byfarcation
-
జనగణన... వచ్చే ఏడాదే
న్యూఢిల్లీ: నాలుగేళ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత ఎట్టకేలకు దేశ జనాభా గణన జరగనుంది. ‘‘2025 తొలినాళ్లలో ఈ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. 2026 కల్లా ఇది ముగియనుంది. దాని ఆధారంగా జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)ను సవరిస్తారు. అనంతరం తాజా జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ మొదలయ్యే అవకాశముంది. అదే జరిగితే ఆ ప్రక్రియ 2028 నాటికి పూర్తి కావచ్చు’’ అని అధికార వర్గాలు తెలిపాయి. కులగణన చేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే జనగణనలో భాగంగా కులగణన కూడా ఉంటుందా అన్న కీలక అంశంపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు. జనగణనలో భాగంగా పౌరులను అడిగేందుకు 31 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది. జనగణనలో మత, సామాజిక వర్గీకరణతో పాటు, జనరల్, ఎస్సీ, ఎస్టీ గణనే గాక జనరల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలలోని ఉప విభాగాల సర్వేలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. జనగణనను సరైన సమయంలో చేపడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత ఆగస్టులో చెప్పడం తెలిసిందే. ఈసారి కార్యక్రమం పూర్తిగా మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్‌గా జరుగుతుందని ఆయన వెల్లడించారు.మారిపోనున్న జనగణన సైకిల్: భారత్‌లో తొలి జనగణన 1872లో జరిగింది. స్వాతంత్య్రానంతరం 1951 నుంచి ప్రతి పదేళ్లకు ఓసారి జరుగుతూ వస్తోంది. చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 2021లో జరగాల్సిన జనగణనకు కరోనా కారణంగా అంతరాయం ఏర్పడింది. అప్పటినుంచీ పెండింగ్‌లోనే ఉంది. ఈ ఆలస్యం కారణంగా జనగణన సైకిల్ కూడా మారనుంది. ఇకపై 2025–35, 2035–45... ఇలా కొనసాగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ డిప్యుటేషన్‌ను 2026 ఆగస్టు దాకా కేంద్రం పొడిగించింది. 2011 జనగణనలో భారత్‌లో 121 కోట్ల పై చిలుకు జనాభా ఉన్నట్టు తేలింది. అంతకుముందు పదేళ్లతో పోలిస్తే 17.7 శాతం వృద్ధి రేటు నమోదైంది.కులగణన జరపాల్సిందేనన్న కాంగ్రెస్: కులగణనకు కేంద్రం నిరాకరించడం ఓబీసీ వర్గాలకు ద్రోహం చేయడమేనని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. మోదీ సర్కారు రాజకీయ అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడతాయా, లేదా మౌనంగా ఉంటాయా?’’ అని ఆయన ప్రశ్నించారు.లోక్‌సభ సీట్లు తగ్గుతాయేమో!జనాభా లెక్కల విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ఉత్తరాదితో పోలిస్తే ఆ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందంజలో ఉండటం తెలిసిందే. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా నూతన జనగణన గణాంకాల ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ జరిగే పోంలో తమ లోక్‌సభ స్థానాల్లో బాగా కోత పడే ఆస్కారముండటం వాటిని కలవరపెడుతోంది. ఇది రాజకీయంగా తమ ఆధిపత్యాన్ని బాగా తగ్గిస్తుందని ఆ రాష్ట్రాలు అనుమానిస్తున్నాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా చివరిసారిగా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అయితే 2026 అనంతరం చేపట్టే తొలి జనగణన తాలూకు ఫలితాలు అందుబాటులోకి వచ్చేదాకా లోక్‌సభ నియోజకవర్గాల తదుపరి పునర్ వ్యవస్థీకరణ జరగరాదని రాజ్యాంగంలోని 82వ ఆర్టికల్ నిర్దేశిస్తోంది. ఆ లెక్కన తాజా జనగణన 2025లో మొదలయ్యే పక్షంలో వాటి ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టడానికి వీలుండదు. అలాగాక వాటి ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ జరపాలంటే 82వ ఆర్టికల్‌ను సవరించాల్సి ఉంటుంది. కనుక ఆ క్రతువును మొదలుపెట్టే ముందు ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
నూతన దంపతులు 16 మందిని కనాలి
చెన్నై: నూతన దంప తులు ఎక్కువ మంది పిల్లల్నికనే విష యం ఆలోచించాల ని తమిళనాడు ము ఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొ న్నారు. ‘తమిళ సంప్రదాయంలో పెద్దలు నూతన దంపతులను 16 సంపదలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తుంటారు. కానీ, నేడు పరిస్థితి మారిపోయింది. 2026 నుంచి చేపట్టనున్న జన గణన, లోక్‌సభ నియోజ కవర్గాల పునర్విభజనతో పుణ్యమాని చిన్న కుటుంబానికి బదులు, 16 మంది సంతానంతో కళకళలాడాలని ఆశీర్వదించాల్సిన రోజులొచ్చాయి’అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం చెన్నైలో జరిగిన సామూహిక వివాహ వేదిక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దేశంలో ఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోనుందని అన్నారు. ‘లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున, మాకు 16 మంది పిల్లలుండాలా అని ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడొచ్చు. అయితే, ఈ విషయం మనం మర్చిపోకూడదు’ అని ఆయన అన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై... విడిగా విచారణ: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని జమ్మూకశ్మీర్ కేసుతో కాకుండా విడిగా విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్, తెలుగు రాష్ట్రాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దాఖలైన వేర్వేరు పిటిషన్లను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాల ధర్మాసనం విచారించింది. జమ్ము కశ్మీర్ అంశంతో తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఎలా జత చేస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. జమ్ము కశ్మీర్ చట్టం 2019లో చేశారని, ఏపీ పునర్విభజన చట్టం 2014లోనే చేశారని పిటిషనర్ పురుషోత్తం రెడ్డి తరఫు న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, రావు రంజిత్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏకీభవించని ధర్మాసనం జమ్మూకశ్మీర్ అంశంతో తెలుగు రాష్ట్రాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో సీట్లపెంపు పిటిషన్లను వేరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. -
సా...గుతున్న కసరత్తు!
పెద్దపల్లిలోకి ధర్మారం కరీంనగర్‌లోనే బెజ్జంకి ముస్తాబాద్పై పునరాలోచన సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాల పునర్విభజన కసరత్తు ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. ఉన్నతాధికారుల నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్లో ఉన్న అన్ని మండలాలు కొత్త జిల్లా పరిధిలోకి వస్తున్నాయా? లేదా? ఒకే రెవెన్యూ డివిజన్లోని మండలాలు రెండేసి జిల్లాల్లో కొనసాగుతున్నాయా? కొత్తగా ఏర్పాటు చేయబోయే రెవెన్యూ డివిజన్లోని అన్ని మండలాలు ఒకే జిల్లాలో పొందుపర్చారా? లేదా? అనే అంశాలపై వివరాలు తెప్పించుకున్న రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు తిరిగి జిల్లా అధికార యంత్రాంగానికి నిరంతరం సూచనలిస్తూనే ఉన్నారు. తెల్లవారితే నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి రావడంతో అధికారులు మరింత లోతుగా కసరత్తు చేశారు. స్వల్ప మార్పులు మినహా ముసాయిదా జాబితాలో పెద్దగా మార్పులేమీ చేయలేదని తెలుస్తోంది. జగిత్యాల జిల్లాకు కేటాయించిన ధర్మారం మండలాన్ని తాజాగా పెద్దపల్లి జిల్లాకు మార్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ధర్మారం మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజన్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇదే డివిజన్లో ఉన్న వెల్గటూర్ మండలాన్ని మాత్రం జగిత్యాల జిల్లాకే కేటాయించినట్లు తెలిసింది. మరోవైపు సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలాన్ని ముసాయిదాలో సిద్దిపేటకు కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపైనా పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. ఈ మండలాన్ని సైతం కరీంనగర్లో కొనసాగించడమే మేలనే భావనతో ఉన్నారు. అట్లాగే బెజ్జంకి మండలంలోని కొన్ని గ్రామాలను సిద్దిపేట జిల్లాలో కలుపుతారని ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఈ మండలాన్ని పూర్తిగా కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించనున్నారు. మండలాల కేటాయింపుల్లో మార్పులు చేర్పుల అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత లేదని, సోమవారం ఉదయానికి జిల్లాల పునర్విభజన ప్రక్రియకు తుదిరూపు వస్తుందని జిల్లా రెవెన్యూ అధికారులు పేర్కొనడం గమనార్హం. -
డ్రాఫ్ట్ సిద్ధం
విభజనపై తుది కసరత్తు సోమవారంలోగా సమగ్ర నివేదికలు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశం ప్రతీ శాఖలో ఫైలును నంబరింగ్ చేస్తున్న వైనం నేడు హైదరాబాద్ అఖిలపక్ష సమావేశం ముకరంపుర : జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. కొత్త జిల్లాల సంఖ్య ఖరారు కావడంతో వాటి భౌగోళిక స్వరూపం, సరిహద్దులపై తుది కసరత్తు చేస్తోంది. జిల్లాలో కరీంనగర్, జగిత్యాలతోపాటు అనూహ్యంగా పెద్దపల్లి జిల్లాలను ఏర్పాటు చేసేందుకు డ్రాఫ్ట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అందుకు అవసరమైన అన్ని వివరాలను సిద్ధం చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాల స్వరూపం, జనాభా, మండలాల చేర్పుల వివరాలను జిల్లా అధికారులు క్రోడీకరిస్తున్నారు. భౌగోళిక స్వరూపం, సరిహద్దులను నిర్ధారించుకుని అందుకనుగుణంగా మ్యాపులను రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను సోమవారంలోగా పంపించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద చర్యలకు ఉపక్రమించింది. విభజన అనంతరం సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, నిధులు, లబ్ధిదారుల వివరాలతో ఉన్న ఫైళ్లకు నంబరింగ్ చేస్తున్నారు. జిల్లాల విభజన తర్వాత ఆయా జిల్లాల వారీగా ఫైళ్లు విభజించే అవకాశాన్ని సులభతరం చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించాలని నిర్ణయించడంతో విభజన ప్రక్రియకు సంబంధించి యుద్ధప్రాతిపదికన నివేదికలు సిద్ధం చేయాలని, కలెక్టర్, జేసీ, డీఆర్వోలు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రేమండ్‌పీటర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారంలోగా సమగ్ర వివరాలు పంపాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై శనివారం సీఎం కేసీఆర సమక్షంలో హైదరాబాద్ అఖిలపక్ష పార్టీల సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాలు, అందులో కలిసే మండలాలకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను ఆయా పార్టీలకు అందజేశారు. వీటిపై అఖిలపక్ష పార్టీల అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. డ్రాఫ్ట్ నివేదిక ప్రకారం ఆయా జిల్లాల్లో కలిసే మండలాలు.. – కరీంనగర్ : కరీంనగర్, మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, వీణవంక, చిగురుమామిడి, సైదాపూర్, బెజ్జంకి, చొప్పదండి, గంగాధర, రామడుగు, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, బోయినపల్లి, వేములవాడ, చందుర్తి, కోనరావుపేట. – జగిత్యాల : జగిత్యాల, సారంగాపూర్, ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్, ధర్మారం, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, రాయికల్, కథలాపూర్. – పెద్దపల్లి : పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, శ్రీరాంపూర్, జూలపల్లి, ఎలిగేడు, మంథని, కమాన్‌పూర్, ముత్తారం, రామగుండం. – భూపాలపల్లి : మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం. – హన్మకొండ : ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట, హుజురాబాద్. – సిద్దిపేట : హుస్నాబాద్, కోహెడ, ఇల్లంతకుంట, బెజ్జంకి, ముస్తాబాద్ మండలాలను సిద్దిపేట కలుపుతూ డ్రాఫ్ట్ రూపొందించారు.