సాక్షి, బంజారాహిల్స్: అదనపు కట్నం కోసం వేధించి భార్య ఆత్మహత్యకు కారకుడైన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లవరం గ్రామానికి చెందిన భవానీ వివాహం నెల్లారి సురేష్‌తో 2019లో జరిగింది. పెళ్ళి జరిగిన కొద్ది రోజుల నుంచే సురేష్ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. వీరికి మూడేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. వీరు వెంకటగిరి సమీపంలోని భగవతి నగర్‌లో అద్దెకుంటున్నారు.
వివాహ సమయంలో మూడు లక్షల కట్నం, రూ.5 లక్షలు విలువ చేసే బంగారం, రెండెకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అయితే ఉద్యోగం పోగొట్టుకొని పలు వ్యాపారాలు పెట్టి తీవ్రంగా నష్టపోయిన సురేష్ కట్నం కింద ఇచి్చన రెండెకరాల స్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలంటూ కొంత కాలంగా వేధించసాగాడు. అప్పటికే బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టారు. రూ. 8 లక్షల వరకు అప్పు చేసి ఇచ్చారు.
అయినాసరే నిందితుడి వేధింపులు రోజురోజుకు శృతి మించడంతో గత నెల 30వ తేదీన భవానీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఏలూరి ఝాన్సీ అల్లుడితో పాటు అత్తమామలపై చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సురేష్‌పై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: నిజామాబాద్‌లో కేటుగాడు!.. 250 మందిని షార్జాకి తీసుకెళ్లి.. పత్తా లేకుండా పోయి..)
Comments
Please login to add a commentAdd a comment