తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్య
చెన్నై: నూతన దంప తులు ఎక్కువ మంది పిల్లల్నికనే విష యం ఆలోచించాల ని తమిళనాడు ము ఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొ న్నారు. ‘తమిళ సంప్రదాయంలో పెద్దలు నూతన దంపతులను 16 సంపదలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తుంటారు. కానీ, నేడు పరిస్థితి మారిపోయింది.
2026 నుంచి చేపట్టనున్న జన గణన, లోక్‌సభ నియోజ కవర్గాల పునర్విభజనతో పుణ్యమాని చిన్న కుటుంబానికి బదులు, 16 మంది సంతానంతో కళకళలాడాలని ఆశీర్వదించాల్సిన రోజులొచ్చాయి’అని ఆయన వ్యాఖ్యానించారు.
సోమవారం చెన్నైలో జరిగిన సామూహిక వివాహ వేదిక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దేశంలో ఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోనుందని అన్నారు. ‘లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున, మాకు 16 మంది పిల్లలుండాలా అని ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడొచ్చు. అయితే, ఈ విషయం మనం మర్చిపోకూడదు’ అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment