
సాక్షి, విశాఖపట్నం: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు సూర్య, రాశి దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు. వారిద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్పూర్తిగా దీవించారు. ఎమ్మెల్యే వాసుపల్లి కుమారుడి రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, వాతావరణం అనుకూలించకపోవడంతో రాలేకపోయారు. కాగా, నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ అక్కడ నుంచి నేరుగా వాసుపల్లి ఇంటికి చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
జన్మ ధన్యమైంది: ఎమ్మెల్యే వాసుపల్లి
సీఎం జగన్ ఇంటికి రావడంతో మా జన్మ ధన్యమైందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రిసెప్షన్‌కు సీఎం రాలేకపోయారు. సీఎం రాలేకపోతున్న విషయాన్ని నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. మత్స్యకారుడైన నా ఇంటికి సీఎం జగన్ రావడం చాలా సంతోషం. నిండు మనసుతో నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ రోజును మేము జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment