు ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ ఎన్నికలలో సాధ్యమైనంత మంది తన మద్దతుదారులను గెలిపించుకుని గ్రామీ ణ ప్రాంతాలలో పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
సున్నిత ప్రాంతాల్లో గట్టి భద్రత
జిల్లాలో కోలారు, బంగారుపేట, ముళబాగిలు తాలూకాలలో పలు సున్నిత కేంద్రాలను గుర్తించారు. అక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని కలెక్టర్ పాత్రికేయులకు తెలిపారు. జిల్లాలో 156 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. 7076 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. బందోబస్తు కోసం 2225 మంది పోలీసు సిబ్బందిని నియమించామని 1675 మంది పోలీసులు, 550 మంది హోం గార్డులను నియమించినట్లు తెలిపారు.
మొత్తం ఆరుగురు డీఎస్పీలు విధులు నిర్వహిస్తున్నారు. 17 మంది ఇన్‌స్పెక్టర్‌లు, 38 మంది ఎస్‌ఐలు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, మద్యం తదితరాలు అక్రమంగా జిల్లాలోకి సరఫరా కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఇంతవరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు కాలేదన్నారు.