పాలకుర్తి, న్యూస్‌లైన్ : ప్రజల సొమ్మే కదా అని అనుకుందో... ఏమో... మన జిల్లా యంత్రాంగం... అనుకున్నదే తడువుగా మండల కేంద్రాల్లోని తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయూల్లో వైర్‌లెస్ సెట్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా మండల పరిధిలో జరుగుతున్న సంఘటనలు, అభివృద్ధి పనుల వివరాలు, ప్రజల ఇబ్బందులు జిల్లా యంత్రాంగానికి వెంటవెంటనే నివేదించే అవకాశముంటుంది.
అదేక్రమంలో అన్ని మండల కేంద్రాల్లోని అధికారులకు ఏకకాలంలో సమాచారం చేరవేసేందుకు ఇది ఉపయోగకారిగా ఉంటుంది కదా.. ఇది మంచి పనే అనుకోవచ్చు. అయితే ఈ ఆధునిక కాలంలో సెల్‌ఫోన్లు విస్తరించాయి... అందులోనూ అధికారులతో ఉచితంగా మాట్లాడుకునే అవకాశమున్న గ్రూప్ సిమ్‌లూ అందుబాటులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో వైర్‌లెస్ సెట్ల కొనుగోలు దండగే అనవచ్చు. అంతేకాకుండా లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వైర్‌లెస్ సెట్లు వినియోగంలో లేక అక్కరకు రాకుండా పోయూయి. వైర్‌లెస్ సెట్లను ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి బూజుపట్టగా... భవనాలపై తరంగాల కోసం ఏర్పాటు చేసిన ఏరియల్ పైపులు విరిగిపోయూయి. ముందుచూపు లేకుండా కొనుగోలు చేయడమే కాకుండా... అధికారుల నిర్లక్ష్య వైఖరితో వైర్‌లెస్ సెట్లు మూలకుపడ్డాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 20 లక్షలు వృథా
జిల్లావ్యాప్తంగా 50 మండలాల్లోని ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలతోపాటు ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో వైర్‌లెస్ సెట్లు అమర్చారు. ఒక్కో సెట్ విలువ సుమారు రూ. 10 వేల పైనే ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో మండలంలో రెండు వైర్‌లెస్ సెట్లకు రూ. 20 వేల ఖర్చవుతుంది. అంటే జిల్లాలో సుమారు రూ. 20 లక్షలు వృథా అరుునట్లు తెలుస్తోంది. ఇన్ని నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన వైర్‌లెస్ సెట్లు ఎందుకు అక్కరకు రాకుండా పోయాయని మండల అధికారులను ప్రశ్నిస్తే... వారిచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘మా వద్దనే కాకుండా జిల్లాలో ఎక్కడా వాడడం లేదు. ల క్షలాది రూపాయలు వెచ్చించి ఎంతో మేలు చేస్తుందని ఆశిస్తే ఆశలన్నీ అవిరయ్యారుు.’ అని అంటున్నారు.
వైర్‌లెస్ సెట్లు!
Published Thu, Oct 3 2013 6:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
Advertisement
Advertisement