డ్రాఫ్ట్‌ సిద్ధం | districts draft ready | Sakshi
Sakshi News home page

డ్రాఫ్ట్‌ సిద్ధం

Published Fri, Aug 19 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

districts draft ready

  • విభజనపై తుది కసరత్తు
  • సోమవారంలోగా సమగ్ర నివేదికలు
  • అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశం
  • ప్రతీ శాఖలో ఫైలును నంబరింగ్‌ చేస్తున్న వైనం
  • నేడు హైదరాబాద్‌ అఖిలపక్ష సమావేశం 
  • ముకరంపుర : జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. కొత్త జిల్లాల సంఖ్య ఖరారు కావడంతో వాటి భౌగోళిక స్వరూపం, సరిహద్దులపై తుది కసరత్తు చేస్తోంది. జిల్లాలో కరీంనగర్, జగిత్యాలతోపాటు అనూహ్యంగా పెద్దపల్లి జిల్లాలను ఏర్పాటు చేసేందుకు డ్రాఫ్ట్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అందుకు అవసరమైన అన్ని వివరాలను సిద్ధం చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాల స్వరూపం, జనాభా, మండలాల చేర్పుల వివరాలను జిల్లా అధికారులు క్రోడీకరిస్తున్నారు. భౌగోళిక స్వరూపం, సరిహద్దులను నిర్ధారించుకుని అందుకనుగుణంగా మ్యాపులను రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను సోమవారంలోగా పంపించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద చర్యలకు ఉపక్రమించింది. విభజన అనంతరం సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, నిధులు, లబ్ధిదారుల వివరాలతో ఉన్న ఫైళ్లకు నంబరింగ్‌ చేస్తున్నారు. జిల్లాల విభజన తర్వాత ఆయా జిల్లాల వారీగా ఫైళ్లు విభజించే అవకాశాన్ని సులభతరం చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 22న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ వెలువరించాలని నిర్ణయించడంతో విభజన ప్రక్రియకు సంబంధించి యుద్ధప్రాతిపదికన నివేదికలు సిద్ధం చేయాలని, కలెక్టర్, జేసీ, డీఆర్‌వోలు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రేమండ్‌పీటర్‌ ఆదేశాలు జారీ చేశారు. సోమవారంలోగా సమగ్ర వివరాలు పంపాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై శనివారం సీఎం కేసీఆర సమక్షంలో హైదరాబాద్‌ అఖిలపక్ష పార్టీల సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాలు, అందులో కలిసే మండలాలకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను ఆయా పార్టీలకు అందజేశారు. వీటిపై అఖిలపక్ష పార్టీల అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. 
    డ్రాఫ్ట్‌ నివేదిక ప్రకారం ఆయా జిల్లాల్లో కలిసే మండలాలు..  
    – కరీంనగర్‌ : కరీంనగర్, మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, వీణవంక, చిగురుమామిడి, సైదాపూర్, బెజ్జంకి, చొప్పదండి, గంగాధర, రామడుగు, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, బోయినపల్లి, వేములవాడ, చందుర్తి, కోనరావుపేట. 
    – జగిత్యాల : జగిత్యాల, సారంగాపూర్, ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్, ధర్మారం, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, రాయికల్, కథలాపూర్‌. 
    – పెద్దపల్లి : పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, శ్రీరాంపూర్, జూలపల్లి, ఎలిగేడు, మంథని, కమాన్‌పూర్, ముత్తారం, రామగుండం.
    – భూపాలపల్లి : మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం.
    – హన్మకొండ : ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట, హుజురాబాద్‌.
    – సిద్దిపేట : హుస్నాబాద్, కోహెడ, ఇల్లంతకుంట, బెజ్జంకి, ముస్తాబాద్‌ మండలాలను సిద్దిపేట కలుపుతూ డ్రాఫ్ట్‌ రూపొందించారు. 
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement