టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో నవంబర్ 20న ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్‌లో అతి కొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఆదివారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నాగశౌర్య భార్య అనూష శెట్టి ఒక బిజినెస్ విమెన్ అనే విషయం తెలిసిందే. సొంతంగా ఆమె ఇంటీరియర్ డిజైన్ కంపెనీ రన్ చేస్తోంది.
బిజినెస్ విమెన్‌గా అనూష అవార్డును సైతం అందుకుంది. ఇదిలా ఉంటే నాగశౌర్య చేసుకున్న అనూష ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటని అంత ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి సంబంధంలేని అమ్మాయిని చేసుకున్న నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడనేది కూడా ఆసక్తిని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నాగశౌర్య తీసుకున్న కట్నం, అనూష శెట్టి ఆస్తుల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. నాగశౌర్యకు భారీగా కట్నకానుకలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అనూష తండ్రి బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త అని, ఆయనకు అక్కడ పలు వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. బిజినెస్‌లో ఆయన బాగానే సంపాదించినట్లు సమాచారం. అంతేకాదు అనూష కూడా తన తండ్రికి సంబంధించిన వ్యాపారాల్లో చురుగ్గా ఉంటుందట. మరోవైపు సొంతంగా పెట్టుకున్న ఇంటిరియర్ బిజినెస్ కూడా కోట్లలో టర్నోవర్ ఉంటుందని వినికిడి. అయితే వివాహం సందర్భంగా నాగశౌర్య నగదు రూపంలో ఎలాంటి కట్నం ఇవ్వలేదని తెలుస్తోంది. కానీ అనూష శెట్టి పేరు మీద ఉన్న ఆస్తులను నాగశౌర్య పేరు మీదకు మార్చనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
అనూష పేరు మీద దాదాపు రూ. 50 నుంచి 80 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయని, అందులో కొన్ని నాగశౌర్య పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేయన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. దీనిపై నాగశౌర్య, అతని కుటుంబ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే నాగశౌర్య, అతని కుటుంబ సభ్యుల స్పందించేవరకు వేచి చూడాల్సిందే. ఇక నాగశౌర్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతానికి అతని చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి:
షారుక్ ఇంటికి డైమండ్ నేమ్ ప్లేట్, మెరిసిపోతున్న మన్నత్
జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment