‘కాగ్‌’ నివేదిక చెంపపెట్టు లాంటిది | Cm Kcr 'Cag' Is Like A Report | Sakshi
Sakshi News home page

‘కాగ్‌’ నివేదిక చెంపపెట్టు లాంటిది

Published Sun, Apr 8 2018 9:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:47 PM

Cm Kcr  'Cag' Is Like A Report - Sakshi

మాట్లాడుతున్న జగదీశ్వర్‌గుప్తా

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌ :  ఇతర రాష్ట్రాల కంటే తనపాలనే మెరుగు అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌కు కాగ్‌నివేదిక చెంపపెట్టులాంటిదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్‌గుప్తా విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన, స్థానిక పార్టీ జిల్లా అధ్యక్షురాలు బీస మరియమ్మ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో 10శాతం పెట్టుబడి వ్యయం ఎక్కు వ అని కాగ్‌ తెలిపిందన్నారు. కేటాయించిన రూ. 10వేల కోట్లు ఖర్చులేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభు త్వం ఉందన్నారు. మిషన్‌ కాకతీయ పథకం పూర్తి గా అక్రమాల పుట్ట అని ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో రైతురుణమాఫీని ఒకేసారి చేశారని, కాని ఈ ప్రభుత్వం నాలుగుసార్లు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  రైతులపై వడ్డీభా రం పడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజ లు తగిన బుద్ధిచెబుతారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు బీస మరియమ్మ, నేత శశిధర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement