
మామ బంగారంలాంటి మీ అమ్మాయే నాకు పెద్ద కట్నం.. ఇంక నాకు ఈ కట్నకానుకలు ఎందుకు చెప్పు. ఇదిగో నువ్విచ్చిన కట్నం నువ్వే తీసుకో. ఆచార ప్రకారం ఒక కొబ్బరికాయ, ఒక రూపాయి మాత్రమే ఇస్తే చాలు’ అంటూ పిల్లనిచ్చిన మామ తనకు ఇచ్చిన రూ.5,51,00 కట్నాన్ని వెనక్కి ఇచ్చాడు. దీంతో పెళ్లి కుమార్తె తండ్రి మా అల్లుడు వెరిగుడ్’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాకు చెందిన పరంవీర్ రాథోర్ సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ తరుణంలో ఫిబ్రవరి 14న కరాలియా అనే గ్రామంలో పిజీ చదువుతున్న నికితా భాటిను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత వధువు తండ్రి పలు బహుమతులతో పాటు ఎర్రటి గుడ్డను అలంకరించిన ప్లేట్‌లో రూ. 5,51,000 నగదు తెచ్చాడు. ఆ మొత్తాన్ని అల్లుడికి ఇచ్చాడు. కానీ అల్లుడు వెంటనే ఆ డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చాడు.
కట్నం ఇస్తే.. ఎందుకు తిరిగిచ్చారని పరంవీర్‌ను ప్రశ్నిస్తే.. నా పెళ్లి జరిగే సమయంలో కట్నం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, ఇలాంటి దురాచారాలు సమాజంలో ఇంకా కొనసాగుతుండటం చూసి నాకు బాధ కలిగింది. అందుకే పెళ్లి జరిగిన తర్వాత నా తండ్రితో, కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.
నేను సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నా. నిజమైన మార్పు తెచ్చే బాధ్యత చదువుకున్న మన మీద ఉంది. విద్యావంతులైన మనం మార్పు కోసం ముందుకు రాకపోతే మరెవరు రారు? మార్పు ఎక్కడో ఒకచోట ప్రారంభమవ్వాలి. ఆ మార్పు నా నుంచే మొదలవ్వాలి. నేను తీసుకున్న నిర్ణయాన్ని నా తల్లిదండ్రులు సమర్ధించారు. మనం ఈ తప్పుడు సంప్రదాయాలను ఆపకపోతే సమాజంలో మార్పు ఎలా వస్తుంది?’అని అన్నారు.
పరంపవీర్ తండ్రి ఈశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. నేను రైతును. ఆచార ప్రకారం ఒక కొబ్బరికాయ, ఒక రూపాయి మాత్రమే తీసుకున్నాను. వరకట్న వ్యవస్థను పూర్తిగా నశింపజేయాలి’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment