speedup
-
పోలవరం పరుగులు
-
పరుగులు పెడుతోన్న పోలవరం ప్రాజెక్టు పనులు
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. చంద్రబాబు పాలనలో జరిగిన వైఫల్యాలు, లోపాలు, అక్రమాలు-అవకతవకలు సరిచేస్తూనే సీఎం వైఎస్ జగన్ సర్కారు ముందుకు దూసుకెళ్తోంది. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టును ఓ యజ్ఞం చేపడుతోంది. వేలాది మంది కార్మికుల శ్రమైక్య సౌందర్యంతో పాటు ఆధునిక యంత్ర సామాగ్రి, వేలాది టిప్పర్లు,లారీలు,యంత్రాల రణగొణ ధ్వనుల మధ్య ఓ ప్రపంచ అద్భుత నిర్మాణంగా పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. వందలాది మంది నిపుణులు,ఇంజనీర్లు పర్యవేక్షణలో పనులు పరుగులు పెడుతున్నాయి. గత ప్రభుత్వాలు మాటలకు, గ్రాఫిక్స్ కే పరిమితమైతే , జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం గత రెండేళ్ళుగా చేతల్లో చూపిస్తున్నారు. వరదలు వచ్చినా, కరోనా కలవర పెడుతున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు మాత్రం రెట్టింపు వేగంతో కొనసాగుతున్నాయి. మేఘా ఇంజనీరింగ్ సంస్థ పక్కా ప్రణాళికకు తోడు రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల సహకారంతో నిర్మాణం అంచనాలను తలకిందులు చేస్తూ యుద్ధప్రాతిపతికన పనులు జరుగుతున్నాయి. చంద్రబాబు పోలవరాన్ని సోమవరంగా మార్చాను అని మొండి గోడలకు పరిమితం చేస్తే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆంధ్రుల జీవనాడి తమ లక్ష్యంగా పనులు చేయిస్తోంది. రికార్డ్ స్థాయిలో మేఘా పనులు పోలవరం ప్రాజెక్ట్ లో అంచనాలను మించి పనులు జరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో అంటే ఏప్రిల్ 2020 నుంచి 21 మార్చివరకు 12 నెలల కాలంలో 4,03,160 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని ప్రభుత్వం ప్రతిపాదిస్తే మేఘా ఇంజనీరింగ్ 5,58,073 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని చేసి సత్తాచాటింది. గత ఏడాది మే, జూన్, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలలో ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయే విధంగా కాంక్రీట్ పని చేపట్టింది. గత సంవత్సరంలో మే నెలలో కరోనాను తట్టుకొని 53 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 85,300 క్యూబిక్ మీటర్ల పనిని పూర్తి చేసింది. అలాగే జూన్-2020లో 70 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే రికార్డు స్థాయిలో 1,20,100 క్యూబిక్ మీటర్ల పూర్తి చేసింది. అదేవిధంగా ఫిబ్రవరి 2021లో 47 వేల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు చేయాలని టార్గెట్ పెట్టుకుని 83 వేల క్యూబిక్ మీటర్ల పనులు చేసింది. ఈ సంవత్సరం మార్చి నెలలో 68,600 క్యూబిక్ మీటర్ల లక్ష్యం పెట్టుకోగా, 81,200 క్యూబిక్ మీటర్ల పనులు చేసి తనకు చాటి ఎవ్వరూ లేరు అని నిరూపించుకుంది మేఘా సంస్థ . ప్రతి నెలా అంచనాలను మించి కాంక్రీట్ పనులు చేస్తూ అనుకున్న లక్ష్యం దిశగా పోలవరం ప్రాజెక్ట్ సాగుతోంది. కాంక్రీట్ పని క్యూబిక్ మీటర్లలో నెల జరిగిన పని పని లక్ష్యం ఏప్రిల్-20 36783 36783 మే-20 85300 53263 జూన్-20 120100 72215 జులై-20 20800 27798 ఆగష్టు-20 14500 6148 సెప్టెంబర్-20 14670 6444 అక్టోబర్-20 20058 17607 నవంబర్-20 25997 15691 డిసెంబర్-20 19000 23036 జనవరి-21 36705 28513 ఫిబ్రవరి-21 82956 47047 మార్చి-21 81204 68615 మొత్తం 558073 403160 తుది దశకు స్పిల్ వే పనులు ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తితో తుది దశకు చేరింది. కాంక్రీట్ పనులు, గ్యాలరీలో గ్రౌటింగ్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ప్రభుత్వ సంకల్పానికి తోడు, మేఘా ఇంజనీరింగ్ ప్రణాళికతో ఇప్పటి వరకు స్పిల్ వేలో 2,82,276 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసింది. స్పిల్ వే బ్రిడ్జికి ఏర్పాటు చేయాల్సిన 48 గేట్లకు గానూ 42 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చాల్సి ఉండగా ఇప్పటికే 84 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చారు. మిగతా 12 సిలిండర్లు జర్మనీ నుంచి రావాల్సి ఉంది. అలాగే గేట్లను ఆపరేట్ చేయడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ లకు గానూ 13 పవర్ ప్యాక్ సెట్లను అమర్చారు. వీటితో 26 గేట్లను ఒకేసారి పైకి ఎత్తవచ్చు. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను నిర్వహించవచ్చు. పోలవరం స్పిల్ వేలో పది కి 10 రివర్ స్లూయిజ్ గేట్ల అమరిక ఇప్పటికే పూర్తయ్యింది. వాటికి అమర్చాల్సిన 20 హైడ్రాలిక్ సిలిండర్ల పనులు ముగిశాయి. వీటిని ఆపరేట్ చేయడానికి అమర్చాల్సిన 10 పవర్ ప్యాక్ లకు గానూ 6 పవర్ ప్యాక్ లను ఏర్పాటు చేశారు.ఇంకా 4 పవర్ ప్యాక్‌లను పెట్టాల్సి వుంది. పక్కా ప్రణాళికతో అప్రోచ్ ఛానెల్ పనులు పోలవరం అప్రోచ్ ఛానెల్ లో మట్టి తవ్వకం పనులు పక్కా ప్రణాళికతో చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే అప్రోచ్ ఛానెల్ లో 40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు జరిగాయి. దాదాపు 300 కు పైగా టిప్పర్లు, 100కు పైగా ఎక్సవేటర్లు రాత్రింబవళ్లు పనుచేస్తున్నాయి. అప్పర్ కాఫర్ డ్యాం గ్యాప్ లను మూసివేసి, పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నందున వచ్చే వర్షాకాలం నాటికి స్పిల్‌వే నుంచి నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయాల్సి వుంది. అందులో భాగంగా గోదావరిని సహజ ప్రవాహం నుంచి కుడి వైపునకు 6 కిలోమీటర్ల మేర నీటిని మళ్లించాలి. అందుకు అప్రోచ్ ఛానెల్ (స్పిల్ వే ఎగువన) కీలకమైనది. అప్రోచ్ ఛానెల్ పూర్తి స్థాయిలో తవ్వేందుకు ఆగమేఘాల మీద పనులు సాగుతున్నాయి. కేంద్ర జలసంఘం లక్ష్యాన్ని 4 రెట్లు పెంచడంతో అందుకు తగిన విధంగా మేఘా సంస్థ యుద్ధ ప్రతిపాదికన మట్టి తవ్వకం, రవాణా పనులు చేస్తోంది. వేగంగా స్పిల్ ఛానెల్ పనులు వరదలను సైతం తట్టుకొని స్పిల్ ఛానెల్ లో ఇప్పటి వరకు 22,7,900 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులతో పాటు స్పిల్ ఛానెల్ లో దాదాపు 28,41785 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేసింది మేఘా సంస్థ. ఇక పోలవరంలో అతి కీలకమైన 902 కొండ తవ్వకం పనులు 4,48,487 క్యూబిక్ మీటర్లు పూర్తి చేసింది. గత ప్రభుత్వం తప్పులను సరిదిద్దుతూ ఎగువ కాఫర్ ఢ్యాం పనులు గత ప్రభుత్వం చేసిన ఇంజనీరింగ్ తప్పులను సరిదిద్దుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం,ఎగువ కాఫర్ డ్యాం పనులను శరవేగంగా చేస్తోంది. ఎగువ కాఫర్ డ్యాం రీచ్-1లో డయా ఫ్రంవాల్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి చేసింది. దాంతో పాటు రాక్ ఫిల్లింగ్ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే రీచ్-1 నిర్మాణంతో, అందులో దాదాపు 35 మీటర్ల ఎత్తు కు పనులు జరిగాయి. రీచ్-2 నిర్మాణం పూర్తి స్థాయి 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక రీచ్-3లో గోదావరి నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే పనులు, రీచ్-4 లో రాక్ ఫిల్లింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ మొత్తం ఎగువ కాఫర్ డ్యాంలో ఇప్పటి వరకు 5,77,676 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు జరిగాయి. గ్యాప్-2 ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం పనులు ప్రాజెక్ట్ గ్యాప్-2 లో భాగంగా ఇప్పటికే 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రో కాంపాక్షన్ పనులు పూర్తి అయ్యాయి. అదే విధంగా 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయ్యాయి. పోలవరం జలాశయంలో స్పిల్ వే తో పాటు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం (గ్యాప్-2) కూడా కీలకమైనది. గోదావరి నది ప్రవాహ భాగంలో ఇసుక తిన్నెలపైన దీనిని నిర్మిస్తారు. ఇక్కడ రాతినేల ఎక్కడో లోతుగా ఉండడం వల్ల నిర్మాణ పని పటిష్టత కోసం కేంద్ర జలసంఘం ఆధీనంలోని డిడిఆర్‌పి (డ్యాం డిజైన్ రివ్వ్యూ పానెల్) సూచనల మేరకు పనులను చేపట్టేందుకు అవసరమైన ప్రాథమిక పనులన్నీంటిన్ని కొనసాగుతున్నాయి. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోనే పోలవరం పనులు రాష్ర్ట ప్రభుత్వం నిర్మాణ పనులు చేయిస్తున్నా పర్యవేక్షణ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. ప్రాజెక్ట్ లో అంగుళం పనిలో మార్పులు, చేర్పలైనా కేంద్ర జలసంఘం చేయాల్సిందే. అందులో భాగంగానే జలాశయ పరిరక్షణ, సరైన ప్రయోజనాలు సాధించే దిశగా పనుల పరిమాణం గణనీయంగా పెరిగింది. అందుకే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్పులు, చేర్పులు చేసిన పనుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను సవరించింది. అందులో భాగంగానే దాదాపు 1656 కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనుల్లో పాత పనులను చక్కబెడుతూనే ఓ వైపు లక్ష్యాన్ని అధిగమించే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. చదవండి: పోలవరం ప్రాజెక్టుకు రూ.745.94 కోట్లు -
వేగంగా అభివృద్ధి పనులు
అధికారులకు కలెక్టర్ ఆదేశం కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలో నడుస్తున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో డివిజ¯ŒSలోని తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారికి అవి నిర్మించే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని అన్నారు. గతంలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగిస్తున్నదీ లేనిదీ గుర్తించి, వాడకంలో లేని మరుగుదొడ్లు వినియోగించేలా చైతన్యపరచాలన్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకంలో 200 అడుగుల లోతు లోపు బోర్లు వేసేవారికి సౌర పంపుసెట్లు అందించాలన్నారు. డంపింగ్‌యార్డులు లేని గ్రామాల్లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, నిధులకు కొరత లేదని స్పష్టం చేశారు. పనులు పూర్తయిన వెంటనే సొమ్ము చెల్లిస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న పనులకు ఇసుక కొరత ఉండదని, జిల్లాలోని ఇసుక రీచ్‌ల ద్వారా ఇసుక సరఫరాకు అనుమతించామన్నారు. సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్, గృహనిర్మాణ సంస్థ డీఈ సెల్వరాజ్, డీఆర్డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం రాజేశ్వరరావు, హౌసింగ్ ఈఈ శ్రీనివాసరావు, డివిజనల్ పంచాయతీ అధికారి ఎం.వరప్రసాద్, జిల్లా సహకారాధికారిణి ప్రమీల, డివిజ¯ŒSలోని తహసీల్దార్లు, ఎండీఓలు, పంచాయతీ కార్యదర్శులు, మండల ఇంజనీర్లు, ఏపీఎంలు పాల్గొన్నారు. -
ఆందోళనలు ఉధృతం
సిరిసిల్ల జిల్లా, కోరుట్ల డివిజన్ కోసం కొనసాగుతున్న పోరు కోరుట్ల/సిరిసిల్ల : కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా, సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలు ఉధతమయ్యాయి. కోరుట్లలో జాతీయ రహదారి దిగ్బంధం సందర్భంగా బుధవారం ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ గురువారం పట్టణ బంద్ నిర్వహించారు. వ్యాపార, వ్యాణిజ్య సంస్థలు, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు బంద్ పాటించి కోరుట్ల డివిజన్ కోసం సంఘీభావం ప్రకటించాయి. కోరుట్ల డిపో ఆర్టీసీ బస్సులు నడవలేదు. గురువారం పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ కోరుట్లలో పరిస్థితిని సమీక్షించి నిరసన కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అనవసరమైన ఆందోళనకు దిగవద్దని సూచించారు. ఆగని నిరసనలు.. డివిజన్ సాధన సమితి అ«ధ్వర్యంలో జాతీయ రహదారిపై కష్ణాలయం వద్ద మహిళలు రాస్తరోకో నిర్వహించి బతుకమ్మలు ఆడారు. సుమారు గంట సేపు బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు నిలిపోయాయి. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరిన మహిళలు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మరోసారి ఆందోళనకు దిగారు. టీడీపీ అధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల ముఖచిత్రంతో ఉన్న మాస్క్‌లు ధరించిన కొందరు చెప్పులతో కొట్టుకుని నిరసనలు తెలిపారు. వంటావార్పు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. సిరిసిల్లలో కాగడాల ప్రదర్శన సిరిసిల్ల జిల్లా కోసం జేఏసీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కొత్త బస్టాండు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా నేతన్న చౌక్ వరకు కాగడాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్షం, జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాను ప్రకటించేలా చూడాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. జిల్లా సాధించే దాకా పోరాటం సాగిస్తామని ప్రకటించారు. కోర్టు సమీపంలో మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీని దహనం చేసేందుకు రాగుల రాములు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు జేఏసీ నాయకులకు వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ.. జేఏసీ నాయకులు నేతన్న విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. పోలీస్ జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. సిరిసిల్ల సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తీరుపై జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న కాగడాల ప్రదర్శనను పోలీసులు విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. రాత్రి వరకు రాస్తారోకో కొనసాగింది. కేటీఆర్ సిరిసిల్ల ద్రోహిగా మారొద్దు – ఓయూ జేఏసీ నేత దరువు ఎల్లన్న మంత్రి కె.తారకరామారావు సిరిసిల్ల ద్రోహిగా మారొద్దని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత దరువు ఎల్లన్న కోరారు. సిరిసిల్లలో గురువారం రాస్తారోకో, ప్రదర్శన నిర్వహించారు. అన్ని అర్హతలు ఉన్న సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. అందరు ఐఖ్యంగా ఉద్యమిస్తే సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించి, ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. కాంగ్రెస్ నాయకులు కేకే.మహేందర్‌రెడ్డి, జేఏసీ నాయకులు రమాకాంత్‌రావు, కత్తెర దేవదాస్, ఆడెపు రవీందర్, మహేశ్‌గౌడ్, రాగుల రాములు, బుస్సా వేణు, యాదగిరి, సిరిసిల్ల జిల్లా సాధన సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లారీలతో ర్యాలీ నిర్వహించారు. -
రెండో ఏఎన్ఎంల ఆందోళన ఉధృతం
మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి యత్నం ఆదిలాబాద్ టౌన్ : రెండో ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఇంటి ముట్టడికి ఏఎన్ఎంలు యత్నించారు. మంత్రి ఇంటి సమీపంలోకి చేరుకున్న ఏఎన్ఎంలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దాదాపు గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు వెంకటమ్మ, లలిత, పుష్ప, సుమంగళి, సునిత, మమత, అరుణ, సువర్ణ, ముంతాజ్, పద్మ, లక్ష్మి, సుజాత పాల్గొన్నారు. నిర్మల్‌లో... నిర్మల్ రూరల్ : తమను క్రమబద్ధీకరించాలంటూ రెండో ఏఎన్ఎంలో చేపట్టిన ఆందోళన శనివారం తీవ్రమైంది. కొన్ని రోజులుగా దీక్ష చేపడుతున్న తమను పట్టించుకోవడం లేదంటూ నిర్మల్‌లోని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి పీఏకు వినతిపత్రం అందించారు. రెండో ఏఎన్ఎంలు రాధ, లతీఫా, శోభ, మంజుల, పద్మ, సునీత, అనిత, అనసూయ, ఉమ పాల్గొన్నారు. ఖానాపూర్‌లో... ఖానాపూర్ : సెకండ్ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల అన్నారు. శనివారం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని సెకండ్ ఏఎన్ఎమ్ల ఆధ్వర్యంలో ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంటిని ముట్టడించారు. నాయకులు సముద్ర, విజయప్రభ, యోత్సేనా, చంద్రకళ, స్వాతి, ఆర్.గంగామణి, గంగరాజు, శోభ, లక్ష్మి, పార్వతి, రాద, పద్మ, సుగుణ, కమల, స్వరూప, సారిక, విమల పాల్గొన్నారు. -
డ్రాఫ్ట్ సిద్ధం
విభజనపై తుది కసరత్తు సోమవారంలోగా సమగ్ర నివేదికలు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశం ప్రతీ శాఖలో ఫైలును నంబరింగ్ చేస్తున్న వైనం నేడు హైదరాబాద్ అఖిలపక్ష సమావేశం ముకరంపుర : జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. కొత్త జిల్లాల సంఖ్య ఖరారు కావడంతో వాటి భౌగోళిక స్వరూపం, సరిహద్దులపై తుది కసరత్తు చేస్తోంది. జిల్లాలో కరీంనగర్, జగిత్యాలతోపాటు అనూహ్యంగా పెద్దపల్లి జిల్లాలను ఏర్పాటు చేసేందుకు డ్రాఫ్ట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అందుకు అవసరమైన అన్ని వివరాలను సిద్ధం చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాల స్వరూపం, జనాభా, మండలాల చేర్పుల వివరాలను జిల్లా అధికారులు క్రోడీకరిస్తున్నారు. భౌగోళిక స్వరూపం, సరిహద్దులను నిర్ధారించుకుని అందుకనుగుణంగా మ్యాపులను రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను సోమవారంలోగా పంపించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద చర్యలకు ఉపక్రమించింది. విభజన అనంతరం సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, నిధులు, లబ్ధిదారుల వివరాలతో ఉన్న ఫైళ్లకు నంబరింగ్ చేస్తున్నారు. జిల్లాల విభజన తర్వాత ఆయా జిల్లాల వారీగా ఫైళ్లు విభజించే అవకాశాన్ని సులభతరం చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించాలని నిర్ణయించడంతో విభజన ప్రక్రియకు సంబంధించి యుద్ధప్రాతిపదికన నివేదికలు సిద్ధం చేయాలని, కలెక్టర్, జేసీ, డీఆర్వోలు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రేమండ్‌పీటర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారంలోగా సమగ్ర వివరాలు పంపాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై శనివారం సీఎం కేసీఆర సమక్షంలో హైదరాబాద్ అఖిలపక్ష పార్టీల సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాలు, అందులో కలిసే మండలాలకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను ఆయా పార్టీలకు అందజేశారు. వీటిపై అఖిలపక్ష పార్టీల అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. డ్రాఫ్ట్ నివేదిక ప్రకారం ఆయా జిల్లాల్లో కలిసే మండలాలు.. – కరీంనగర్ : కరీంనగర్, మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, వీణవంక, చిగురుమామిడి, సైదాపూర్, బెజ్జంకి, చొప్పదండి, గంగాధర, రామడుగు, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, బోయినపల్లి, వేములవాడ, చందుర్తి, కోనరావుపేట. – జగిత్యాల : జగిత్యాల, సారంగాపూర్, ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్, ధర్మారం, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, రాయికల్, కథలాపూర్. – పెద్దపల్లి : పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, శ్రీరాంపూర్, జూలపల్లి, ఎలిగేడు, మంథని, కమాన్‌పూర్, ముత్తారం, రామగుండం. – భూపాలపల్లి : మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం. – హన్మకొండ : ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట, హుజురాబాద్. – సిద్దిపేట : హుస్నాబాద్, కోహెడ, ఇల్లంతకుంట, బెజ్జంకి, ముస్తాబాద్ మండలాలను సిద్దిపేట కలుపుతూ డ్రాఫ్ట్ రూపొందించారు. -
దుర్గాఘాట్‌పై దృష్టి పెట్టండి
అధికారులకు మంత్రి ఉమా ఆదేశాలు వసతుల కల్పనలో అలసత్వంపై కమిషనర్ ఆగ్రహం విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గాఘాట్‌లో పుష్కర పనులపై మంత్రులు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ శుక్రవారం దుర్గాఘాట్‌ను పరిశీలించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించగా, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఘాట్ పనులపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. దుర్గాఘాట్ పరిస్థితిపై ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురించిన ‘అదిగో పుష్కరం... ఎప్పటికీ పరిష్కారం?’ కథనానికి స్పందించిన మంత్రి దేవినేని ఉమా, మేయర్ కోనేరు శ్రీధర్ ఘాట్‌కు చేరుకుని పనుల తీరుపై అధికారులను ప్రశ్నించారు. రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద పనులు, దుర్గాఘాట్‌లో రావిచెట్టు వద్ద మట్టికుప్పలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తామన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ పనులు సాగుతున్నాయన్నారు. దుర్గాఘాట్‌లో మౌలిక వసతులు కల్పించాలి దుర్గాఘాట్, మోడల్ గెస్ట్‌హౌస్‌లో మౌలిక వసతులు కల్పించడంలో ఎందుకు ఆలస్యం అవుతోందని మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గాఘాట్‌ను శుక్రవారం ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. -
ఎంసెట్-2 లీకేజీపై విచారణ ముమ్మరం
పరకాల(వరంగల్): పరీక్షకు ముందే పేపర్ లీకైనట్లు బాధిత తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎంసెట్-2పై సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. ఇందులో వరంగల్ జిల్లా పరకాల, భూపాలపల్లి ప్రాంతాల నుంచి కొందరి మార్కులు, ర్యాంకులపై అనుమానాలు రావడంతో అధికారుల దృష్టి అంతా ఇటు వైపే ఉంది. ఎంసెట్-2 అక్రమాలపై పోలీసు, ఇంటెల్జెన్స్ అధికారులు వివరాలను ఇది వరకే సేకరించగా శనివారం సీఐడీ అధికారులు బాధితుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం తీసుకుంటున్నట్లు తెలిసింది. సీఐడీ డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు స్వయంగా ఫోన్లో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లో ఎంతమందికి అక్రమంగా ర్యాంకులు వచ్చాయో తెలుసుకున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటీ అనే కోణంలో ఆరా తీశారు. ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్-1, టీఎస్ ఎంసెట్-2లో వచ్చిన మార్కులు, ర్యాంకులను ప్రస్తావిస్తూ బాధితులు క్షుణ్ణంగా వివరించినట్లు తెలిసింది. కేవలం 40 రోజుల వ్యవధిలోనే జరిగిన పరీక్షల్లో వేలల్లో ఉన్న ర్యాంకులు వందల్లోకి వచ్చాయని వివరించారు. కోచింగ్ సెంటర్లో అంతగా ప్రతిభ కనబర్చనప్పటికీ మొదటిసారి పరీక్షకు హాజరైన విద్యార్థుల ర్యాంకులు అనుమానాలకు తావిస్తోందని చెప్పినట్లు తెలిసింది. ఒకే సెంటర్లో శిక్షణ పొంది సరిగ్గా వారం కిందటనే రహస్య ప్రాంతానికి తరలివెళ్లారని చెప్పినట్టు సమాచారం. -
ఇక సుడిగాలిలా...!