మాయ చేస్తే ఉద్యమిస్తాం | If the placenta udyamistam | Sakshi
Sakshi News home page

మాయ చేస్తే ఉద్యమిస్తాం

Published Wed, Oct 1 2014 1:59 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM

మాయ చేస్తే ఉద్యమిస్తాం - Sakshi

మాయ చేస్తే ఉద్యమిస్తాం

రుణమాఫీ అంశంపై సీపీఎం నేత రాంభూపాల్‌రెడ్డి
 గుంతకల్లు టౌన్: రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ  చేయకపోతే ఉద్యమించక తప్పదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం మార్కెట్ యార్డులో గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల్లోని సీపీఎం కార్యకర్తలకు వర్క్‌షాప్ నిర్వహించారు. సీపీఎం గుంతకల్లు డివిజన్ కార్యదర్శి డి.శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ రుణాలమాఫీకి సంబంధించి ఎంపీ సుజనాచౌదరి తాజాగా చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు. రుణాల మాఫీపై ఒక్కో మంత్రి ఒక్కో ప్రకటన చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.  రుణాలను మాఫీ చేయకపోతే చంద్రబాబును ప్రజలు రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేయడం ఖాయమన్నారు. అక్టోబర్ 13 లోగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చకపోతే ఉద్యమానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యుడు నల్లప్ప, గుంతకల్లు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement