
రాయ్‌పూర్: ఈ జంటకు ఆదివారమే పెళ్లైంది. విహవా వేడుక ఘనంగా జరిగింది. మంగళవారం రాత్రి గ్రాండ్‌గా రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏం జరగిందో తెలియదు. రిసెప్షన్‌కు కొన్ని గంటల ముందే నవ దంపతులు తమ ఇంట్లోని గదిలో శవాలుగా కన్పించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని బ్రిజన్‌గర్‌లో ఈ ఘటన జరిగింది.
అయితే ఇద్దరి ఒంటిపై కత్తిగాయాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. భార్యభర్తలిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. భర్త తన భార్యను పొడిచి చంపిన తర్వాత, తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పేర్కొన్నారు.
ఈ దంపతులు గదిలోకి వెళ్లి తాళం వేసుకొని గొడవపడ్డారని, అరుపులు కేకలు వినిపించాయని కుటంబసభ్యులు చెప్పారు. లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోడవంతో కిటీకీలోనుంచి చూస్తే ఇద్దరు రక్తపుమడుగులో కన్పించారని పేర్కొన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తీరా చూస్తే ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరి మధ్య గొడవ జరిగి భర్తే భార్యను హత్య చేసి, తానూ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఇతర కోణాల్లోనూ విచారణ జరుపుతామన్నారు.
చదవండి: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరకు..
Comments
Please login to add a commentAdd a comment