
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సంస్థ రిలయన్స్ జియో ఆగస్ట్ నెలలో కొత్తగా 6.49 లక్షల మంది వైర్‌లెస్ వినియోగదార్లను సొంతం చేసుకుంది. సంస్థ మొత్తం కస్టమర్ల సంఖ్య 44.38 కోట్లకు చేరుకుంది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం.. భారతి ఎయిర్‌టెల్ 1.38 లక్షల మంది వినియోగదార్లను దక్కించుకుంది. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 35.41 కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా 8.33 లక్షల మందిని చేజార్చుకుంది. మొత్తం వినియోగదార్ల సంఖ్య 27.1 కోట్లకు వచ్చి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment