Newly-Wed bride complains of stomach ache, gives birth day after marriage - Sakshi
Sakshi News home page

పెళ్ళై ఒకే ఒక్క రోజయ్యింది.. అంతలోనే ఏడో నెల..?

Published Fri, Jun 30 2023 12:06 PM | Last Updated on Fri, Jun 30 2023 2:38 PM

Newly Wed Bride Complains Stomach Ache Delivers Baby Girl - Sakshi

గ్రేటర్ నోయిడా: ఓ నూతన వధువు పెళ్ళైన మరుసటి రోజునే ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉదంతం గ్రేటర్ నోయిడాలో ఒక గ్రామంలో చోటుచేసుకుంది. వివాహం జరిగి 24 గంటలైనా కాకుండానే తన భార్యకు డెలివరీ కావడంతో షాక్ లో ఉండిపోయాడు నవవరుడు. 

కడుపు నొప్పని వెళ్తే.. 
వివరాల్లోకి వెళ్తే జూన్ 26, సోమవారం రోజున పెద్దల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా ఆ జంట ఒక్కటయ్యారు. అదే రోజు రాతి ఆ వధువుకు కడుపులో చిన్నగా నొప్పి వస్తోందని చెప్పడంతో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెను పరీక్షించి చూడగా ఆమె ఏడో నెల గర్భవతి అని నిర్ధారించి డెలివరీ కూడా చేయగా అడబిడ్డకు జన్మనిచ్చింది వధువు. దీంతో ఆమె భర్తతో పాటు అత్తమామలు షాక్ కు గురయ్యారు.

గతంలో కిడ్నీలో రాళ్లు ఉన్నాయని ట్రీట్మెంట్ చేయించాము. ఆ తర్వాత కడుపు వాపు వస్తుండటంతో ట్రీట్మెంట్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్  అనుకున్నామని వధువు తల్లిదండ్రులు చెబుతున్నారు. 

బంధువుల జోక్యంతో.. 
సికింద్రాబాద్ కు చెందిన ఆ యువతి పెళ్ళికి ముందే గర్భం దాల్చిందన్న విషయం తెలిసి కూడా పెళ్లికూతురు తల్లిదండ్రులు విషయాన్ని దాచిపెట్టారని ఆమెను గానీ ఆమె బిడ్డను గానీ తమ ఇంటిలోకి రానిచ్చేది లేదని మొదట తెగేసి చెప్పారు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు. అంతలోనే బంధువులు కల్పించుకుని సమస్య సద్దుమణిగేలా చేయడంతో వారు మాకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.   

ఇది కూడా చదవండి: వెడ్డింగ్‌లో విచిత్రం.. కోపంతో ఊగిపోయిన వధువు ఏం చేసిందంటే..

   

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement