టీడీపీకి ఓట్లేయించే బాధ్యత డ్వాక్రా సంఘాలదే
సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: ‘ఎవ్వరికైనా తిండి పెట్టినవాడిని అన్నదాత అని ఆశీర్వదించడం మన సంస్కృతి. డ్వాక్రా సంఘాలను నేనే ప్రారంభించాను. రూ.6 వేలు చొప్పున పసుపు కుంకుమ కింద ఇచ్చాను. రుణాలపై వడ్డీ మాఫీ చేశాను. నెలకు రూ.10 వేల చొప్పున ఆదాయం చూపిస్తాను. ఇంకా రూ.20 వేల ఆదాయం వచ్చేట్లు చేస్తాను. ఇది గుర్తుంచుకోండి. 65 లక్షల మంది టీడీపీ కార్యకర్తలతో 90 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు కలిసి పనిచేయాలి.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 80 శాతం ఓట్లేయించాలి...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు మరోసారి ఎర వేశారు. ఆయన సోమవారం శ్రీకాకుళం జిల్లా పాల కొండ నియోజకవర్గం పరిధి వీరఘట్టం మండలంలోని తెట్టంగి గ్రామంలో ‘ఇంటింటా టీడీపీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.
ప్రాజెక్టుల తనఖాతో రుణం
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రూ.3 వేల కోట్ల రుణాన్ని సమీకరిం చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.