
సాక్షి, విశాఖపట్నం: సరైన వసతులు లేవని అడిగిన విద్యార్థులను యాజమాన్యం సెల్లార్‌లో బంధించి నరకం చూపించిన సంఘటన శుక్రవారం వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో చోటు చేసుకుంది. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు చెందిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో ప్లే గ్రౌండ్, హార్స్‌రైడింగ్, సరైన భోజన వసతులు లేవని నిర్వాహకుల్ని విద్యార్థులు ప్రశ్నించారు. ఆందోళన నేపథ్యంలో 100 మంది విద్యార్థులను నిర్వాహకులు సెల్లార్‌లోనే బంధించారు. విషయం తెలుకున్న ఢిపెన్స్ అకాడమీకి చేరుకున్న పోలీసులు సంఘటనపై విచారణ చేస్తున్నారు. విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని డిఫెన్స్ అకాడమీపై పలు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment