newly wed couple
-
నూతన దంపతులు 16 మందిని కనాలి
చెన్నై: నూతన దంప తులు ఎక్కువ మంది పిల్లల్నికనే విష యం ఆలోచించాల ని తమిళనాడు ము ఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొ న్నారు. ‘తమిళ సంప్రదాయంలో పెద్దలు నూతన దంపతులను 16 సంపదలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తుంటారు. కానీ, నేడు పరిస్థితి మారిపోయింది. 2026 నుంచి చేపట్టనున్న జన గణన, లోక్‌సభ నియోజ కవర్గాల పునర్విభజనతో పుణ్యమాని చిన్న కుటుంబానికి బదులు, 16 మంది సంతానంతో కళకళలాడాలని ఆశీర్వదించాల్సిన రోజులొచ్చాయి’అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం చెన్నైలో జరిగిన సామూహిక వివాహ వేదిక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దేశంలో ఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోనుందని అన్నారు. ‘లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున, మాకు 16 మంది పిల్లలుండాలా అని ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడొచ్చు. అయితే, ఈ విషయం మనం మర్చిపోకూడదు’ అని ఆయన అన్నారు. -
ఈ చలాకీ చిన్నారి.. పెళ్లి కూతురైంది.. బంగారు బొమ్మలా! (ఫోటోలు)
-
పెళ్ళైన ఒక్క రోజుకే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నవవధువు..
గ్రేటర్ నోయిడా: ఓ నూతన వధువు పెళ్ళైన మరుసటి రోజునే ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉదంతం గ్రేటర్ నోయిడాలో ఒక గ్రామంలో చోటుచేసుకుంది. వివాహం జరిగి 24 గంటలైనా కాకుండానే తన భార్యకు డెలివరీ కావడంతో షాక్ లో ఉండిపోయాడు నవవరుడు. కడుపు నొప్పని వెళ్తే.. వివరాల్లోకి వెళ్తే జూన్ 26, సోమవారం రోజున పెద్దల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా ఆ జంట ఒక్కటయ్యారు. అదే రోజు రాతి ఆ వధువుకు కడుపులో చిన్నగా నొప్పి వస్తోందని చెప్పడంతో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెను పరీక్షించి చూడగా ఆమె ఏడో నెల గర్భవతి అని నిర్ధారించి డెలివరీ కూడా చేయగా అడబిడ్డకు జన్మనిచ్చింది వధువు. దీంతో ఆమె భర్తతో పాటు అత్తమామలు షాక్ కు గురయ్యారు. గతంలో కిడ్నీలో రాళ్లు ఉన్నాయని ట్రీట్మెంట్ చేయించాము. ఆ తర్వాత కడుపు వాపు వస్తుండటంతో ట్రీట్మెంట్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్ అనుకున్నామని వధువు తల్లిదండ్రులు చెబుతున్నారు. బంధువుల జోక్యంతో.. సికింద్రాబాద్ కు చెందిన ఆ యువతి పెళ్ళికి ముందే గర్భం దాల్చిందన్న విషయం తెలిసి కూడా పెళ్లికూతురు తల్లిదండ్రులు విషయాన్ని దాచిపెట్టారని ఆమెను గానీ ఆమె బిడ్డను గానీ తమ ఇంటిలోకి రానిచ్చేది లేదని మొదట తెగేసి చెప్పారు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు. అంతలోనే బంధువులు కల్పించుకుని సమస్య సద్దుమణిగేలా చేయడంతో వారు మాకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: వెడ్డింగ్‌లో విచిత్రం.. కోపంతో ఊగిపోయిన వధువు ఏం చేసిందంటే.. -
ఘోర ప్రమాదం.. నూతన జంటతో సహా నలుగురు సజీవ దహనం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా హర్దా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడిని చేరుకుని విచారణ చేపట్టారు. వేగంగా వెళ్తోన్న కారు అదుపుతప్పి కారు చెట్టును ఢీకొట్టడంతో ఇటీవలే వివాహమైన జంటతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైందని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మగవాళ్లు, ఒక మహిళ ఉన్నారని తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన జంటకు ఆరు నెలల క్రితమే వివాహమైందని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గతవారమే మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో స్లీపర్ బస్సు.. ట్రాలీని ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. బస్సు అహ్మదాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. చదవండి: Aghora Puja: మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు.. వీడియో వైరల్ -
పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు.. రిసెప్షన్‌కు ముందే..
రాయ్‌పూర్: ఈ జంటకు ఆదివారమే పెళ్లైంది. విహవా వేడుక ఘనంగా జరిగింది. మంగళవారం రాత్రి గ్రాండ్‌గా రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏం జరగిందో తెలియదు. రిసెప్షన్‌కు కొన్ని గంటల ముందే నవ దంపతులు తమ ఇంట్లోని గదిలో శవాలుగా కన్పించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని బ్రిజన్‌గర్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఇద్దరి ఒంటిపై కత్తిగాయాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. భార్యభర్తలిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. భర్త తన భార్యను పొడిచి చంపిన తర్వాత, తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పేర్కొన్నారు. ఈ దంపతులు గదిలోకి వెళ్లి తాళం వేసుకొని గొడవపడ్డారని, అరుపులు కేకలు వినిపించాయని కుటంబసభ్యులు చెప్పారు. లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోడవంతో కిటీకీలోనుంచి చూస్తే ఇద్దరు రక్తపుమడుగులో కన్పించారని పేర్కొన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తీరా చూస్తే ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరి మధ్య గొడవ జరిగి భర్తే భార్యను హత్య చేసి, తానూ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఇతర కోణాల్లోనూ విచారణ జరుపుతామన్నారు. చదవండి: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరకు.. -
రోడ్డు ప్రమాదం.. పెళ్లైన మూడో రోజే నవవధూవరులు మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధూవరులిద్దరూ మృత్యువాతపడ్డారు. ఒడిశా సరిహద్దులోని గొల్రంత వద్ద దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పెళ్లైన రెండు రోజులకే దంపతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు.. ఇచ్ఛాపురం బెల్లుపడ కాలనీకి చెందిన గవలపు నాగరత్నం, రామారావు కుమారుడు వేణుకు (26) ఒడిశాలోని బరంపురానికి చెందిన స్ ప్రవల్లికతో (23) ఈనెల 10న సింహాచలం వరహా లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో వివాహమైంది. పెళ్లికి బంధువులందరూ హాజరయ్యారు. ఈనెల 12న ఆదివారం ఇచ్ఛాపురంలో రిసెప్షన్ జరిగింది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సోమవారం సాయంత్రం నూతన జంట ద్విచక్రవాహనంపై ప్రవల్లిక ఇంటికి బరంపురానికి బయల్దేరారు. కాసేపు ఉండి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో గొళంత్రా దగ్గర వెనక నుంచి వస్తున్న ఓ ట్రాక్టర్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అక్కడికక్కడే మృతిచెందింది. వరుడికి తీవ్ర గాయాలవ్వగాని స్థానికులు బరంపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను కూడా మృతిచెందారు. కలకాలం కలసి కాపురం చేయాలనుకున్న జంట పెళ్ళి అయిన ఇలా కాళ్ల పారాణి ఆరకముందే మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: Valentine's Day: ఖండాంతరాలు దాటిన ప్రేమ -
ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా!
తిరువనంతపురం: ఆలయానికి వెళ్లిన ఓ కొత్త జంటకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోని గజరాజు ముందు ఫోటోలు దిగాలనుకున్నారు. కానీ, ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆ ఏనుగు దాడి చేసింది. ఈ వీడియోను ఓ ఫోటోగ్రాఫర్ ‘వెడ్డింగ్ మొజిటో’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. ఈ సంఘటన కేరళ త్రిస్సూర్‌లోని గురువాయుర్ ఆలయంలో నవంబర్ 10న జరిగింది. గజరాజు ఒక్కసారిగా దాడి చేయడంతో సమీపంలోని భక్తులంతా పరుగులు పెట్టాల్సి వచ్చింది. వీడియో ప్రకారం.. కొత్త జంట మెడలో మాలలతో ఏనుగు సమీపంలోకి వెళ్లి ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. వారికి గజరాజు కుడివైపున ఉంది. ఫోటోగ్రాఫర్ కెమెరాను క్లిక్ మనిపించగా.. ఆగ్రహానికి గురైన ఏనుగు ఒక్కసారిగా దాడి చేసింది. మావటి అదుపు చేసేందుకు ప్రయత్నించగా ఎత్తి కుమ్మిపడేసింది. తొండంతో పైకెత్తేందుకు ప్రయత్నించగా కింద పడిపోయాడు. ఆ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, అతని శరీరంపై ఉన్న బట్టలను ఏనుగు లాగేసింది. ఆ తర్వాత ఏనుగుపై ఉన్న మరో మావటి దానిని అదుపు చేశాడు. తమకు ఎదురైన ఈ సంఘటనను వీడియోలో వివరించాడు పెళ్లి కొడుకు. తాము ఫోటోలు దిగుతుండగా అంతా అరుస్తూ పరుగెడుతున్నారని, తన భార్య చేతిని పట్టుకుని లాక్కెళ్లినట్లు చెప్పాడు. View this post on Instagram A post shared by Wedding Mojito (@weddingmojito) ఇదీ చదవండి: Video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురు చిన్నారులు.. భయంతో కేకలు, ఏడుపు -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
-
ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంటికి సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు సూర్య, రాశి దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించారు. వారిద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్పూర్తిగా దీవించారు. ఎమ్మెల్యే వాసుపల్లి కుమారుడి రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, వాతావరణం అనుకూలించకపోవడంతో రాలేకపోయారు. కాగా, నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ అక్కడ నుంచి నేరుగా వాసుపల్లి ఇంటికి చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు. జన్మ ధన్యమైంది: ఎమ్మెల్యే వాసుపల్లి సీఎం జగన్ ఇంటికి రావడంతో మా జన్మ ధన్యమైందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రిసెప్షన్‌కు సీఎం రాలేకపోయారు. సీఎం రాలేకపోతున్న విషయాన్ని నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. మత్స్యకారుడైన నా ఇంటికి సీఎం జగన్ రావడం చాలా సంతోషం. నిండు మనసుతో నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ రోజును మేము జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. చదవండి: (అదానీ, అంబానీల చూపు.. ఏపీ వైపు: సీఎం జగన్) -
బొద్దింక దెబ్బకు హడలెత్తిన కొత్త జంట
బొద్దింక ఏమిటి.. పద్దెనిమిది ఇళ్లు మార్పించడం ఏమిటన్న డౌట్ వస్తోందా? నిజమే.. కొత్తగా ఓ పెళ్లయిన జంట బొద్దింకతో పడ్డ అవస్థలు, తర్వాతి చిక్కులు అన్నీ ఇన్నీ కావు. దీనంతటికీ కారణం కూడా చాలా సింపులే.. ముందు అసలు కథేమిటో తెలుసుకుందామా? మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు 2017లో ఓ అమ్మాయితో పెళ్లయింది. హాయిగా కొత్త కాపురం పెట్టారు. ఓ రోజు ఆమె కిచెన్‌లో పనిచేసుకుంటోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా గట్టిగా కేక పెట్టింది. వెళ్లి చూస్తే భయంతో గజగజా వణికిపోతూ కనిపించింది. మళ్లీ కిచెన్‌లోకి వెళ్లనంటే వెళ్లబోనంటూ మొండికేసింది. మరెట్లా అంటే.. ఇల్లే మార్చేద్దామన్నది. సరేనని ఇల్లు మారారు. మళ్లీ అదే సీన్.. మళ్లీ కిచెన్.. గట్టి కేక, భయం, వణుకు.. ఇలా మూడేళ్లలో ఒకటీ రెండు కాదు ఏకంగా 18 ఇళ్లు మార్చాల్సి వచ్చింది. ప్రతిచోటా కిచెన్‌లో ఆమె భయపడి కేక పెట్టినది బొద్దింకలను చూసే. ఇలా భయపడటంతో వదిలేయకుండా చేతికందిన వస్తువు తీసి విసరడం, బొద్దింకలు తాకిన వస్తువులను బయటపడేయడం మొదలుపెట్టింది. అసలు తాము వెళ్లిన ప్రతిచోటా బొద్దింకలు ఎందుకు వస్తున్నాయో, ఏం చేయాలో, ఆమెకు బొద్దింకలంటే ఉన్న భయాన్ని (ఫోబియాను) ఎలా పోగొట్టాలో అర్థంగాక సదరు భర్త తలపట్టుకుంటున్నాడట. -
విషాదం: పెళ్లయిన నాలుగు నెలలకే..
సాక్షి, కొమ్మాది (భీమిలి): పెళ్లయిన నాలుగు నెలలకే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో విబేధాల కారణంగా మనస్తాపం చెందిన ఆయన ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. జీవీఎంసీ నాలుగో వార్డు మంగమారిపేట ప్రాంతానికి చెందిన గరికిన తాతారావు అలియాస్ టోని (24)కి నాలుగు నెలల కిందట శ్రీకాకుళం జిల్లా సంతమ్మాళి మండలం మరువాడకు చెందిన పావనితో వివాహం జరిగింది. తాతారావు నగరంలో ఓ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల వరకు వీరి జీవితం సరదాగా సాగింది. తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. వారం రోజుల కిందట పావని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పోయింది. రోజూ ఆమెకు ఫోన్ చేస్తూ ఇంటికి రమ్మని ప్రాధేయ పడినట్టు తాతారావు తల్లిదండ్రులు గరికిన ఎల్లయ్య, పోలమ్మ తెలిపారు. అయితే ఆమె రాకపోవడంతో మనస్తాపానికి గురైన తాతారావు శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం విగతజీవిగా వేలాడుతున్న తన కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడు సరదాగా ఉంటూ.. అందరిని ఆప్యాయంగా పలకరించే తాతారావు మృతి చెందడంతో.. మంగమారిపేట గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. చదవండి: కూకట్పల్లి: యువతిని ఎరగా వేస్తారు, ఆశపడ్డావో అంతే! విచారణ కోసం వెళ్లిన పోలీసుని రాళ్లతో కొట్టి.. -
తొలి రాత్రే షాకిచ్చిన వధువు: రాడ్‌తో భర్తను కొట్టి..
లక్నో: ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభిద్దామనుకున్న వరుడికి తొలిరాత్రే షాకిచ్చింది ఓ నూతన వధువు. గదిలోకి వెళ్లగానే ఐరన్ రాడుతో భర్త తల మీద మోది డబ్బు, నగలతో ఉడాయించింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని హరిద్వార్‌కు చెందిన యువతికి బింజోర్‌లోని కుండా ఖుర్ద్‌కు చెందిన యువకుడికి మార్చి 15న గుడిలో వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత వరుడు తనతో ఏడడుగులు నడిచిన భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. తనతో కలిసి కొత్త మజిలీ ప్రారంభించబోతున్నందుకు సంతోషంలో తేలియాడాడు. కానీ అతడి ఆనందం ఎంతో సేపు ఉండలేదు. అతడి ఆశల మీద నీళ్లు చల్లుతూ ఫస్ట్‌నైట్ రోజే అసలు స్వరూపం బయటపెట్టింది నూతన వధువు. గదిలోకి వెళ్లగానే కట్టుకున్న భర్త మీద ఐరన్ రాడితో దాడి చేసింది. దీంతో అతడు పెద్దగా కేకలు వేయగా.. బంధువులు గదిలోకి వచ్చేసరికి ఆమె అక్కడ నుంచి ఉడాయించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ ఘటన గురించి అతడు మాట్లాడుతూ.. "అసలేం జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. నా భార్య ఆ రోజు సడన్‌గా నా మీద దాడి చేసింది. దీంతో నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆమె బంగారు నగలతో పాటు రూ.20 వేలు తీసుకుని పారిపోయిందని తర్వాత తెలిసింది" అని చెప్పుకొచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వధువు కోసం గాలిస్తున్నారు. అలాగే ఈ పెళ్లి కుదిర్చిన పెళ్లిళ్ల పేరయ్య కోసం వెతుకుతున్నారు. చదవండి: స్వేచ్ఛ కోసం ఇల్లు వదిలింది.. మృగాడికి బలయ్యింది -
క్యాంపస్‌లో నవదంపతుల మృతి
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని బీర్భం జిల్లాలో విశ్వభారతి యూనివర్సిటీ క్యాంపస్‌లో నవ దంపతులు మరణించిన ఘటన కలకలం రేపింది. క్యాంపస్‌లోని చీనా భవన్ వద్ద కొత్త జంట మృతదేహాలను గుర్తించామని శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు వెల్లడించారు. విశ్వభారతి వర్సిటీకి చెందిన చైనా భాష, సాంస్కృతిక శాఖ చినా భవన్‌గా పేరొందిన సంగతి తెలిసిందే. మృతులను సోమనాధ్ మహతో (18), అవంతిక (19)గా గుర్తించారు. వీరిద్దరూ ఇటీవల వివాహం చేసుకున్నారని, వీరు గతంలో బోల్పూర్లోని శ్రీనంద హైస్కూల్ విద్యార్ధులని పోలీసులు చెప్పారు. కాగా, ఈ ఏడాది సోమనాధ్ హయ్యర్ సెకండరీ పరీక్షలకు హాజరవగా, అవంతిక పదవ తరగతి పరీక్షలు రాసినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు. నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తుండగా పోస్ట్ మార్టర్ నివేదిక తర్వాతే వాస్తవాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అర్ధరాత్రి వేళ నవజంట క్యాంపస్‌లోకి ఎలా ప్రవేశించిందనే అంశంపై వర్సిటీ అధికారులు విచారణకు ఆదేశిస్తారని విశ్వభారతి యూనివర్సిటీ పీఆర్ఓ అనిర్బన్ సర్కార్ వెల్లడించారు. -
కొత్త జంట ముచ్చట తీర్చిన హీరో
అభిమాన నటున్ని చూడాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అభిమానం ఎక్కువైన కొందురు మాత్రం ఏకంగా సదరు హీరో ఇంటి ముందు పడిగాపులు కాసి మరీ దర్శనం భాగ్యం కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ల అదృష్టం బాగుంటే దర్శనం లభిస్తుంది.. లేదంటే లేదు. అభిమానం ఎక్కువైన ఓ ముంబై జంట ఇలాంటి ప్రయోగమే చేసింది. చివరకూ విజయం సాధించింది కూడా. వివరాలు.. ముంబైకి చెందిన ఓ జంటకు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ అంటే విపరీతమైన అభిమానం. ఎంత పిచ్చి అంటే వివాహం అయిన వెంటనే అందురూ దైవ దర్శనం నిమిత్తం గుడికి వెళ్లడం సాధరణం. కానీ వీరు మాత్రం పెళ్లయిన వెంటనే తమ అభిమాన హీరో షారుక్ నివాసం అయిన మన్నత్ వద్దకు చేరుకున్నారు. అక్కడ షారుక్ ఖాన్ సిగ్నేచర్ మూవ్మెంట్ పోజ్‌లో భార్యభర్తలిద్దరూ నిల్చూని.. షారుక్ దర్శనం కోసం ఎదురు చూడసాగారు. షాకింగ్.. వారిని షారుక్ ఖాన్ చూడటమే కాక హాయ్ కూడా చెప్పడంట. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే షారుక్ ట్విట్టర్ ద్వారా సదరు దంపతులకు ఆశీర్వాదాలు కూడా తెలిపారు. ఇంకేముంది ఆనందంలో ఉక్కిరి బిక్కిరవుతున్నారు కొత్త జంట. God Bless you. https://t.co/A0a7CQ2PXQ — Shah Rukh Khan (@iamsrk) December 14, 2018 అయితే వీరు ఈ ఏడాది జూన్‌లోనే సదరు జంట ‘డిసెంబరులో మా వివాహం.. మీ ఆశీర్వాదం కావాలం’టూ షారుక్ ఖాన్‌కు ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. అయితే షారుక్ ఆ ట్వీట్ చూశాడో, లేదో కానీ.. కొత్త జంట ముచ్చట తీర్చి.. వారికి మరింత సంతోషాన్ని కలిగించారు. #AskSRK@iamsrk #AskSRK getting married this december, just need your blessings @iamsrk and love you!!!!! Your reply will equate to your presece in our marriage pic.twitter.com/kvPz7Vjmbc — dhruvp2894 (@dhruvp2894) June 6, 2018 -
నవదంపతులపై దాడి కేసులో ట్విస్ట్
-
కొత్తజంటకు సీఎం వినూత్న కానుక!
పెద్దనోట్ల రద్దు ప్రభావం పెళ్లిళ్లపైనా పడుతోంది. తగినంత నగదు అందుబాటులో లేకపోవడంతో నూతన వధూవరులకు కానుకలు ఇవ్వాలనుకున్నవారు కొన్ని సందర్భాల్లో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కొత్త జంటకు వినూత్న కానుక ఇచ్చారు. ఇటీవల ఓ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లయింది. ఈ పెళ్లికి హాజరైన రఘుబర్ దాస్ నూతన వధూవరులకు క్యాష్ ప్రిపెయిడ్ కార్డును కానుకగా ఇచ్చారు. నోట్ల రద్దు నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం ప్రతి జిల్లాలోని ఒక బ్లాక్‌ను ఈ నెల ముగిసేలోగా నగదు రహిత లావాదేవీల దిశగా మళ్లించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగదు రహిత లావాదేవీలవైపు మళ్లాల్సిందిగా ప్రజలకు సందేశం ఇస్తూ సీఎం పెళ్లివేడుకలో ఈ కొత్తరకం కానుకను ఇచ్చారు. గిరిజన జనాభా అధికంగా గల జార్ఖండ్‌లో నోట్ల రద్దు ప్రభావాన్ని తప్పించుకొనేందుకు నగదురహిత లావాదేవీలను వేగవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం భావిస్తోంది.