డ్వాక్రా మహిళలపై జులుం ! | house lock to dwakra women | Sakshi
Sakshi News home page

డ్వాక్రా మహిళలపై జులుం !

Published Wed, Dec 7 2016 11:13 PM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM

డ్వాక్రా మహిళలపై జులుం ! - Sakshi

డ్వాక్రా మహిళలపై జులుం !

- రుణాలు చెల్లించకపోతే ఇళ్లకు తాళం
- బ్యాంకు అధికారులు, ఐకేసీ సిబ్బంది హెచ్చరికలు
– వేధిస్తే ఆత్మహత్యలే శరణ్యమంటున్న బాధితులు

 
డీ.హీరేహాళ్‌ : రుణాలు చెల్లించకపోతే ఇళ్లకు  తాళాలు వేస్తామంటూ బ్యాంకు అధికారులు, ఐకేపి సిబ్బంది వేధిస్తున్నారని మహిళలు వాపోతున్నారు. ఎం.హనుమాపురం గ్రామానికి చెందిన ఎస్సీకాలనీ మహిళలు మాట్లాడుతూ డ్వాక్రా  రుణాలు చెల్లించవద్దని చంద్రబాబునాయుడు చెప్పడంతో తాము చెల్లించలేదన్నారు. తమ కాలనీలో 12 సంఘాలు  ఉన్నాయన్నారు. ఒక్కొక్కరు రూ.14వేల చొప్పున సంఘం తరుపున అప్పుతీసుకున్నామన్నారు. దీనికి రూ.40వేలు వడ్డీ, అసలు కట్టాలని అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అంతకు ముందే ఒక్కొక్కరు తీసుకున్న డబ్బుకు రూ.15వేల వరకు చెల్లించామని వారు వాపోయారు.  

ప్రస్తుతం వాయిదాల రూపంలో చెల్లించేందుకు లక్షకు మరో లక్ష అప్పుఇస్తూ కొత్తలోన్లు అంటూ ఒక్కొక్కరికి రూ.40వేల చొప్పున కొత్త అప్పును కట్టిపెట్టారన్నారు. తాము తీసుకున్నది రూ.14వేలు మాత్రమేనని చెప్పారు. వాయిదాలు చెల్లించినా ఐకేపీ సిబ్బంది సక్రమంగా బ్యాంకుకు చెల్లించక తమని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఒక్కో సంఘానికి రూ.7 వేలకు మించి అప్పువుండదన్నారు. అయితే బ్యాంకు అధికారులు   ఒక్కో సంఘంలో సభ్యులు అందరూ కలిసి రూ.2 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు  చెప్పారు. ఐకేపి సిబ్బంది అప్పు వసూలుకు వచ్చిన ప్రతిసారి పెట్రోల్‌ ఖర్చుకు తమ నుంచి డబ్బు గుంజుతున్నారన్నారు.  పంటలు లేక,  ఊర్లో పనులు లేవని,  అయినా డబ్బు కోసం అధికారులు మాత్రం వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటికి తాళం వేస్తామంటున్నారు..
డ్వాక్రా  అప్పు చెల్లించకపోతే ఇంటికి తాళం వేస్తామని భయపెడుతున్నారు. సంఘంలో తీసుకున్న అసలు డబ్బు చెల్లించాం. కేవలం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంది. వడ్డీకి మారువడ్డీ వేసి, అప్పుకన్న వడ్డీనే రూ.40 వేలు ఉందని చెబుతున్నారు.
 – కాడమ్మ, ఓబక్క, జ్యోతి సంఘం.

పొదుపు డబ్బునూ జమా చేసుకున్నారు ....
అప్పుతోపాటు పొదుపును కూడా చేసేవారం. అప్పుతీసుకున్న తరువాత వాయిదాలతోపాటు పొదుపును కూడా పెంచుకుంటూ వచ్చాం.  అప్పులు మాఫీ చేస్తామని చెప్పడంతో  డబ్బు కట్టలేదు. పొదుపు  డబ్బునూ   అప్పునకు జమా వేసుకున్నారు.  అప్పు తెగలేదు. వడ్డీ పెరిగింది.
    – రేణుకమ్మ, పెన్నక్క, స్వయంశక్తి సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement