అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాలో రాక్షస పాలన నడుస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి కేశవనారాయణ, రామగిరి మండల కన్వీనర్ నాగరాజు, రామగిరి సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రామాంజనేయులు ధ్వజమెత్తారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. రామగిరి మండలం కుంటిమద్దిలో చంద్రబాబు, పరిటాల రవీంద్ర పైలాన్‌లు ధ్వంసం చేశారనే నెపంతో వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరుగురిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. టీడీపీ వారే పైలాన్‌ను ధ్వంసం చేసుకుని తమ పార్టీ వారిని అక్రమంగా కేసుల్లో ఇరికించి బెదిరింపులకు దిగుతున్నారన్నారు.
పరిటాల శ్రీరామ్ తన తండ్రి ఫొటోను కూడా తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ యూత్ నాయకులు క్రమశిక్షణతో జిల్లాలో కార్యక్రమాలను చేస్తుంటే ఓర్వలేక ఇలాంటి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలకడం మానాలన్నారు. రామగిరి మండలంలో గతంలో అరాచక పాలన సాగిందని, అలాంటి పాలనను పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రామగిరి మండలంలో నిర్వహించే తెప్ప తిరునాలను అ«ధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.
‘అనంత’లో రాక్షసపాలన
Published Sun, Apr 9 2017 11:33 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
Advertisement
Advertisement