నేడు వెంకట దత్తసాయితో బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహం
రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వేడుక
విందులోనూ మేవారీ రుచులు
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ఆదివారం వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. పారిశ్రామికవేత్త వెంకట దత్తసాయిని సింధు పెళ్లాడుతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో ఈ పెళ్లి జరుగు తోంది. ఉదయ్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ ‘రఫల్స్’ను సింధు పెళ్లి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు. రాజసం ఉట్టిప డేలా పెళ్లి వేదికను అలంకరించారు. అతిధులను వేదికకు తీసుకువచ్చే పడవలను కూడా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దారు.
డెకరేషన్ అంతా రాజస్తానీ శైలిలో సంప్రదాయం, రాజసాల మేళవింపుగా ఉందని చెబుతున్నారు. విందులోనూ మేవారీ రుచులతో కూడిన రాజస్తానీ వంటకాలను వడ్డించినట్లు తెలిసింది. వధూవరుల కుటుంబ సభ్యు లు, అత్యంత సన్నిహితుల మధ్య మూడు రోజులపాటు సాగే ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ‘హల్దీ’సంబరాలు నిర్వహించగా, శనివారం ‘మెహందీ, సంగీత్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ‘వరమాల’కార్యక్రమం జరుగుతుంది.
రాత్రి 11.30 గంటల ముహూర్త సమయాన సంప్రదాయ రీతిలో పెళ్లి తంతును నిర్వహిస్తామని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. తమ వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలు వురు ప్రముఖులను సింధు కుటుంబం ఆహ్వానించింది. అయితే పెళ్లికి పరిమిత సంఖ్యలో ఆత్మీ యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.
మంగళవారం నాడు హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడ ల్లో రెండు పతకాలు, వరల్డ్ చాంపియన్‌షిప్ సహా పలు అగ్రశ్రేణి టోర్నీల్లో విజేతగా నిలిచిన సింధు.. భారత బ్యాడ్మింటన్‌లో అతి పెద్ద స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
చాలా కాలంగా స్నేహం..
సింధు, దత్తసాయి కుటుంబాల మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. ఇటీవలే వీరి పెళ్లిని ఇరు కుటుంబాలు ఖాయం చేశాయి. హైదరా బాద్‌కు చెందిన డేటా మేనేజ్‌మెంట్ సొల్యూ షన్ సంస్థ ‘పొసి డెక్స్ టెక్నాలజీస్’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దత్తసాయి పని చేస్తున్నారు.
ఆయన తండ్రి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ ఎస్)లో ఉన్నతాధికారిగా పని చేసి రిటైర్ అయిన జీటీ వెంకటేశ్వర రావు.. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. పొసిడెక్స్ టెక్నాలజీస్ ఇటీవలి వరకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ‘ధరణి’పోర్టల్‌ను నిర్వహించింది. డేటా సైన్స్‌లో మాస్టర్స్ చేసిన దత్తసాయి స్వయంగా క్రీడాభిమాని.
జేఎస్ డబ్ల్యూ సంస్థలో పని చేసినప్పుడు ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన ఆపరే షన్స్‌ను దత్తసాయి పర్యవేక్షించాడు. జనవరి నుంచి సింధు వరుసగా వేర్వేరు టోర్నమెంట్‌లలో పాల్గొనే అవకాశం ఉండటంతో డిసెంబర్‌లోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment