
జగన్ వల్లే రుణమాఫీ అమలు
రైతు, డ్వాక్రా రుణాలపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిని నిలదీయడం వల్లే ఆమాత్రమైనా రుణమాఫీ ప్రకటించారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
వైఎస్సార్సీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: రైతు, డ్వాక్రా రుణాలపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిని నిలదీయడం వల్లే ఆమాత్రమైనా రుణమాఫీ ప్రకటించారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసిన బాబు అధికారం చేపట్టిన తరువాత కమిటీలతో కాలయాపన చేశార ని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా జగన్ నిలదీయగా షరతులతో కూడిన రుణమాఫీకి బాబు ఒప్పుకున్నారన్నారు.
దీన్ని అంగీకరించేది లేదని పూర్తిస్థాయి రుణమాఫీ చేయాలని జగన్ డిమాండ్ చేసిన విషయాన్ని ధర్మాన ప్రస్తావించారు. రాజధాని నిర్మాణంపై బాబు నాటకాలాడుతున్నారని విమర్శించారు. తమ వారికి ప్రయోజనం కల్పించేందుకే మంత్రులతో రకరకాలుగా లీకులు చేయిస్తున్నారన్నారు. అధికారం చేపట్టి మూడు నెలలు కావస్తున్నా చంద్రబాబు పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదని విమర్శించారు. వైఎస్ తన పాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగిస్తే బాబు తన పాల నతో ప్రజలను విసిగిస్తున్నారన్నారు.