ఎండతీవ్రతతో ఇబ్బందులు పడుతూ సభా ప్రాంగణానికి వస్తున్న మహిళలు
నరసన్నపేట : సారవకోట మండలం రంగసారం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభ కోసం బస్సుల్లో వచ్చిన డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఎండతీవ్రత ఎక్కువగా ఉండటం.. సభాస్థలికి ఐదు కిలో మీటర్లు దూరంలో బస్సులు నిలిపివేయడంతో వాటి వద్దకు చేరుకొనే సరికి నానా అవస్థలు పడ్డారు. పులిహోరా ప్యాకెట్లు ఇచ్చినా మంచి నీరు ఇవ్వలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఆంక్షల పేరున కిలో మీటర్ల దూరంలో బస్సులు నిలిపి వేయడంతో ఎండ తీవ్రతకు గురయ్యారు. సభ అనంతరం వచ్చిపోయో వాహనాలతో సారవకోట–రంగసాగరంల మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇదిలా ఉండగా, స్వయం శక్తి సంఘాల మహిళలతో పాటు ఉపాధి వేతనదారులు కూడా అధిక సంఖ్యలో సభా ప్రాంగణానికి తరలించారు. ఇందుకు ప్రతిఫలంగా ఉపాధి వేతనదారులకు ఫ్రీ మస్తర్ వేసి ఒక్కో కూలీకి రూ.150 వచ్చేలా ఫీల్డు అసిస్టెంట్లు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment