కాజీపేట రూరల్ : రైతు ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బా ధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం డిమాం డ్ చేశారు. హన్మకొండ హరిత హోటల్‌లో శుక్రవారం వైఎస్సార్ సీపీ వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్ అ ధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విలియం మాట్లాడుతూ.. ది వంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, నేడు కేసీఆర్ పాలనలో రైతులు అన్ని విధాలా నష్టపోయి మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు.
రైతులకు బాసటగా ఉండాల్సిన ప్రభుత్వం సమయానికి విత్తనాలు, రుణాలు మంజూరు చేయకపోవంతో రైతులకు దిక్కు లేకుండా పోయిందని ఆరోపించా రు. ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై వెంటనే స్పందించి నైతిక బాధ్యత వహించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ యాదవ్ మాట్లాడు తూ.. ఖరీఫ్‌లో రుణాల మంజూరులో రైతు సమస్యల పట్టింపులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వైఎస్సార్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్ మాట్లాడుతూ.. ర్యాగింగ్ మహామ్మారిని విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు తరిమి కొట్టాలని ఆన్నారు.
ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివకుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు దోపతి సుదర్శన్ రెడ్డి, సీనియర్ నాయకులు సాల్మన్‌రాజ్, సంగాల ఈర్మియా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దుప్పటి ప్రకాష్, జిల్లా కార్మిక విబాగం అధ్యక్షుడు గౌని సాంబయ్య గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంచె అశోక్, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు జన్ను విల్సన్ రాబర్ట్, జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలిపురి రఘు, జిల్లా అధికార ప్రతినిధి షంషీర్ బేగ్, గ్రేటర మైనార్టీ అధ్యక్షుడు బద్రుద్దీన్ ఖాన్, గ్రేటర్ యూత్ అధ్యక్షుడు నాగపురి దయాకర్, జిల్లా నాయకులు మైలగాని కళ్యాణ్‌కుమార్, చంద హరికృష్ణ, మాదాడి చరన్‌రెడ్డి, తాజుద్దీన్, హన్మంతరావు, ఆరెపల్లి రాజు, భిక్షపతి, దోపతి మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.
రైతు ఆత్మహత్యలకు కేసీఆర్ బాధ్యత వహించాలి
Published Sat, Sep 5 2015 4:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement