Dowry System
-
దారుణం: కట్నం డిమాండ్.. డాక్టర్ ఆత్మహత్య
తిరువనంతపురం: కేరళలో దారుణం జరిగింది. కట్నం కారణంతో వరుడు పెళ్లి క్యాన్సిల్ చేశాడని ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న షహానా మంగళవారం ఉదయం ఇన్స్టిట్యూట్ సమీపంలోని అద్దె అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. పీజీ డాక్టర్ అయిన తన స్నేహితుడు పెళ్లి ప్రస్తావన నుంచి విరమించుకోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపించారు. షహానా(26) తిరువనంతపురంలో డాక్టర్ పీజీ కోర్సు చదువుతోంది. ఈ క్రమంలో తన స్నేహితుడితో పెళ్లి సంబంధం కూడా ఏర్పడింది. కానీ పెళ్లి కొడుకు తరుపువారు భారీ స్థాయిలో కట్నం అడిగారు. కానీ షహానా అంత మొత్తంలో కట్నం చెల్లించుకోలేకపోయింది. దీంతో పెళ్లి సంబంధాన్ని వరుడు విరమించుకున్నాడు. ఆ తర్వాత షహానా తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది. షహానా కుటుంబాన్ని పరామర్శించిన కేరళ మహిళా కమిషన్ చైర్పర్సన్ అడ్వకేట్ సతీదేవి.. ఈ అంశంపై సరైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ పోలీసుల నుంచి నివేదిక కోరనుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ను మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ అన్ని బాధ్యతల నుంచి తొలగించింది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో మహిళా పీజీ డాక్టర్ ఆత్మహత్యపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్.. మహిళా శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు. వరకట్నం డిమాండ్ల కారణంగానే డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదీ చదవండి: దేశాన్ని విడదీసే కుట్రలు సాగనివ్వం -
వామ్మో..! అల్లుళ్లకు కట్నంగా 21 పాములు..
రాయ్‌పుర్: ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే వధువు తల్లిదండ్రులు తోచినంత కట్నం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా మనం చూసినంతవరకు కట్నంగా డబ్బులు, బంగారం, భూములు వంటి ఆస్తులను వరునికి కానుకగా ఇస్తుంటారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ఓ తెగ ప్రజలు చాలా వింత ఆచారం ఇప్పటికీ పాటిస్తున్నారు. కట్నంగా వారు పాములను వరునికి కట్నంగా ఇస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో కన్వారా తెగ ప్రజలు వింతైన ఆచారం పాటిస్తున్నారు. ఆడపిల్లకు పెళ్లి చేసేప్పుడు వరునికి పాములను కట్నంగా ఇస్తారు. కనీసం తొమ్మిది రకాలకు చెందిన 21 పాములను కట్నంగా ఇచ్చేస్తారు. కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లలను ఎవరూ వివాహం చేసుకోరు. తమ పూర్వికులు కనీసం 60 పాములను కట్నంగా ఇచ్చేవారని ప్రస్తుతం ఆ సంఖ్య క్రమంగా తగ్గినట్లు ఆ తెగకు చెందిన ఓ సభ్యుడు కటంగీ తెలిపారు. పాములను కట్నంగా ఇవ్వండం తమ ఆచారంగా వస్తోందని వెల్లడించారు. కన్వారా తెగ ప్రజలు తమ పూర్వికుల నుంచి కూడా పాములను ఆడిటడం జీవనాధారంగా చేసుకున్నారు. వివిధ రకాల పాములను పట్టుకుని వాటిని ఆడిస్తూ వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తారు. పాములనే తమ ఆస్తిగా భావిస్తారు. అందుకే ఆడపిల్లకు కట్నంగా పాములనే ఇస్తుంటారు. విషరహిత పాములనే పట్టుకుని జీవనం సాగించాలని అటవీ అధికారులు తెగ ప్రజలకు సూచించారు. స్థానిక సంప్రదాయాలను గౌరవించి ప్రభుత్వం కూడా అనుమతులు ఇస్తోందని అటవీ రేంజి అధికారి సియారామ్ కర్మాకర్ తెలిపారు. ఇదీ చదవండి: ఇలాంటి వారితో జాగ్రత్త.. బైక్ బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం -
12 పెళ్లిచూపులు..కట్నం ఇవ్వనందుకు సంబంధం క్యాన్సిల్
ఎంఎస్సీ మాథ్స్ చేసి ఆన్లైన్లో లెక్కలు చెప్పే భోపాల్ యువతికి పెళ్లి కావడం లేదు. కట్నం ఇవ్వను అనడమే కారణం. ‘50 లక్షలు అడుగుతున్నారు మా నాన్న ఎక్కడ నుంచి తెస్తాడు’ అని ఆమె ప్రశ్న. ‘సంబంధం కేన్సిల్’ అనేది తరచూ వినవస్తున్న జవాబు. ఇప్పటికి 12 పెళ్లి చూపులు భగ్నమయ్యాయి. విసిగిపోయిన ఆమె పోరాటానికి దిగింది. పోలీసులకు కంప్లయింట్ చేసింది. అన్ని చోట్లా చైతన్యానికి నడుం బిగించింది. ‘ఇది రొటీన్‌గా జరుగుతోంది. ఎప్పట్లాగే నేను ట్రేలో టీకప్పులు పెట్టుకుని వస్తాను. దానికి ముందు మా అమ్మ నాకు బాగుంటుందని చెప్పి ఆకుపచ్చ డ్రస్సు తీస్తుంది. నా పళ్లు కొంచెం ఎగుడుదిగుడుగా ఉంటాయని ఎక్కువగా నవ్వొద్దని హెచ్చరిస్తుంది. టీ ట్రేతో నేను హాల్లోకి రాగానే అందరూ నన్ను ఆపాదమస్తకం శల్యపరీక్ష చేస్తున్నట్టుగా చూస్తారు. ఏం చదివావు, ఏం పని చేస్తున్నావు, వంటొచ్చా... అవే ప్రశ్నలు. ఆ తర్వాత కీలకమైన సందర్భం వస్తుంది. కట్నం ఎంత ఆశిస్తున్నారు అని మా నాన్న అడుగుతాడు. అప్పుడు పెళ్లికొడుకు తరుఫువారు ఏ యాభైలక్షలో అరవైలక్షలో లేకుంటే పెళ్ళిళ్లు జరుగుతున్నాయా అనంటారు. కొంచెం ఆలోచించండి అని మా నాన్న అంటాడు. మీ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి డిస్కౌంట్ ఇవ్వొచ్చులేండి అని వారు జోక్ చేస్తారు. నాకు మాత్రం ఇదంతా చాలా అసహ్యంగా ఉంటుంది’ అంటుంది రూప. ఇది ఆమె అసలు పేరు కాదు. ఇలాంటి అమ్మాయిలు దేశమంతా ఉన్నారు. వారికి వేరే వేరే పేర్లు ఉంటాయి. కాని వారందరి సమస్య మాత్రం ఒకటే– కట్నం. నేషనల్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం మన దేశంలో 2017 నుంచి 2022 వరకు 35,493 మంది నవ వధువులు, కొత్త పెళ్లి కూతుళ్లు వరకట్న చావులకు గురయ్యారు. అంటే రోజుకు సగటున 20 మంది. అయినా కట్నం కొనసాగుతూనే ఉంది. పేరు మారిందంతే మన దేశంలో వరకట్నం 1961లో నిషేధించారు. కాని అలాంటి చట్టం ఒకటుందని సమాజం ఆనాడు పట్టించుకోలేదు.. ఈనాడూ పట్టించుకోవడం లేదు. 1980ల కాలంలో వరకట్న పిశాచం దేశాన్ని పీడించింది. ఎందరో కొత్తకోడళ్లు కిరోసిన్ స్టవ్ మంటల్లో కాలిపోయారు. ఆ తర్వాత కొంత చైతన్యం వచ్చింది. అమ్మాయిలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్నివర్గాల ఆర్థిక స్థితి మెరుగయ్యింది. కట్నం అనే మాట వాడటం నామోషీగా మారింది. దానికి బదులుగా లాంఛనాలు అంటున్నారు. ఫార్మాలిటీస్ అంటున్నారు. ఏ మాట వాడినా ఉద్దేశం మాత్రం ఆడపిల్ల తరఫువారు మగపెళ్లి తరఫు వారికి ఆర్థికంగానో ఆస్తిపాస్తుల రూపేణానో ముట్టజెప్పాలి. అంతస్తును బట్టి ఈ లాంఛనాల స్థాయి ఉంటుంది. లక్షల నుంచి కోట్ల వరకు. కట్నం ఇవ్వను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి, భోపాల్‌లో తన కాళ్ల మీద తాను నిలబడే స్థితిలో ఉన్న రూపకు 27 ఏళ్లు వచ్చేశాయి. ఈమె తల్లిదండ్రులు ఐదారేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నారు. కాని కట్నం కారణంగా కుదరడం లేదు. ‘మా నాన్న నూటాయాభై మంది కుర్రాళ్ల ప్రొఫైల్స్ చూసి 20 మందిని సెలక్ట్ చేశాడు. వారిలో 12 మందితో పెళ్లిచూపులు అయ్యాయి. అందరూ కట్నం అడిగేవాళ్లే. ఎవరూ 50 లక్షలకు తక్కువ లేరు. మా నాన్న అంత ఖర్చు పెట్టలేడు. అసలు కట్నం ఎందుకివ్వాలి? నేను కట్నం ఇవ్వను... కట్నం అనేది చాలా చెడ్డ ఆచారం. పెళ్లి ఖర్చులు పెట్టుకుంటాను అని ఏ అబ్బాయికి చెప్పినా నా ముందు తలాడిస్తున్నాడు కాని ఆ తర్వాత సంబంధం కేన్సిల్ అనే కబురు వస్తోంది. నా ఆత్మవిశ్వాసం మొత్తం పోయింది. మరోవైపు మా బంధువులేమో అమ్మాయి ఇప్పటికే ముదిరిపోయింది అని టెన్షన్ పెడుతున్నారు. పెళ్లి చేసుకోవాలని నాకూ ఉంది. ఒంటరిగా జీవితాన్ని లాగలేము కదా. కాని ఈ కట్నం బాధ ఏమిటి? ఎంతమంది అప్పులు చేసి, ఆస్తులు అమ్మి ఇంకా ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలి?’ అని ప్రశ్నిస్తోంది రూప. పోలీసులు పూనుకోవాలి కట్నం తీసుకోవడం శిక్షార్హం కాబట్టి పోలీసులు పూనుకొని ఈ దురాచారాన్ని నిలువరించాలని, ప్రతి పెళ్లి జరిగే మంటపాల్లో చెకింగులు చేయాలని, కట్నం తీసుకుంటున్న కొంతమందికైనా శిక్ష పడితే కట్నం డిమాండ్ తగ్గుతుందని అంటుంది రూప. ఈమేరకు ఆమె భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్‌ను వినతిపత్రం ఇచ్చింది. వరకట్న దురాచారం వల్ల వస్తున్న ఆర్థిక బాధల గురించి చైతన్యం రావాలని మీడియాను సంప్రదించింది రూప. ‘నేను కట్నం వద్దంటున్నానని మా అమ్మ నాతో మాట్లాడటం లేదు. కట్నం వద్దంటే జన్మలో నీ పెళ్లి చేయలేనని మా నాన్న టెన్షన్ పడుతున్నాడు. నేటి కాలంలో కట్నం ఉంటే తప్ప పెళ్లి కాని స్థితిలో ఒక యువతి ఉండటం ఎంత విషాదమో ఈ సమాజం ఆలోచించాలి’ అంటోంది రూప. ఈ స్థితికి తాము ఎంత కారణమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ పరిస్థితిలో మార్పుకోసం ప్రయత్నించాలి. -
అంతా అవాక్కయ్యారు.. సోదరి పెళ్లికి రూ.8 కోట్ల విలువైన బహుమతులు!
జైపూర్: రాజస్థాన్‌లోని నాగౌర్‌లోని ఖిమ్సర్ తాలూకాలోని ధిగ్‌సార గ్రామానికి చెందిన నలుగురు సోదరులు తమ సోదరి పెళ్లిలో కోట్లు విలువైన సంపదను కానుకగా ఇచ్చి తమ ప్రేమను చాటుకున్నారు. వివాహ వేడుకలో విలువైన బహుమతులును ఇవ్వడం అక్కడి సంప్రదాయమట. భగీరథ్ మెహ్రియా, అర్జున్ మెహ్రియా, ప్రహ్లాద్ మెహ్రియా, ఉమ్మద్ జీ మెహ్రియా తమ సోదరి భన్వారీకి ఏకంగా 8.1 కోట్లు ఇచ్చారు. ఆ ప్రాంత స్థానికులు గతంలో ఇద్దరు సోదరులు తమ సోదరికి డాలర్లతో అలంకరించిన తోహ్నీ, కోటి విలువైన కానుకను ఇచ్చారు. బుర్డి గ్రామానికి చెందిన భన్వర్‌లాల్ చౌదరి 3 కోట్ల 21 లక్షలు గిఫ్ట్ ఇవ్వగా.. తాజాగా ఈ నలుగురు సోదరులు ఈ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. ప్రస్తుతం భగీరథ్ మెహ్రియా కుటుంబం రూ. 8.1 కోట్ల సంపదను కానుకగా ఇచ్చింది. ఇందులో.. 2 కోట్ల 21 లక్షల నగదు, 71 లక్షల విలువైన 1 కిలోల 105 గ్రాముల బంగారం, 9 లక్షల 80 వేల విలువైన 14 కిలోల వెండి, 2 కిలోల వెండి సోదరికి అందించగా మిగిలిన 800 నాణేలను గ్రామం మొత్తానికి పంపిణీ చేశారు. వందల సంఖ్యలో కార్లు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు, ఎద్దుల బండ్లతో ర్యాలీగా కానుకలను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మైరా సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డ పెళ్లికి అన్నదమ్ములు ఇలా భారీ స్థాయిలో కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందట. -
ఎర్ర చందనమే వారికి వరకట్నం
భాకరాపేట (తిరుపతి జిల్లా): చైనాలోని కుటుంబ వ్యవస్థల్లో ఎర్ర చందనానికి ఉండే విలువ అంతాఇంతా కాదు. ఎర్ర చందనంతో చేసిన వస్తువులను వరకట్నంగా ఇవ్వడాన్ని అక్కడి వారు చాలా గొప్పగా, గర్వంగా ఫీలవుతుంటారు. ఎర్ర చందనాన్ని గౌరవాన్ని పెంచే చిహ్నంగా భావిస్తారు. ఎర్ర చందనంతో చేసిన పూసలను బౌద్ధ భిక్షువులు మెడలో ధరిస్తారు. అక్కడ ఒక కేజీ ఎర్ర చందనం దుంగ నుంచి కీ చైన్లు, పూసలు తయారుచేసి అమ్మితే సుమారు రూ.25 వేలు వస్తుంది. టన్ను ఎర్ర చందనం ధర అక్కడ రూ.2.50 కోట్లు పలుకుతోంది కాబట్టే విదేశాలకు అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది. అదృష్టం తెస్తుందని.. ఎర్ర చందనాన్ని చైనా, మలేషియా, జపాన్, సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ దేశాలకు ఎక్కువగా తరలిస్తారు. బౌద్ధులు దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఎర్ర చందనం ముక్క ఉంటే.. అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. బొమ్మలు, ఇంటి వస్తువులు, సంగీత వాయిద్యాలు, దేవుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, గడియారాలు, టీ కప్పులు తదితర వస్తువుల తయారీకి దీనిని ఉపయోగిస్తున్నారు. ముఖ సౌందర్యం కోసం క్రీమ్‌లు, పౌడర్‌గానూ వాడుతున్నారు. ఆయుర్వేద గుణాలు ఎక్కువగా ఉండడంతో ఔషధాల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఎర్ర చందనంతో చేసిన గ్లాసుల్లో నీటిని ఉంచి తాగితే బీపీ, షుగర్ వ్యాధులు తగ్గుముఖం పడతాయని నమ్ముతారు. మన దేశంలో తప్ప ఎక్కడా దొరకదు మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఎర్ర చందనం దొరకదు. మన దేశంలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలోనే ఎర్ర చందనం ఉంది. దాదాపు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే ఎర్ర చందనానికి ఉన్న గిరాకీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ పెరిగినా లేదు. ఎర్ర చందనం, శ్రీగంధం వేర్వేరు ఎర్ర చందనం, శ్రీ గంధం వృక్షాలు రెండూ సుగంధ ద్రవ్య వృక్షాలే అయినా వృక్ష శాస్త్రపరంగా రెండూ ఒకే జాతికి చెందినవి కావు. ఎర్ర చందనానికి వాసన కన్నా రంగు ఎక్కువ. దీనిని వృక్ష శాస్త్రంలో టెర్రోకార్పస్ శాంటాలీనస్ అంటారు. ఎర్ర చందనం మధ్య భాగం చాలా ధర పలుకుతుంది. ఘనపుటడుగు దాదాపు రూ.లక్షల్లో ఉంటుంది. చాలా దృఢంగాను, ముదురు ఎరుపు రంగులో ఉండటం వల్ల ఈ కలపను ఖరీదైన నిర్మాణాల్లోను, చైనా ఇతర దేశాలు వారు తినడానికి వాడే పుల్లల తయారీలోనూ, ఎర్రని పౌడర్ తయారీలోను ఎర్రచందనాన్ని వాడుతున్నారు. శ్రీగంధం చెట్టును శాస్త్రీయంగా శాంటాలమ్ పేనిక్యూలాటమ్ అంటారు. ఇవి ఎర్రచందనం లాగా దృఢంగా ఉండవు. గరుకుగా ఉన్న బండపై నీరు పోసి రాస్తే పసుపు రంగులో ఉన్న లేపనం లభిస్తుంది. ఈ చెట్టు నుంచి తీసిన నూనె సుగంధ ద్రవ్యాలు, సబ్బుల తయారీలోనూ వాడుతారు. – ప్రభాకర్‌రెడ్డి, ఫారెస్ట్ రేంజర్ -
ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్..
లక్నో: తాను అడిగిన ఫార్చునర్ కారును కట్నంగా ఇవ్వలేదని పెళ్లినే రద్దు చేసుకున్నాడు ఓ ప్రభుత్వ కళాశాల లెక్చరర్. ఈ వివాహం తనకు వద్దని పెళ్లికుతూరుకు మెసేజ్ చేసి చెప్పాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. పెళ్లికొడుకుపై కేసు పెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ ఘాజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. పెళ్లికొడుకు పేరు సిద్ధార్థ్ విహార్. ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. అయితే తనకు కట్నంగా ఫార్చునర్ కారు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం వాగన్ఆర్ కారును బుక్ చేశారు. ఈ విషయం తెలిసిన పెళ్లికొడుకు కుటుంబసభ్యులు తమకు ఫార్చునర్ కారే కావాలని పట్టుబట్టారు. కానీ పెళ్లికూతురు కుటుంబం మాత్రం వాగన్ఆర్ మాత్రమే ఇప్పిస్తామని చెప్పింది. దీంతో ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వధువుకు మేసేజ్ ద్వారా తెలియజేశాడు వరుడు. మరో ఘటనలో పెళ్లికొడుకు నచ్చలేదని.. అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్ ఇటావాలో కూడా ఓ పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. పెళ్లిమండపంలో దండలు మార్చుకున్న తర్వాత ఓ పెళ్లికూతురు అనూహ్యంగా పెళ్లి రద్దు చేసుకుంది. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పెళ్లి చూపుల్లో తాను చూసిన అబ్బాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న అబ్బాయి వేరని వధువు చెప్పింది. ఈ అబ్బాయి నల్లగా ఉన్నాడని, తనకు నచ్చలేదని పేర్కొంది. ఇక చేసేదేమీ లేక పెళ్లికొడుకు కుటుంబం కూడా పెళ్లిని రద్దు చేసుకునేందుకు అంగీకరించింది. అయితే తాము పెళ్లికూతురుకు పెట్టిన నగలు తిరిగి ఇవ్వలేదని వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి ఏర్పాట్లకు రూ.లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు. చదవండి: స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు -
భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్
సాక్షి, బంజారాహిల్స్: అదనపు కట్నం కోసం వేధించి భార్య ఆత్మహత్యకు కారకుడైన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లవరం గ్రామానికి చెందిన భవానీ వివాహం నెల్లారి సురేష్‌తో 2019లో జరిగింది. పెళ్ళి జరిగిన కొద్ది రోజుల నుంచే సురేష్ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. వీరికి మూడేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. వీరు వెంకటగిరి సమీపంలోని భగవతి నగర్లో అద్దెకుంటున్నారు. వివాహ సమయంలో మూడు లక్షల కట్నం, రూ.5 లక్షలు విలువ చేసే బంగారం, రెండెకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అయితే ఉద్యోగం పోగొట్టుకొని పలు వ్యాపారాలు పెట్టి తీవ్రంగా నష్టపోయిన సురేష్ కట్నం కింద ఇచి్చన రెండెకరాల స్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలంటూ కొంత కాలంగా వేధించసాగాడు. అప్పటికే బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టారు. రూ. 8 లక్షల వరకు అప్పు చేసి ఇచ్చారు. అయినాసరే నిందితుడి వేధింపులు రోజురోజుకు శృతి మించడంతో గత నెల 30వ తేదీన భవానీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఏలూరి ఝాన్సీ అల్లుడితో పాటు అత్తమామలపై చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సురేష్‌పై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నిజామాబాద్‌లో కేటుగాడు!.. 250 మందిని షార్జాకి తీసుకెళ్లి.. పత్తా లేకుండా పోయి..) -
Viral: కట్నంగా రూపాయి చాలు.. 11 లక్షలు, బంగారు ఆభరణాలు వెనక్కి
ముజఫర్‌నగర్: కట్నంగా ముట్టజెప్పిన రూ.11 లక్షలు, బంగారు ఆభరణాలను వద్దంటూ వెనక్కిచ్చి ఆదర్శంగా నిలిచాడో యువకుడు. కేవలం రూ.1 కట్నం తీసుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో రెవెన్యూ అధికారిగా పనిచేసే సౌరభ్ చౌహాన్‌కు లఖాన్ గ్రామం ఓ మాజీ జవాను కూతురుతో శుక్రవారం పెళ్లయింది. వరకట్నం కింద వధువు తల్లిదండ్రులు రూ.11 లక్షల కట్నం, ఆభరణాలు ఇవ్వగా కట్నం అక్కర్లేదంటూ తిరిగిచ్చేశాడు. ‘‘మీ దీవెనగా జ్ఞాపకం పెట్టుకుంటా’నంటూ వారినుంచి కేవలం ఒక్క రూపాయి తీసుకున్నాడు. దాంతో ఆహూ తులు సౌరభ్‌పై అక్షింతలతోపాటు ప్రశంస జల్లులు కూడా కురిపించారు. సమాజంలో మంచి మార్పు కోసం ముందడుగు వేశాడంటూ మెచ్చుకున్నారు. -
బిజినెస్ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో నవంబర్ 20న ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో అతి కొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఆదివారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నాగశౌర్య భార్య అనూష శెట్టి ఒక బిజినెస్ విమెన్ అనే విషయం తెలిసిందే. సొంతంగా ఆమె ఇంటీరియర్ డిజైన్ కంపెనీ రన్ చేస్తోంది. బిజినెస్ విమెన్‌గా అనూష అవార్డును సైతం అందుకుంది. ఇదిలా ఉంటే నాగశౌర్య చేసుకున్న అనూష ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటని అంత ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి సంబంధంలేని అమ్మాయిని చేసుకున్న నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడనేది కూడా ఆసక్తిని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నాగశౌర్య తీసుకున్న కట్నం, అనూష శెట్టి ఆస్తుల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. నాగశౌర్యకు భారీగా కట్నకానుకలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అనూష తండ్రి బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త అని, ఆయనకు అక్కడ పలు వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. బిజినెస్‌లో ఆయన బాగానే సంపాదించినట్లు సమాచారం. అంతేకాదు అనూష కూడా తన తండ్రికి సంబంధించిన వ్యాపారాల్లో చురుగ్గా ఉంటుందట. మరోవైపు సొంతంగా పెట్టుకున్న ఇంటిరియర్ బిజినెస్ కూడా కోట్లలో టర్నోవర్ ఉంటుందని వినికిడి. అయితే వివాహం సందర్భంగా నాగశౌర్య నగదు రూపంలో ఎలాంటి కట్నం ఇవ్వలేదని తెలుస్తోంది. కానీ అనూష శెట్టి పేరు మీద ఉన్న ఆస్తులను నాగశౌర్య పేరు మీదకు మార్చనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అనూష పేరు మీద దాదాపు రూ. 50 నుంచి 80 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయని, అందులో కొన్ని నాగశౌర్య పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. దీనిపై నాగశౌర్య, అతని కుటుంబ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే నాగశౌర్య, అతని కుటుంబ సభ్యుల స్పందించేవరకు వేచి చూడాల్సిందే. ఇక నాగశౌర్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతానికి అతని చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: షారుక్ ఇంటికి డైమండ్ నేమ్ ప్లేట్, మెరిసిపోతున్న మన్నత్ జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? -
అమ్మాయినివ్వండి.. పెళ్లి మాదే, ఖర్చులూ మావే..
శంకర్పల్లి ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ యువకుడు శ్రీనివాసశర్మ (పేరుమార్చాం). తరతరాలుగా కుటుంబం నిర్వహిస్తున్న వైదిక వృత్తిలో కొనసాగుతున్నాడు. ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ స్థానిక దేవాలయంలో అర్చకుడిగా కొనసాగుతున్నాడు. శంకర్పల్లి ప్రాంతంలో రూ.కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులన్నాయి. కానీ 30 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదు. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా ఎక్కడా ముడి పడలేదు. దీంతో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ బ్రాహ్మణ కుటుంబంలోని అమ్మాయికి రూ.4 లక్షల ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం విశేషం. తాండూరు పట్టణంలోని గంజ్ ప్రాంతానికి చెందిన నగేష్ (పేరు మార్చాం) 25 ఏళ్లు దాటిన యువకుడు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన ఇతను వ్యాపారంలో స్థిరపడ్డాడు. వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఐదేళ్లుగా సంబంధాలు చూస్తున్నారు. పదుల సంఖ్యలో పెళ్లి చూపులకు హాజరయ్యాడు. అబ్బాయి నచ్చితే అమ్మాయి నచ్చలేదు.. అమ్మాయి నచ్చిన చోట అబ్బాయికి నచ్చలేదు. ఇలా రెండేళ్ల కాలం కరిగిపోయింది. నెల రోజుల క్రితం సమీప బంధువులు ఓ సంబంధం తీసుకొచ్చారు. అమ్మాయి తరఫు వారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసింది. పిల్ల నచ్చడంతో వెంటనే రూ.2 లక్షల ఎదురు కట్నం ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. వారం రోజుల క్రితం తాండూరులో ఈ జంట ఒక్కటైంది. రంగారెడ్డి (తాండూరు) : పెళ్లి కూతురు తల్లిదండ్రులు.. వరుడికి కట్నం ఇవ్వాలనే సంప్రదాయానికి రానున్న రోజు ల్లో అడ్డుకట్ట పడనుందా..? ఇటీవల జరుగుతున్న పలు వివాహాలు ఈ వాదనలకు బలంచేకూరుస్తు న్నాయి. దశాబ్దాల క్రితం ‘కన్యాశుల్కం’ పేరుతో వధువుకు ఎదురు కట్నం ఇచ్చి వివాహాలు చేసుకునే వారు. వయసు మీరిన వరుడి తరఫు వారు.. అమ్మాయి కుటుంబ సభ్యులకు డబ్బు ఆశ చూపి ఇలా చేసేవారు. ఆర్థిక స్థితి అంతగా లేని వధువుల కుటుంబాలు అప్పట్లో ఈతంతుకు అంగీకరించేవి. ప్రస్తుతం 25 ఏళ్లు నిండని యువకులు సైతం ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్న సంద ర్భాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల జరిగిన వివాహాల్లో.. పదుల సంఖ్యలో ఎదురు కట్నం ఇచ్చి చేసుకున్నవే కావడం గమనార్హం. పెళ్లి ఖర్చులు సైతం.. వధువు కోసం వెతికివెతికి వేసారిపోతున్న అబ్బాయిల తల్లిదండ్రులు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. అమ్మాయి నచ్చితే ఎదురు కట్నం ఇచ్చి, పెళ్లి ఖర్చులు సైతం భరిస్తున్నారు. తాండూరులో ఓ సామాజిక వర్గానికి చెందిన యువకుడి వివాహం కోసం రూ.2 లక్షలు, వధువుకు 10 తులాల బంగారం ఎదురు కట్నంగా ఇచ్చారు. ఇక్కడ ఇలాంటి పెళ్లిళ్లు సాధారణంగా మారాయి. గిరిజనుల్లో ఓలీ గిరిజన సంప్రదాయంలో ఇంటి ఎదుట ఉన్న ఎద్దు ధర ఎంత పలుకుతుందో.. అంత డబ్బు అమ్మాయికి కట్నంగా ఇచ్చే సంప్రదాయం గతంలో ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా తండాల్లోని యువకులు విద్యావంతులు కావడంతో ఉద్యోగాలు సాధించారు. దీంతో తమ బిడ్డను ఉద్యోగస్తుడికి ఇవ్వాలనే ఆరాటం, పోటీతత్వంతో కట్నం (డౌరీ) సంప్రదాయం వచ్చింది. అయినప్పటికీ గిరిజన సంప్రదాయం ప్రకారం అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే మొదట వధువు కట్నం (ఓలీ) ఇవ్వాల్సిందే. ప్రస్తుతం ఓలీ పేరిట అమ్మాయికి రూ.1.05 లక్షల వరకు ఇస్తున్నారు. ఆ తర్వాత వధువు తరఫు వారు తిరిగి వరకట్నం ఇవ్వడం ఆనవాయితీగా మారిందని గిరిజన నాయకులు చెబుతున్నారు. అమ్మాయిల సంఖ్య తక్కువ ఈ వేసవి సీజన్లో జరిగిన పలు పెళ్లిళ్లలో వధువుకు ఎదురు కట్నం ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బ్రాహ్మణ, ఆర్యవైశ్య, మార్వాడీ, రెడ్డి సామాజిక వర్గాల కుటుంబాల్లో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. బ్రాహ్మణ కుటుంబాల్లో వివాహ వయసు దాటిపోయినా పెళ్లికాని యువకులు అనేక మంది కనిపిస్తున్నారు. ఆలయాల్లో అర్చకత్వం చేసే వారికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు వధువు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. సాఫ్ట్వేర్, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే తప్ప పిల్లనిచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఆస్తిపాస్తులు దండిగా ఉన్నా ఆసక్తి చూపడం లేదు. ఆర్యవైశ్యుల్లో కిరాణ వ్యాపారం చేసుకొనే యువకులకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఉద్యోగం ఉన్న యువకులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లిళ్లు కుదరడం లేదు పలు సామాజికవర్గాల్లో పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. ప్రధానంగా బ్రాహ్మ ణ, ఆర్యవైశ్య, మార్వాడీ కుటుంబాల్లో అమ్మాయిల కొరత కనిపిస్తోంది. దీంతో యువకులకు 35 ఏళ్లు దాటినా సంబంధాలు కుదరడం లేదు. అబ్బాయి పెళ్లి వయసు దాటిపోతోందనే కారణంతో ఎదురు కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. ఈ సీజన్లో ఇలాంటి వివాహాలు పదుల సంఖ్యలో జరిగాయి. – రాఘవేంద్రాచారి, బ్రాహ్మణ సంఘం ప్రతినిధి, బషీరాబాద్ -
హీరో ఆది పినిశెట్టి ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా?
యువ కథానాయకుడు ఆది పినిశెట్టి ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే! మే 18న తాను ప్రేమించిన హీరోయిన్ నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు. రెండు రోజుల క్రితమే ఆది దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇదిలా ఉంటే ఆది ఎంత కట్నం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎంత లవ్ మ్యారేజ్ అయితే మాత్రం కట్నం తీసుకోకుండా ఎందుకుంటాడు? భారీగానే అందుకుని ఉంటాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లను ఆయన సన్నిహితులు తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఆది కట్నకానులకు బద్ధ వ్యతిరేకి అని, పెళ్లికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారట. ఆది ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిక్కీ కుటుంబం రెడీగా ఉన్నా అతడు మాత్రం పైసా కూడా వద్దని సున్నితింగా తిరస్కరించాడట. ఆది మంచి మనసుకు అతడి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా ఆది, నిక్కీలది ప్రేమ వివాహం. 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇరు కుటుంబాలను ఒప్పించిన వీరు మే 18న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం 'వారియర్' మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) చదవండి 👇 నేనూ సాయిపల్లవి ఫ్యానే, జూన్ 5న రెడీగా ఉండండి: రానా మేజర్ గుండెల్ని పిండేసే సినిమా: అల్లు అర్జున్ -
అలా రాసిస్తేనే పెళ్లిళ్లకు వస్తానని చెప్పా: సీఎం
పట్నా: వర కట్నానికి వ్యతిరేకంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కట్నం తీసుకోలేదని వరుడి తరపు వారు చెబితేనే తాను పెళ్లికి హాజరవుతానని ఆయన అన్నారు. పట్నాలో కొత్తగా నిర్మించిన బాలికల హాస్టల్‌ను ఈనెల 23న ప్రారంభించిన సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. పెళ్లికొడుకు కట్నం తీసుకోలేదని రాతపూర్వకంగా తెలిపితేనే పెళ్లికి హాజరవుతానని అందరికీ చెప్పినట్టు వెల్లడించారు. పెళ్లి చేసుకోవడానికి కట్నం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘పెళ్లి కోసం కట్నం తీసుకోవడం దారుణం. మీరు పెళ్లి చేసుకుంటే మీకు పిల్లలు పుడతారు. ఇక్కడ ఉన్న మనమంతా తల్లులకు పుట్టాము. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారా?’ అంటూ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. (క్లిక్: 54% మహిళలకే సొంత సెల్‌ఫోన్) ప్రచార కార్యక్రమాలతో వరకట్నం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అబ్బాయిలతో సమానంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో అమ్మాయిలు కూడా రాణిస్తున్నారని తెలిపారు. మహిళల డిమాండ్ మేరకే తమ ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించిందని నితీశ్ కుమార్ అన్నారు. (క్లిక్: కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ రాజీనామా)